బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ నైమిశారణ్యం లోకి ప్రవేశించాడు

ఒకానొకప్పుడు బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ నైమిశారణ్యం లోకి ప్రవేశించాడు. అప్పుడక్కడ మునులు దీర్ఘ సత్రయాగం జరుపుతూ వున్నారు. వారంతా బలరామునకు ఎదురేగి వినయంతోస్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. బలరాముడు సంతసించి సపరివారంగా ఆసీనుడైనాడు. తక్కిన మునుల లాగా తనకెదురుగా వచ్చి స్వాగతమిచ్చి అతిథి పూజలు చేయకుండా ఉన్నతాసనం మీద కూర్చున్న ప్రజ్ఞా సమేతుడైన సూతుణ్ణి బలరాముడు చూశాడు. సూతుని నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహించి ఇలా అన్నాడు. "వీడు నన్ను చూచి లేవకపోవడానికి కారణం ఏమో? ఈ సూతుడు మహర్షులున్న సభలో తానే పెద్దనని తలంచి దురభిమానంతో ప్రవర్తించాడు. వ్యాసుని వద్ద కొన్ని కథలూ, గాధలు నేర్చి విద్వాంసుడనని విర్రవీగుతున్నాడు. నీచులభ్యసించే విద్య వారిలో మదాన్నే పెంచుతుంది. కాని సత్త్వగుణాన్ని పెంచదు. మేము ధర్మ సంరక్షణ కోసం పుట్టాము. ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం మాకర్తవ్యం'. అని పలికి తన చేతిలోని కుశాగ్రంతో సూతుణ్ణి వధించాడు. అది చూచి అక్కడి మునులంతా హాహాకారాలు చేశారు. వారు బలరామునితో ఇలా అన్నారు. మహాత్మా! మేము ఇతనికి బ్రహ్మాసనం ఇచ్చాము. అందుచేత నీవు వచ్చినప్పుడు యితడు లేవలేదు. ఇదంతా నీకు తెలియని విషయం కాదు. నీకు తెలియని ధర్మం ఉంటుందా? తెలిసి తెలిసీ బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టావు. ఈ పాపం నిష్కృతి కావడానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ధర్మానికి మనుగడ ఉండదు. గనుక నీవు ఆ కార్యం తలపెట్టాలి." ఇలా పలుకుతున్న మహర్షుల మాటలు విని బలరాముడు వారితో "తొందరపాటు వాళ్ళ ఇంతటి పాపం చేశాను. దీనికి ప్రాయశ్చిత్త మార్గం మీరే తెలపాలి. నా యోగమాయా ప్రభావంతో సూతుణ్ణి బ్రతికించి అతన్ని మహాశక్తిమంతునిగా చేయగలను. అది మీకిష్టమేనా?" అన్నాడు. " నీ అస్త్ర మహాత్మ్యానికీ, మృత్యువుకూ, మాకూ ఎలాంటి ఉపద్రవం కలుగకుండా నీ ఇష్టప్రకారం చేయవలసిం'దని ఋషులు బలరామునితో అన్నారు.
ఓ మహర్షులారా! ఈ సూతపుత్రుడు ఆయువునూ, ఆత్మశక్తినీ, రోగంలేని తనువునూ, విద్యాదక్షతనూ పొందినవాడై ఈలోకంలో ప్రకాశిస్తాడు. అని పలికి సూతుణ్ణి బ్రతికించి మునులతో మళ్ళీ ఇలా అన్నాడు. "నేను తెలియక చేసిన అపరాధం శాంతించేలాగు మీకిష్టమైన కార్యం ఏదైనా చేస్తాను చెప్పండి" అని పలికిన బలరాముని మాటలకు ఋషులు పరమానందం చెంది "బాలరామా! ఇల్వలుడనే రాక్షసుని కొడుకు పల్వలుడు. వాడు గర్వితుడై పట్టుదలతో ప్రతి పర్వం నాడూ వచ్చి యజ్ఞశాలలో మలమూత్రాలనూ, చీమునెత్తురులనూ, మద్యమాంసాలనూ కురిపించి వాటిని పాడుచేస్తున్నాడు. కనుక దుర్మార్గుడైన ఆ రాక్షసుని చంపితే మాకదే సంతోషదాయకం. నీవాపని చేసిన తర్వాత పండ్రెండు మాసాలు నిర్మలమైన హృదయంతో భారతదేశంలో ఉన్న సకల పుణ్యతీర్థాలనూ సేవించి వాటిలో స్నానం చెయ్యి. అలా చేస్తే సమస్త పాపాలూ తొలగిపోతాయి. మునులు చెప్పిన విధంగానే బలరాముడు పల్వలుని సంహరించాడు. అది చూచి మహర్షులు అందరూ బలరాముణ్ణి స్తుతించారు.

Photo: ఒకానొకప్పుడు బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ నైమిశారణ్యం లోకి ప్రవేశించాడు. అప్పుడక్కడ మునులు దీర్ఘ సత్రయాగం జరుపుతూ వున్నారు. వారంతా బలరామునకు ఎదురేగి వినయంతోస్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. బలరాముడు సంతసించి సపరివారంగా ఆసీనుడైనాడు. తక్కిన మునుల లాగా తనకెదురుగా వచ్చి స్వాగతమిచ్చి అతిథి పూజలు చేయకుండా ఉన్నతాసనం మీద కూర్చున్న ప్రజ్ఞా సమేతుడైన సూతుణ్ణి బలరాముడు చూశాడు. సూతుని నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహించి ఇలా అన్నాడు. "వీడు నన్ను చూచి లేవకపోవడానికి కారణం ఏమో? ఈ సూతుడు మహర్షులున్న సభలో తానే పెద్దనని తలంచి దురభిమానంతో ప్రవర్తించాడు. వ్యాసుని వద్ద కొన్ని కథలూ, గాధలు నేర్చి విద్వాంసుడనని విర్రవీగుతున్నాడు. నీచులభ్యసించే విద్య వారిలో మదాన్నే పెంచుతుంది. కాని సత్త్వగుణాన్ని పెంచదు. మేము ధర్మ సంరక్షణ కోసం పుట్టాము. ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం మాకర్తవ్యం'. అని పలికి తన చేతిలోని కుశాగ్రంతో సూతుణ్ణి వధించాడు. అది చూచి అక్కడి మునులంతా హాహాకారాలు చేశారు. వారు బలరామునితో ఇలా అన్నారు. మహాత్మా! మేము ఇతనికి బ్రహ్మాసనం ఇచ్చాము. అందుచేత నీవు వచ్చినప్పుడు యితడు లేవలేదు. ఇదంతా నీకు తెలియని విషయం కాదు. నీకు తెలియని ధర్మం ఉంటుందా? తెలిసి తెలిసీ బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టావు. ఈ పాపం నిష్కృతి కావడానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ధర్మానికి మనుగడ ఉండదు. గనుక నీవు ఆ కార్యం తలపెట్టాలి." ఇలా పలుకుతున్న మహర్షుల మాటలు విని బలరాముడు వారితో "తొందరపాటు వాళ్ళ ఇంతటి పాపం చేశాను. దీనికి ప్రాయశ్చిత్త మార్గం మీరే తెలపాలి. నా యోగమాయా ప్రభావంతో సూతుణ్ణి బ్రతికించి అతన్ని మహాశక్తిమంతునిగా చేయగలను. అది మీకిష్టమేనా?" అన్నాడు. " నీ అస్త్ర మహాత్మ్యానికీ, మృత్యువుకూ, మాకూ ఎలాంటి ఉపద్రవం కలుగకుండా నీ ఇష్టప్రకారం చేయవలసిం'దని ఋషులు బలరామునితో అన్నారు. 
ఓ మహర్షులారా! ఈ సూతపుత్రుడు ఆయువునూ, ఆత్మశక్తినీ, రోగంలేని తనువునూ, విద్యాదక్షతనూ పొందినవాడై ఈలోకంలో ప్రకాశిస్తాడు. అని పలికి సూతుణ్ణి బ్రతికించి మునులతో మళ్ళీ ఇలా అన్నాడు. "నేను తెలియక చేసిన అపరాధం శాంతించేలాగు మీకిష్టమైన కార్యం ఏదైనా చేస్తాను చెప్పండి" అని పలికిన బలరాముని మాటలకు ఋషులు పరమానందం చెంది "బాలరామా! ఇల్వలుడనే రాక్షసుని కొడుకు పల్వలుడు. వాడు గర్వితుడై పట్టుదలతో ప్రతి పర్వం నాడూ వచ్చి యజ్ఞశాలలో మలమూత్రాలనూ, చీమునెత్తురులనూ, మద్యమాంసాలనూ కురిపించి వాటిని పాడుచేస్తున్నాడు. కనుక దుర్మార్గుడైన ఆ రాక్షసుని చంపితే మాకదే సంతోషదాయకం. నీవాపని చేసిన తర్వాత పండ్రెండు మాసాలు నిర్మలమైన హృదయంతో భారతదేశంలో ఉన్న సకల పుణ్యతీర్థాలనూ సేవించి వాటిలో స్నానం చెయ్యి. అలా చేస్తే సమస్త పాపాలూ తొలగిపోతాయి.  మునులు చెప్పిన విధంగానే బలరాముడు పల్వలుని సంహరించాడు. అది చూచి మహర్షులు అందరూ బలరాముణ్ణి స్తుతించారు.

No comments:

Post a Comment