Why to feed Food to Crow

Lord Shani

శ్రీ పంచమి / వసంత పంచమి (శనివారం, 13.02.2016)

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీదేవి. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి, సరస్వతీ జయంతి అని జరుపుకుంటారు. సరస్వతీదేవిని వేదమాతగా, వాగేశ్వరిగా, శారదగా అభివర్ణించారు. చదువుల తల్లి, అక్షరాల ఆధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని, సరస్వతీదేవి జన్మదినం మాఘ మాసం శుక్ల పంచమి. శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మ దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డంగా ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకాలను చేతులలో ధరించి ఉంటుంది అని పద్మపురాణంలో చెప్పబడింది.
మాఘశ్య శుక్ల పంచమ్యాం
మానవో మనవోదేవా మునీంద్రాశ్చ ముముక్షవః
వసవో యోగినస్సిద్ధ నాగా గంధర్వ రాక్షసాః
మధ్వరేణ కరిష్యంతి కల్పే కల్పే లయావధి
భక్తియుక్తశ్చ దత్త్వా చోపచారాణి షోడశ
మాఘ శుద్ధ పంచమినాడు ఈ విశ్వమంతా మానవులు, మనువులు, దేవతలు, మునులు, ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ సరర్వతీదేవిని ఆరాధిస్తారని దేవీ భాగవతం వల్ల తెలుస్తుంది. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వటిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. పంచమినాడు సరస్వతీదేవితో పాటు, శ్రీమహావిష్ణువు, పరమశివుడు, సూర్య భగవానుణ్ణి కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. శ్రీ పంచమినాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే అపారమైన జ్ఞానం లభిస్తుందని, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు ఉదయాన్నే లేచి, స్నానాధికాలు పూర్తిచేసుకుని అమ్మవారి అమ్మవారిని తెల్లని వస్త్రాలు, పువ్వులు, పూసలతో అలంకరించాలి.
క్షోణితలంబున్ నుదురు సోకక మ్రొక్కినుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి దోయజూతభావచిత్త వశీకరణైక వాణికిన్
వణికి నక్షదామశుక వారిజపుస్తక రమ్యపాణికిన్
నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి దేవతలను రక్షించే ఆమెకు, బ్రహ్మదేవుని మనస్సును వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీదేవికి నా నుదురు నేలను తాకేటట్లు వంగి భక్తితో నమస్కరిస్తాను అంటూ సరస్వతీదేవికి నమస్కరించాలి.
సరస్వతీదేవికి ప్రీతికరమైన తెల్లని నైవేద్యాలు అంటే పెరుగు, వెన్న, వరిపేలాలు తెల్లనువ్వుల ఉండలు, పాలకోవా, చెక్కెర, చెరుకురసం, బెల్లం, తేనె, కొబ్బరికాయ వంటికి నివేదించాలి.
శ్రీపంచమి నాడు రతి కామ దమనోత్సవం అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున రతీదేవి కామదేవ పూజ చేసినట్లుగా పౌరాణికులు చెబుతున్నారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవుడికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వలన మనుషుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయని పూరాణ వచనం. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది.
పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి ఉత్సవం చేయవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నమ్మకం. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి, బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అని వ్రత చూడామణిలో పేర్కొనబడింది.
మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ !
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః !!
మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి వివ్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజునే క్షీరసాగర మథనంలో నుండి మహాలక్ష్మీ ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమి అని పిలుస్తారు. ఈ రోజున మహాగణపతిని, శ్రీలక్ష్మిని, సరస్వతీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. శ్రీ సరస్వతీదేవి ప్రేతిమ కానీ, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పూజాపీఠంపై పెట్టుకుని పూజ చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని పువ్వులతో, సుగంధద్రవ్యాలతో, చందనంతో అర్చించి శుక్లవస్త్రాన్ని నివేదించాలి. తరువాత పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే సరవ్వతీదేవి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి ప్రగాఢ విశ్వాసం.
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ ఆధిదేవత సరస్వతీదేవి. సరస్వతీదేవి హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలాధారిణిగా పూజింపబడుతుంది. సరస్వతీదేవి ధరించే వీణ పేరు 'కచ్చపి'.

జ్ఞాన ప్రదాతగా సరస్వతీదేవి గాథ

ి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదంబ సరస్వతిని స్మరించాడు. అలా ఆయన సరస్వతీదేవి దయను పొంది పురాణస్తూత్ర జ్ఞానాన్ని పొందాడు. వాసుడు కూడా వంద సంవత్సరాలపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడు అయ్యాడు. అటు తరువాతనే ఆయన వేదం విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని ప్రార్థించగా శివుడు కూడా దివ్యవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడట. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్య సంవత్సరాల పాటు వాగ్దేవిని ధ్యానించి ఆ తల్లి కరుణాకటాక్షాలతో శబ్దశాస్త్రం పొందగలిగాడు. అలాగే పొరపాటున గురువు ఆగ్రహానికి గురైన యాజ్ఞవల్క మహర్షి తాను చదువుకున్న చదువంతా కోల్పోయాడు. అప్పుడు ఆయన శోకార్తుడై పుణ్యప్రతమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదంవేదాంగాలను చదివించాడు. కానీ జ్ఞాపకశక్తి లేని యాజ్ఞవల్క్యుడిని చూసి సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని తెలిపాడు. యాజ్ఞవల్క్య మహర్షి భక్తితో సరస్వతీ స్తుతిని క్రమం తప్పకుండా స్తుతించాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపకశక్తిని కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు భోధించే శక్తిని, గ్రంథరచనా శక్తి, ప్రతిభగల శిష్యులను తనకు ప్రసాదించమని సరస్వతీదేవిని ప్రార్థించాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాదిష్టాతృరూపిణి అయిన సరస్వతీదేవిని పదేపదే స్తుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది.

సూర్యమాసం - మాఘం

భారతీయుల తత్త్వచింతన, దైవభావన, ఉపాసనా సంప్రదాయం - వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇవన్నీ ఆదిత్యుని కేంద్రంగా విస్తరించాయని స్పష్టమౌతుంది.
విశ్వసృష్టి స్థితిలయకు హేతువైన పరంజ్యోతి ఇంద్రియాకు, మనస్సుకు అతీతమైనది. కానీ దాని అభివ్యక్తి మనం జ్యోతిర్మండలాలలోనే దర్శించగలం. వివిధ నక్షత్రకాంతులలో కేవలం వెలుగునే కాక, కొన్ని దివ్యశక్తులను కూడా కనిపెట్టి, భూమిపై వాటి సూక్ష్మ ప్రభావాన్ని దర్శించారు మన మహర్షులు. మన పురాణాల్లోని అనేక దేవతాగాథలు, గృహనక్షత్ర విజ్ఞానాలు అనంతాకాశంలోని జ్యోతిర్గణాలలో దాగిన వైశ్విక శక్తి (Cosmic energy) విలాసాలేనని స్పష్టంగా ద్యోతకమౌతోంది.
ప్రధానంగా మన జ్యోతిష్కుటుంబంలోని ’సౌరశక్తి’ని తపశ్శక్తితో అవగతం చేసుకున్న మహర్షులు వివిధ సాధనాల ద్వారా సూర్యమండంలంలోని దివ్యత్వాన్ని అనుసంధానించే ప్రక్రియలను తెలియజేశారు. భాస్కరుని భౌతికంగా చూస్తే ఒక ’మండుచున్న అగ్నిగోళం’. వైజ్ఞానికంగా గమనిస్తే ’ఒక ప్రాణశక్తి కేంద్రం’. ఉపాసనా దృష్టితో చూస్తే "సర్వదేవతాత్మక పరంజ్యోతి".
కాలగణనలో కూడా "ఉదయాదుదయవారం" - అనే శాస్త్రోక్తి ఉంది. సూర్యోదయంనుండి మరునాటి సూర్యోదయం వరకు ఒక దినం అని మన నిర్దేశం. ఇది శాస్త్రీయమైన పద్ధతి. సూర్యుని ఉదయం ఏగ్రహ హోరలో జరుగుతున్నదో దానిని అనుసరించి ఆ దిననామం నిర్దేశించారు. అలా వివిధ గ్రహ హోరలలో సూర్యోదయాలను బట్టి - సూర్య(భాను) వారం, చంద్ర(సోమ)వారం, కుజ(మంగళ)వారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం - అని ఏడు వారాలను నిర్ణయించారు.
సూర్యునిలోనున్న ఏడురకాల శక్తులనే ఈ ఏడు గ్రహశక్తులుగా భావించవచ్చు. స్థూలంగా చూసేవారికి అన్నిరోజులూ ఒకేలా కనపడుతున్నా సూక్ష్మదృష్టికి ప్రతిదినంలో ఒక ప్రత్యేకశక్తి ఉన్నట్లు గోచరిస్తుంది. దానిని ఆధారం చేసుకునే తిథి, వార, నక్షత్రాదులను నిర్ణయించి కాల ప్రభావాన్ని పరిశీలించి జ్యోతిర్విజ్ఞానాన్ని ఏర్పరచారు.
నిత్యం సూర్యోదయ సమయంలో ఆదిత్య భగవానుని నమస్కరించడం, అర్ఘ్యప్రదానం చేయడం మన ప్రాచీన సంప్రదాయం. రవివారాన్ని "ఆది"వారంగా నిర్ణయించారు. సూర్యహోరలో సూర్యోదయం జరిగే వారం ఆదివారం. ఈ వారాన్ని అత్యంత మహిమాన్వితంగా యుగాలనుండి భారతీయ ఋషులు పేర్కొన్నారు.
ఒకప్పుడు భూమండలంలో పలు తావులలో సనాతన హైందవ ధర్మం వ్యాపించి ఉండేదనడానికి ఎన్నో ధాఖలాలు నేడు లభిస్తున్నాయి. కొన్ని వేల ఏళ్ళ క్రితం ’మిత్రసిద్ధాంతం’ యూరోపియన్ భూభాగాల్లో వ్యాప్తి చెందిందని ప్రాచీన చరిత్ర చెబుతున్నది. ఋగ్వేద మంత్రాలలో ’మిత్ర’ నామంతో స్తుతింపబడిన సూర్యభగవానుని ఆరాధన, ఆ ప్రాంతంలో ఉందని, అనేక సూర్యాలయాలు, ఆదివార నియమాలు, భాస్కరార్చనలు, అక్కడ సంస్కృతి అని చరిత్ర. క్రమంగా పుట్టుకొచ్చిన కొత్త మతాలు ప్రచారం, మార్పిడి, దాడి - అనే పద్ధతుల్లో దిగి అక్కడి ’మిత్ర’ సిద్ధాంతాన్ని హింసాదుల ద్వారా, ధ్వంస ప్రక్రియల ద్వారా నశింపజేశాయి. కానీ, అక్కడి ప్రజల్లో వేళ్ళూనుకున్న ’ఆదివారపు’ అనుబంధాన్ని (సెంటిమెంటుని) ీయలేకపోయాయి. దానితో తమమతం ఉనికిని కాపాడుకోవడం కోసం ఆదివారాన్నే తమ ప్రార్థనా వారంగా నిర్దేశించుకుని వ్యాప్తి చేసి ప్రపంచమంతా అది తమ సిద్ధాంతంగా భ్రమింపజేసింది.
కానీ చరిత్రనీ, శాస్త్రాలనీ పరిశీలిస్తే ఆదివార వ్రతాలు వేల ఏళ్ళనాటి ప్రాచీన పురాణాలలో, యుగాలనాటి వైదిక కాలంలో గోచరిస్తున్నాయి.
"సూర్య నమస్కారాలు" ఆరోగ్యానికి ఆలంబనలు - అని భారతీయ యోగవిద్యద్వారా నేడు ప్రపంచ ప్రసిద్ధాలయ్యాయి. "ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్" అనే వైదికోక్తి ప్రత్యక్షంగా నిరూపితమయింది.
ప్రాతం కాలంలో సూర్యుని నమస్కరించిన వానికి, అర్ఘ్యంతో ఆరాధించే వానికి ఆరోజు సుదినం. అందునా "సప్తమి" తిథి సూర్య తిథిగా పేర్కొన్నారు. ఆనాడు ప్రత్యేకంగా సూర్యోపాసన విశిష్ట ఫలదాయకం.
ప్రతినెలా శుక్ల సప్తమి, కృష్ణసప్తమి - రెండింటికి ప్రాధాన్యమున్నది. ఆయా సప్తమీ తిథులకు ప్రత్యేక నామాలున్నాయి.
సూర్యవారం (ఆదివారం), సప్తమి కలిస్తే అది ఒక మహాపర్వం.
శిశిరంలో చలి తిరిగి, తరుణ సూర్యుని ప్రభావం కొత్త పుంత తొక్కే మాఘమాసం సూర్యునికి ప్రీతికరమని మన సంవత్సర విజ్ఞానం చెబుతోంది.
ఒక విధంగా - ఒక సంవత్సరాన్ని ఒక రోజుగా భావిస్తే ఆ దినానికి ఉషఃకాలం మకర సంక్రమణం, ప్రాతఃకాలం మాఘమాసం.
ఏనాడైనా ప్రాతః కాలం సూర్యోదయానికి ప్రశస్తి. అందుకే సంవత్సరానికి ప్రాతస్సమయం వంటిదైన మాఘమాసంలో సూర్యారాధన విశిష్టమైనది. సూర్యగ్రహానికి అధిదేవత శివుడు. ఆకారణం చేత ఈ మాసంలోనే శివునకు ప్రీతియైన మహాశివరాత్రి ఉన్నది.
ప్రతినెలలోనూ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రత్యేక తిథి ఉన్నది. చవితి గణపతికి, షష్ఠిక్ సుబ్రహ్మణ్యునికి, సప్తమి సూర్యునికి, ఏకాదశి ద్వాదశులు విష్ణువుకు, అష్మీ నవములు గౌరికి ప్రాధాన్యం. ఆ తిథులు మాఘమాసంలో మరీ ప్రత్యేకం. మాఘ పూర్ణిమకి విశిష్టమైన మహిమ ఉన్నది.
కార్తీకం దీపానికి, మాఘం స్నానానికి, వైశాఖం దానానికి ప్రధానం.
ఇలా అనేక ప్రత్యేకతలతో మాఘమాసం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

MAAGHA PURANAM -- 1

మాఘ పురాణం – ౧వ అధ్యాయం
శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట
సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ చేయవలయుననెడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి, యజ్న స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదీతీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.
అచటికేతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.
ఆవిధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోను, పరివారముల తోను, తండోపతండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుటవలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి.
దూర ప్రాంతాలనుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి.
సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగ తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ ఇతిహాసాది సమస్త విషయములందూ వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవికానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి, సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పండ్రెండు సంవత్సరములలో యెన్నియో పురాణ గాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి.
సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తి పరచుట తన విద్యుక్తధర్మమని యెంచి వారి కోరికను మన్నించినారు.
ఒక శుభ ముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను జేసి “మునిశ్రేష్ఠా! మునికులతిలకా! ఇంతకుమున్ను ఎన్నియో పురాణ గాధలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి, అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునే యున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారము చేసి యున్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొనియున్నారు. గాన వినదగు విషయాలేమైనా యున్నయెడల విరామ కాలములో మాకు వినిపించవలయు”నని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెననెడి కుతూహలం కనపరచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి –
“ముని పుంగవులారా! మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకూ విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకున్నూ, వినుట వలన మీకున్నూ పరమార్థము కల్గు’నని పలికెను.
శౌనకాది మునుల కోరిక
సూతమహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా “ధన్యులమైతి”మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని సూతమహామునితో –
“ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల మరల వినవలయుననెడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసిందిగా” కోరిరి.
ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుటవలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.
“ముని పుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయములో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపు”డని సూతమహర్షి ఇట్లు వివరించిరి –
“నేను ణా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నాతండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్ధ్యములు కలిగిన వాడనయితిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠమహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను.

MAAGHA PURANAM -- 2

మాఘ పురాణం – 2వ అధ్యాయం
దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:
దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.
ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.

MAAGHA PURANAM -- 3

మాఘపురాణం - 3వ అధ్యాయము
వింధ్య పర్వతము:
దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.
మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందుండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.
హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను.
“ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను.
మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.
“ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.
గంధర్వ యువకుని వృత్తాంతము:
“భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.
“ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.
ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి.
అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను.
ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.

MAAGHA PURANAM -- 4

మాఘ పురాణం - 4వ అధ్యాయము
కుత్సురుని వృత్తాంతము:
పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను.
పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను.
కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయెట శ్రద్దజూపుట, నీతి నియమాలను పాటించుట, దైవకార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములనభ్యసించెను.
ఈవిధంగా కొంతకాలం గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు, మాఘమాసం వచ్చునప్పటికి కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు.
“నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.
మాఘమాసమంతయు ఇచటనేయుండి అధికఫలమును సంపాదించెదను” అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆవిధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోరతపమాచరించవలయుననీ తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసికొన సంకల్పించి తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ, నిశ్చల మనస్సుతోనూ, తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.
ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.
ఈవిధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.
ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండ అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను” అని శ్రీమన్నారాయణుడు పలికెను.
శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై – ప్రభూ జగద్రక్షకా! సర్వాంతర్యామీ! ఆపద్బాంధవా! నారాయణా! ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నా మనస్సంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమియు అవసరము లేదు. కానీ మీ దివ్యదర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శ మిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్థించెను.
శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెద గాక! అని పలికి నాటినుండీ అచటనే ఉండిపోయెను.
కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్నా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.
Brahmasri Chaganti Koteswara Rao Garu's photo.

పుష్పగిరి

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
ఈ గ్రామాన్ని గురించి తెలుగులో తొలి యాత్రాచరిత్రగా చెప్పబడే కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ గ్రామంలో 1830 సంవత్సరాంతం నందు విడిది చేశారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు. గ్రంథంలో ఆయన పుష్పగిరి గురించి ఇలా వ్రాశారు: పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకినీ తీరము. నది గట్టున కొండ వెంబడిగా రమణియ్యమైన యొక దేవస్థల మున్నది. అది హస్తినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్త పీఠాధిపతి యయిన పుష్పగిరి స్వాములవారు, అక్కడ మఠము గట్టుకొని నివాసము చేయుచున్నారు. 18 బ్రాహ్మణ గృహములున్నవి. అక్కడి బ్రాహ్మణులు కొంత వేదాంత విచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకు పేటకు పోవలెగాని, అక్కడ దొరకవు. నది దాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నది దాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది.
* పేరు వృత్తాంతం
ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది. గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికీ పోరాటం జరిగింది. ఆ సమయంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యౌవనం లభించేది, అమరత్వమూ సిద్ధించేది. దేవతలు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు. శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్క ను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే పుష్పగిరి అయింది.
పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.
పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.
* హరిహరాదుల క్షేత్రం
శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.
కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. .
పుష్పగిరిలో కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వర, భీమలింగేశ్వర, కామక్షి అమ్మవారి ఆలయాలున్నాయి. వైద్య నాథేశ్వరుడు, భీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నారు. వైద్య నాథేశ్వరాలయంలో శ్రీ కామాక్షి మందిరం ఉంది. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.
పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.
* బ్రహ్మోత్సవాలు
పవిత్ర పినాకిని నదీ తీరంలో వెలసి దక్షిణ కాశిగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరిలో ఏప్రిల్ 15 నుండి బ్రహ్మొత్సవాలు జరుగును. శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి, శ్రీ వైద్యనాదేశ్వరస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు 24 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
* బ్రహ్మోత్సవ కార్యక్రమాలు
శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామికి ఈ ఏప్రిల్ 15 న విష్వక్సేన పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 21 న కళ్యాణోత్సవం, 22 న రథోత్సవం, 23 న ఆశ్వవాహన సేవ, 24 న చక్రస్నానం, పూర్ణాహుతి, పుష్పయాగం నిర్వహిస్తారు.
శ్రీ వైద్యనాదేశ్వరస్వామికి ఏప్రిల్ 15 న మృత్య్సంగ్రహణం, అఖండ దీపారాధన, 21 న కళ్యాణోత్సవం, 22 న రథోత్సవం, 23 న నిత్యహోమం, 24 న చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మొత్సవాలలొ మూడు రోజు ల పాటు తిరునాళ్ల జరుగుతుంది.
* పుష్పగిరి చేరుటకు మార్గాలు
పుష్పగిరి చెరుకోడానికి మూడు మార్గాలున్నాయి.
01. కడప నుండి చెన్నూరు మార్గంలొ ఉప్పరపల్లి మీదుగా కొండకు చేరుకొవచ్చు.
02. ఖాజీపేట నుంచి వయా చింతలపత్తూరు మీదుగా భక్తులు వచ్చెందుకు వీలుగా వాహనాలు ఎక్కువగా తిరుగుతాయి.
03. జాతీయరహదారి పై తాడిపత్రి నుంచి వల్లూరు వయా ఆదినిమ్మాయపల్లె మీదుగా వెళ్లొచ్చు.

మాఘ మాసము లొ నదీ స్నానము చెసె వారు రొజు ఈ సన్కల్పము చదువుకొవాలి.

మాఘ పురాణం - 3

3వ అధ్యాయము - గురుపుత్రికాకథ
మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి? వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లుపలికెను. దేవి వినుము, పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికకూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద, అనేకవర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలుగుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును ఆలసించకనావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మనిపిలిచెను. సుమిత్రుడు మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.
గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.
తండ్రియామెను కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవునిరోదనధ్వనిని విని వాని వద్దకు వచ్చి 'జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నందియిట్లు పలికెను. ఓయీ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీతీరమున గౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!
సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి 'తండ్రీ! నా కుమార్తే చేసిన పాపముయేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.' అప్పుడా యోగి 'ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీతీరమునగాని సరస్సు తీరమున యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ నీమచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద తదియనాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ మున్నగు సువాసిని అలంకారములనుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాలస్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుహ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములుపోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.

నేడు మార్కండేయ మహర్షి జయంతి

దీర్ఘాయువు విషయంలో మార్కండేయుడిని తలచుకొంటుంటారు చాలా మంది. దీనికి కారణమేమిటో, మార్కండేయ మహర్షి మహత్వమేమిటో తెలియచెప్పే కథా సందర్భం ఇది. మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు. మృకండుడు హరిహరులిద్దరి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు హరిహరులిద్దరూ ఆనందించి, ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు మృకండుడు తనకు పుత్ర సంతానం కావాలని వరం కోరుకున్నాడు. పుత్ర సంతానం కలుగుతుందని, అయితే ఆ పుట్టబోయే పిల్లవాడు అల్పాయుష్కుడిగా జన్మిస్తాడని చెప్పి హరిహరులు అంతర్థానమయ్యారు. మృకండుడు ఇంటికి తిరిగివచ్చి తన భార్యతో ఈ విషయాన్ని చెప్పాడు. దైవవరం ప్రకారం కొద్ది కాలానికి ఆ దంపతులిద్దరికీ ఓ బాలుడు జన్మించాడు. అతడే మార్కండేయుడు. ఆ పిల్లవాడు చిన్నతనం నుంచే తపోనిష్ఠలో ఉండేవాడు. ఓ రోజు మృకండుడు మార్కండేయుడిని పిలిచి విషయమంతా వివరించాడు. మార్కండేయుడు తనకు అల్పాయుష్షు ఉందని విన్నా ఏ మాత్రం కలత చెందలేదు. తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని పరమశివుడిని మెప్పించి చిరంజీవి కావాలని తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. యముడు అతడిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయితే ఆ బాలుడు తన ఆరాధ్య దైవమైన శివలింగాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. మృత్యువు నుంచి తనను కాపాడమని శివుడిని స్తుతించాడు. ఆ స్తుతులకు మెచ్చాడు శివుడు. చేతిలో త్రిశూలంతో ప్రత్యక్షమయ్యాడు. కాలుడు ఇక చేసేది లేక శివుడిని శరణువేడాడు. మార్కండేయుడిని విడిచిపెట్టి వెళ్లమని శివుడు గద్దించటంతో యముడు అతడిని విడిచిపెట్టి తన పరివారంతో వెళ్లిపోయాడు. శివుడు ఆ తర్వాత మార్కండేయుడిని చిరంజీవిగా ఉండిపొమ్మని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. ఆ తర్వాత మార్కండేయుడు శ్రీహరి గురించి మరికొంత కాలం తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దగ్గర కూడా తనకు మృత్యువనేది లేకుండా వరం పొంది మృత్యుంజయుడయ్యాడు. ఆ తర్వాత కొంత కాలంపాటు మార్కండేయుడు కేవలం శివపూజ చేస్తూ కాలం గడుపుతూ ఉండిపోయాడు. ఇంతలో ప్రళయం వచ్చి భూమంతా మునిగిపోయింది. చుట్టూ అంతా అంధకారం అలముకుంది. అప్పుడు అంత చీకట్లోనూ మార్కండేయుడికి ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఆ నీళ్లలో ఓ వటపత్రం మీద పసిబాలుడు పడుకొని ఉండటాన్ని మార్కండేయుడు చూశాడు. ఇంతలోనే ఏదో మాయ జరిగినట్టు మార్కండేయుడు ఆ బాలుడి కడుపులోకి వెళ్లిపోయాడు. అక్కడ అంతా ఎన్నెన్నో లోకాలు ఉన్నట్లు కనిపించింది. అవన్నీ చూసేంతలోనే మళ్లీ మాయ జరిగి ఆ బాలుడి పొట్టలో నుంచి బయటపడ్డాడు మార్కండేయుడు. ఈసారి బయట నీరేమీ కనిపించలేదు. మామూలుగానే భూమి ఉంది. ఏమిటీ విచిత్రమని అనుకొంటున్నంతలోనే శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అతడికి విషయాన్నంతా వివరించి ఆ వటపత్రం మీద శయనించి ఉన్నది ఎవరో కాదని, సర్వలోకాలనూ తన ఉదరంలో దాచుకున్న శ్రీమహావిష్ణువేనని వివరించి చెప్పారు. ఆ మాటలు విన్న రుషికి ఎంతో ఆనందం కలిగింది. గతంలో తాను సరైన అవగాహన లేక కేశవుడిని విస్మరించానని, ఇకపై తనవైపు నుంచి అలా జరగకుండా ఉండేలా తన మనస్సు శ్రీమహావిష్ణువు సేవ మీద లగ్నమై ఉండేలా వరం ఇవ్వమని పార్వతీ పరమేశ్వరులను మార్కండేయుడు వేడుకొన్నాడు. వారు ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్థానమయ్యారు. ఆనాటి నుంచి శివానుగ్రహంతో నిరంతరం నారాయణ పద సేవలో నిమగ్నమై శివకేశవ భేదం పాటించకుండా మార్కండేయుడు జీవితం సాగించాడు. తన జీవన యాత్రలో మానవాళికి మంచిని ప్రబోధిస్తూ ఆ చిరంజీవి ఎంతో మందిని ఉత్తములుగా తీర్చిదిద్దాడు. ఇలాంటి రోజుల్లోనే ఓ రోజు మార్కండేయుడి గొప్పతనాన్ని గమనించి ధర్మరాజు ఆ రుషిని పిలిపించి సత్కరించి మానవ కర్మ గతిని గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆ సందర్భంలోనే ఆ రుషి ధర్మరాజుకు అనేకానేక ధర్మాలతో పాటు కలియుగ ధర్మాలను వివరించి చెప్పాడు. పితృదేవతలు, వారుండే స్థానాలు అన్నీ చక్కగా వివరించి ధర్మరాజు సందేహాలను తీర్చాడు ఆ రుషి. ఓసారి వ్యాసుడి శిష్యుడైన జైమిని మార్కండేయుడి దగ్గరకు వచ్చి మహాభారతాన్ని గురించి తనకు కొన్ని సందేహాలున్నాయని, వాటిని తీర్చమని కోరాడు. అప్పుడు మార్కండేయుడు దూర్వాసుడి శాపంతో వపువు అనే అప్సరస పక్షిగా పుట్టిందని, మందపాలుడనే మహర్షి అనుగ్రహంతో దానికి నాలుగు పిల్లలు పుట్టాయని చెప్పాడు. శమీక మహర్షి ఆశ్రయంలో ఆ పక్షులు సకల వేద శాస్త్రాలను నేర్చుకున్నాయని, కేవలం ఆ పక్షులు మాత్రమే జైమిని సందేహాలను తీర్చగలవని చెప్పాడు మార్కండేయుడు. జైమిని ఆ పక్షుల దగ్గరకు వెళ్లి అడిగి తన సందేహాలను తీర్చుకున్నాడు. ఇలా మార్కండేయ మహర్షి శివకేశవుల అనుగ్రహం పొందిన మహాత్ముడిగా, చిరంజీవిగా లోకంలోని సర్వ విషయాలు, రహస్యాలు తెలిసిన ఉత్తమోత్తమ జ్ఞానిగా కనిపిస్తున్నాడు.
సౌజన్యం: డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు, ఈనాడు సాహితీ సంపద

గంగా స్తోత్రం

దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || ౧ ||
భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ || ౨ ||
హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే |
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ || ౩ ||
తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ |
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః || ౪ ||
పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే || ౫ ||
కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే || ౬ ||
తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః |
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే || ౭ ||
పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే || ౮ ||
రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ |
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే || ౯ ||
అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే |
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః || ౧౦ ||
వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః |
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః || ౧౧ ||
భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే |
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ || ౧౨ ||
యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః |
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః || ౧౩ ||
గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ |
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః || ౧౪ |

శ్రీ వసంత పంచమి

వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకి సూచనగా మనకి కొన్ని పండుగలు ఏర్పడ్డాయి .అలాంటివాటిలో శ్రీ పంచమి ఒకటి . మాఘ శుద్ధ పంచమి నాడు ఈపండుగను జరుపుకొంటారు . దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి,వసంత పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది .
శ్రీ పంచమిని విద్యారంభదినం గా భావిస్తారు . మన రాష్ట్రములోని బాసర క్షేత్రం లోనూ , మరియూ ఇతర సరస్వతీ దేవాలయాలలోనూ శ్రీ పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తారు .ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేయవలెనని హేమాద్రి తెలిపెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.
వసంతరుతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (జనవరి-ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.
సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌
వహ్ని శుద్దాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌
జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్త్వరజస్తమో గుణాలను బట్టి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు. వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని రుతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో గోచరిస్తాయి. మాఘమాసం వసంత రుతువుకు స్వాగత గీతికను ఆలపిస్తుంది. ఆ వసంత రుతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది.
సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత రుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. ఉత్తర భారతంలో ఈ పూజను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. ఈ పర్వదినానికే శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈరోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు.
శ్రీపంచమినే రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమి నాడు పూజించడంవల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం.
రుధ్రుని భృకుటి నుండి అనగా కనుబొమలనుండి ఆవిర్భవించిన ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రోక్తి . తారిణి , తరళ , తార , త్రిరూపా , ధరణీరూపా , స్తవరూపా , మహాసాధ్వీ, సర్వసజ్జనపాలికా , రమణీయా , మహామాయ , తత్త్వజ్ఞానపరా, అనఘా, సిద్దలక్ష్మి , బ్రహ్మాణి , భద్రకాళి , ఆనందా ... అనేవి తంత్రశాస్త్రాల ఆధారం గా ఇవి ఈ దేవతా దివ్యనామాలు .
చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసర లో ప్రతి ఏటా జరుపుతారు .. వేకువజామున నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని వూరేగిస్తారు.
ఓం శ్రీ సరస్వతి దేవ్యే నమః