కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ!!

సార్వకాలీన, సార్వజనీన జీవన వికాస ఉపదేశంగా భగవానుడు తన గీతామృతంలో అద్భుతంగా మన కర్తవ్యాన్ని నిర్దేశించాడు.

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన!
మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ!!

అంటూ ఫలంపై దృష్టిలేని పని విధానాన్ని సూచించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి స్టీఫెన్ కోవె వరకు ఎవరు మనస్సును చిత్రిక పట్టి, ఊరటనిచ్చే ఉపదేశాలు చేసినా ఆ శ్రీకృష్ణుడికి సాటిరారు. ఉదాసీనంగా పని చేయమని భగవానుడు చెప్పడం లేదు. ఉత్సాహంగా శ్రమించు; తుది ఫలితాన్ని మాత్రం తనకు వదిలిపెట్టమంటున్నాడు. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకు దక్కే తీరుతుంది; అర్హత లేకపోతే ఎంత తాపత్రయ పడ్డా అందే అవకాశమే లేదు. కర్తవ్యాన్ని ఎంత దీక్షతో చేస్తున్నామన్నదే ముఖ్యం. ఫలితమేదైనా, మహాప్రసాదం అనుకోవడమే ఆనందదాయకం.

No comments:

Post a comment