మన సంతతికి మనం ఇవ్వవలసినది

దేనిని మనము చేర్చవలసి వుంటుంది? సుకృతములా లేక దుష్కృతములా?
మన సంతతి మన కర్మఫలములను మోసేవారు. మనము మన పూర్వీకుల కర్మ ఫలముల భారమును మోయుచున్నాము. అందువల్ల మనమందరు కర్మఫలములను మోయు వాళ్ళమే. 
మన పూర్వీకుల పాప పుణ్య ఫల ఫలితమే మనం. మన పాప పుణ్య ఫలమే మన సంతతి. అందుకే ఒక నానుడి 
"పూర్వజన్మ కృతం పాపం పుత్రరూపేణ బాధతే" అని చెప్పేవాళ్ళు . మన దేహం మన పూర్వీకుల అణువు నుండి వచ్చింది దీనినే ఆంగ్లేయులు జీన్స్ అంటారు. దీనిని శాస్త్రము సైన్సు రెండు ఒప్పుకుంటుంది అందుకే మనము వైద్యుని వద్దకు చికిత్స నిమిత్తం వెళ్లినప్పుడు ఈ బాధ మీ వంశంలో నాన్నకో, తాతకో, ముత్తాతకో వున్నదా? వారు దీని వల్ల బాధపడ్డారా? అని అడుగుతారు.
ఒక రోగము మట్టుకే కాదు వంశావళిగా వచ్చేది అణుకువ, బుద్ది, జ్ఞానం, వివేకం నడత, భావన, లాభ నష్టాలు, జయాపజయాలు అన్ని వంశావళిగా సంక్రమించేదే. పెద్దల వంశావళిగా మనకు సంక్రమించిన వ్యాధులకు చికిత్స ఎలా తీసుకుంటామో అదే విధముగా మనకు సంప్రాప్తించే పాప నివృత్తికి కూడా పరిహారాదులు దైవీకముగా చేసుకోవలసి వుంటుంది.
మనకు బోధించే శాస్త్రములు యేమని గమనించితే తెలుస్తుంది. నువ్వు చేసే పాపకృత్యములు ఎవ్వరూ చూడడంలేదు అనే నీ అజ్ఞానం కేవలం అపోహే. నీలోని నీ అణువాంకురమైన నీ పిల్లలు తగిన తరుణమునకు వేచి వున్నారు. వారు పడే బాధ నీ కర్మఫలమే అనేది అప్పుడు గ్రహించగలవు.
మన సంతతి మన దుష్కృతముల వల్ల బాధపడకూడదు అనుకుంటే వారు బాగుపడటానికి మనం పుణ్యకార్యములు చేయవలసి వుంటుంది. ఏది చేస్తే మన సంతతి సుఖ సంతోషములతో వుంటుంది అంటే మనము చేసే పుణ్య కార్యములు వాటి వల్ల. మన సంతతి ఎన్ని తరాలు సుఖపడుతారు అని శాస్త్ర వచనము చూద్దాము
౧. బీదలైన అన్నార్తులకు ఆహారం అమర్చడం వల్ల మూడు తరాలు సుఖములను అనుభవిస్తారు
౨. పుణ్య నదీ స్నానం సంకల్ప పూర్వకంగా చేయడం వల్ల మూడు తరాలు సుఖములు అనుభవిస్తారు
౩. కోవెలలో దీపము నిరంతరం వెలగటానికి ఏర్పాటుచేస్తే ఐదు తరాలు సుఖులుగా వుంటారు
౪.జాతిమతభేదం లేక అన్నదానం చేస్తే, బీద ఆడపిల్లకు వివాహమునకు సహాయము అందిస్తే ఐదు తరాలు సుఖులుగా వుంటారు
౫. లేమివల్ల పితృకార్యములు చేయలేని వాళ్లకు సహాయపడి వారిచేత చేయిస్తే ఆరు తరాలు సుఖులుగా వుంటారు
౬ దేవాలయ జీర్ణోద్ధరణకు సహాయ పడితే ఏడు తరాలు సుఖులుగా వుంటారు
౭. అనాధ ప్రేత సంస్కారమునకు సహాయ సంస్కారములు అందిస్తే తొమ్మిది తరాలు సుఖులుగా వుంటారు
౮ గో సంరక్షణ చేస్తే పదునాలుగు తరములు సుఖులుగా వుంటారు
౯ గయా క్షేత్రములో పితరులకు పిండ దానం చేయడం, మాతృగయలో తల్లికి పిండదానం చేయడం, వైదీకముగా సాలంకృత కన్యా దానము చేయడం వల్ల ఇరువది ఒక్క తరాలు సుఖులుగా వుంటారు
అందువల్ల మనము మన వల్ల మాలినంత పుణ్యకార్యములు చేద్దాం. మన సంతతికి మంచి మార్గం ఏర్పరుద్దాం!!

No comments:

Post a Comment