దానం విషయంలో ఏ ఉన్నత భావాలుండాలో, ఎటువంటి భావాలు ఉండకూడదో శ్రుతిమాత స్పష్టంగా ఇలా శాసించింది.

శ్రద్ధయా దేయం
అశ్రద్ధయా అదేయం
శ్రియాదేయం
హ్రియాదేయం
భియాదేయం
సంవిదాదేయం

దానం - శ్రద్ధతో ఇవ్వాలి. అశ్రద్ధతో ఇవ్వకూడదు. సంపదకు తగ్గట్టుగా ఇవ్వాలి. సిగ్గుతో ఇవ్వాలి. భయంతో ఇవ్వాలి. బాగా తెలుసుకొని ఇవ్వాలి.( తైత్తిరీయోపనిషత్తు)

దానం చెయ్యాలన్న సద్బుద్ధి కలిగినప్పుడు, శ్రద్ధాభక్తులతో, వినయవిధేయతలతో , ప్రేమతో , శుభాన్ని మనస్ఫూర్తిగా కోరుతూ దానం ఇవ్వాలి. దానం అశ్రద్ధతో చెయ్యకూడదు. అవిధేయత, నిర్లక్ష్యం, అహం భావం, పదవీ అధికార దర్పాదులు ఎన్నో అవలక్షణాలు ఉన్న దాతలే దానాల్ని అశ్రద్ధతో చేస్తారు. అటువంటి దాతకు చిత్తం శుద్ధిపడదు. ఇహపరలోకాల్లో దానఫలం దక్కదు. నిజానికి అశ్రద్ధతో ఇచ్చేదానం అసత్తే అని శంకర భాష్యం ( భగవద్గీత)

Photo: దానం విషయంలో ఏ ఉన్నత భావాలుండాలో, ఎటువంటి భావాలు ఉండకూడదో శ్రుతిమాత స్పష్టంగా ఇలా శాసించింది.

శ్రద్ధయా దేయం
అశ్రద్ధయా అదేయం
శ్రియాదేయం
హ్రియాదేయం
భియాదేయం
సంవిదాదేయం

దానం - శ్రద్ధతో ఇవ్వాలి. అశ్రద్ధతో ఇవ్వకూడదు. సంపదకు తగ్గట్టుగా ఇవ్వాలి. సిగ్గుతో ఇవ్వాలి. భయంతో ఇవ్వాలి. బాగా తెలుసుకొని ఇవ్వాలి.( తైత్తిరీయోపనిషత్తు)

దానం చెయ్యాలన్న సద్బుద్ధి కలిగినప్పుడు, శ్రద్ధాభక్తులతో, వినయవిధేయతలతో , ప్రేమతో , శుభాన్ని మనస్ఫూర్తిగా కోరుతూ దానం ఇవ్వాలి. దానం అశ్రద్ధతో చెయ్యకూడదు. అవిధేయత, నిర్లక్ష్యం, అహం భావం, పదవీ అధికార దర్పాదులు ఎన్నో అవలక్షణాలు ఉన్న దాతలే దానాల్ని అశ్రద్ధతో చేస్తారు. అటువంటి దాతకు చిత్తం శుద్ధిపడదు. ఇహపరలోకాల్లో దానఫలం దక్కదు. నిజానికి అశ్రద్ధతో ఇచ్చేదానం అసత్తే అని శంకర భాష్యం ( భగవద్గీత)

No comments:

Post a comment