శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశత నామస్తోత్రము

ఓం శరవణభవాయ నమః
ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః
స్కందో గుహష్షణ్ముఖ శ్చ ఫాలనేత్రసుతః ప్రభుః
పింగళః కృత్తికాసూను శ్శిఖివాహో ద్విషడ్భుజః
ద్విషణ్ణేత్ర శ్శక్తిధరః పిశితాశప్రభంజనః |
తారకాసురసంహారీ రక్షోబలవిమర్దనః ||
మత్తః ప్రమత్తోన్మత్త శ్చ సురసైన్య స్సురక్షకః |
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళు ర్భక్తవత్సలః ||
ఉమాసుతశ్శక్తిధరః కుమారః క్రౌంచదారణః |
సేనానీ రగ్నిజన్మా చ విశాఖశ్శంకరాత్మజః ||
శివస్వామీ గణస్వామీ సర్వస్వామీ సనాతనః |
అనంతశక్తి రక్షోభ్యః పార్వతీ ప్రియనందనః ||
గంగాసుతశ్శరోధ్భూత అహూతః పావకాత్మజః |
జృంభః ప్రజృంభ ఉజ్జృంభః కమలాసనసంస్తుతః ||
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణ స్సుమనోహరః |
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతిరహర్పతిః ||
అగ్నిగర్భ శ్శమీగర్భో విశ్వరేతా స్సురారిహా |
హరిద్వర్ణ శ్శుభకరః పటుశ్చ పటువేషభృత్‌ ||
పూషా గభస్తిర్గహనః చంద్రవర్ణః కళాధరః |
మాయాధరో మహామాయీ కైవల్య శ్శంకరాత్మజః ||
విశ్వయోని రమేయాత్మా తేజోనిధి రనామయః |
పరమేష్ఠీ పరబ్రహ్మా వేదగర్భో విరాట్సుతః ||
పుళిందకన్యాభర్తా చ మహాసారస్వతావృతః |
ఆశ్రితాఖిలాదాతా చ చోరఘ్నో రోగనాశనః ||
అనంతమూర్తి రానంఠః శిఖిండికృత కేతనః |
డంభః పరమడంభశ్చ మహాడంభో వృషాకపిః ||
కారణోత్పత్తిదేహశ్చ కారణాతీ(నీ) తవిగ్రహః |
అనీశ్వరో-మృతః ప్రాణః ప్రాణాయామపరాయణః ||
విరుద్ధహంతా వీరఘ్నోరక్తాస్యశ్శ్యామకధరః |
సుబ్రహ్మణ్యో గుహః ప్రీతో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శత నామ స్తోత్రము సంపూర్ణము

No comments:

Post a comment