గురువును ఆశ్రయించే విధానం ఏమిటి

మనిషికి జ్ఞానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. భగవంతుడు గీతలో చెప్పాడు “న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే” అని. జ్ఞానానికంటే పవిత్రమైనది మరొకటి లేదు అని. కనుక మనిషికి అత్యావశ్యకమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని గురువువల్ల మాత్రమే పొందడానికి వీలు అవుతుంది. అందువల్లనే జ్ఞానోపదేశం చేసి శిష్యుణ్ణి సంసారాంబుధి నుండి తరింపజేయగలిగినటువంటి వాడు గనుక గురువుకు అత్యంత ప్రాధాన్యం శాస్త్రంలో చెప్పబడింది.
గురువును ఆశ్రయించే విధానం ఏమిటి అంటే దానికి కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. “తద్విద్ధి ప్రణిపాతేణ పరిప్రశ్నేన సేవాయా! ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః” – గురువు సన్నిధిలో పునీతుడవై గురువుయొక్క సేవలొనర్చి, గురువుకు నమస్కరించి, గురువుగారి సన్నిధిలో నీయొక్క సందేహాన్ని వెలిబుచ్చి వారివల్ల నీ సందేహములను పరిష్కరించుకోవలసినది. ఆ గురువుయొక్క అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. దానివల్ల నీవు శ్రేయస్సు పొందుతావు అని భగవంతుడు చెప్పాడు.
శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం నుంచి

Photo: మనిషికి జ్ఞానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. భగవంతుడు గీతలో చెప్పాడు “న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే” అని. జ్ఞానానికంటే పవిత్రమైనది మరొకటి లేదు అని. కనుక మనిషికి అత్యావశ్యకమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని గురువువల్ల మాత్రమే పొందడానికి వీలు అవుతుంది. అందువల్లనే జ్ఞానోపదేశం చేసి శిష్యుణ్ణి సంసారాంబుధి నుండి తరింపజేయగలిగినటువంటి వాడు గనుక గురువుకు అత్యంత ప్రాధాన్యం శాస్త్రంలో చెప్పబడింది.
గురువును ఆశ్రయించే విధానం ఏమిటి అంటే దానికి కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. “తద్విద్ధి ప్రణిపాతేణ పరిప్రశ్నేన సేవాయా! ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః” – గురువు సన్నిధిలో పునీతుడవై గురువుయొక్క సేవలొనర్చి, గురువుకు నమస్కరించి, గురువుగారి సన్నిధిలో నీయొక్క సందేహాన్ని వెలిబుచ్చి వారివల్ల నీ సందేహములను పరిష్కరించుకోవలసినది. ఆ గురువుయొక్క అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. దానివల్ల నీవు శ్రేయస్సు పొందుతావు అని భగవంతుడు చెప్పాడు.
శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం నుంచి

No comments:

Post a comment