'తతో రావణనీతాయాః'

తతో రావణనీతాయాః సీతాయాశ్శత్రుకర్శనః!
ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి!!
రావణుని చేత అపహరింపబడిన సీతమ్మ తల్లి జాడను కనిపెట్టడం కోసమని చారణులు వెళ్ళేమార్గంలో వెళ్ళుట కొరకు హనుమ సంకల్పించాడు లేదా శత్రుకర్శనుడయినవాడు సంకల్పించాడు. కిష్కింధాకాండ చివర హనుమ మహేంద్రగిరి శిఖరాల మీద బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి, ఇక్కడ హనుమ అనే నామవాచకాన్ని ప్రయోగించక పోయినా, శత్రుకర్శన అన్నప్పుడు శత్రువులను జయించిన హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మనకు హనుమే అని తెలుస్తుంది. ఈ శ్లోకంలో హనుమ అనేమాట వాడలేదు.
ఈ ఒక్క శ్లోకం మీద భారతదేశంలో కొన్ని వందల వందల పేజీల రిసెర్చి చేసి వ్యాఖ్యానాలు వ్రాసిన వారు ఉన్నారు. ఈ ఒక్క శ్లోకంతో తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ శ్లోకాన్ని పారాయణ సంప్రదాయంలో మంత్రమని పిలుస్తారు. అందునా విశేషించి గాయత్రీ మంత్రంలో "వ" అనబడే బీజాక్షరం రావణ అన్నచోట మధ్యలో 'వ'గా వస్తుంది. ఈ 'వ' అనే అక్షరం గాయత్రీ మంత్రంలో పన్నెండవ అక్షరమయిన 'వ'. అందుకని పరమశక్తిమంతమయిన బీజాక్షరంతో ప్రారంభమవుతోంది. సుందరకాండకు వున్నా గొప్పతనం - తనంతతానుగా మంగళాచరణంతో ప్రారంభం అయిపొయింది. ఎందుచేతనంటే సుందరకాండను - 'తతో రావణనీతాయాః' అంటూ ప్రారంభించారు. తత్ అంటేనే పరబ్రహ్మ స్వరూపం.

Photo: తతో రావణనీతాయాః సీతాయాశ్శత్రుకర్శనః!

No comments:

Post a Comment