చాణక్యుడు/కౌటిల్యుడుభారతదేశపు ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయడానికి... తక్షశిల విశ్వ విద్యాలయంలో ఒక ఆచార్యుడు... అర్థ శాస్త్రాన్ని బోధించేవాడు.. రెండువేల ఏళ్ళ క్రితమే అర్థశాస్త్రాన్ని రచించినవాడు... ఇప్పటికీ ఈయన సూచించిన సూత్రాలనే అందరూ అనుసరిస్తున్నారు... (రెండువేల ఏళ్ళక్రితమే తక్షశిల విశ్వవిఖ్యాతి గాంచిన ఒక ప్రస్తిద్ధ విశ్వవిద్యాలయం.. ఇక్కడ దేశ విదేశాలలోని కొన్ని వేల మంది విద్యను అభ్యసించే వారు....) భరత ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేయడానికి భారత దేశంలో మౌర్య సామ్రాజ్యస్థాపనకు కారణమైన వాడు చాణక్యుడు... ప్రస్థుతం మనందరికీ తెలిసిన అర్థశాస్త్రాన్ని రచించిన వాడు.. చాణక్యుడు... ఒక మనిషి ముక్తిని పొందేందుకు పాటించిఅవలసిన చతుర్విధ ధర్మాలలో (ధర్మ, అర్థ, కామ, మోక్షములు) అర్థము అనేదానికి నిజమైన అర్థాన్ని మనకు తెలిపినవాడు చాణక్యుడు..
క్రీ.పూ.320 సంవత్సరాల క్రితం మాట అది. అరవై నాలుగు ద్వారాలతో, అష్టఐశ్వర్యాలతో అలరారుతుంది పాటలీ పుత్ర నగరం. నగరానికి ఈశాన్యంగా పవిత్ర గంగానది ప్రవహిస్తూ వుంది. ప్రాతః కాలంలో గంగాస్నానం చేసి, నుదురుపై తిలకం దిద్ది వస్తున్నాడొక నల్లబ్రాహ్మణుడు. దారిలో అతని కాలికొక దర్భములు(ముల్లు) గ్రుచ్చుకొంది. తక్షణం దానిని కాల్చి తన చెంతనున్న రాగి చెంబులోని నీళ్ళతో కలిపి గుటగుట త్రాగేశాడతను. ఏదో ఘనకార్యం చేసిన వానిలా సంతృప్తుడై త్రేంచాడు. ఈ విచిత్ర సంఘటనకు విస్తుబోయిన యువకుడొకడు అతన్ని సమీపించి, స్వామీ! అదేమన్నా ఔషధమా? అలా సేవించారే - అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు జరిగిన విషయం చెప్పి, దాని పొగరు అణచడానికే కాల్చి బూడిద చేసి సేవించాను. శత్రుమరణం వలన శాంతి కలుగుతుంది. ఒక విధంగా అది ఔషధమే అయింది అన్నాడు. అచేతనమైంది ముల్లు. దానికి మిత్ర శుత్రుత్వాలు లేవు. ఇంత క్రూరదండన భావ్యమా? అని అడిగాడు యువకుడు.
మనస్తాపం కలిగించినపుడు చేతనాచేతన బేధం పాటించి అవమానాన్ని సహించడం ధీరుల లక్షణం కాదు. వెధవది ముల్లే గదా అని వదిలేస్తే అది మరలా ఇంకొకరికి కష్టపెట్టే ప్రమాదముంది. ఇందుమూలంగా లోకోపకారమే జరిగింది కదా! అన్నాడా బ్రాహ్మణుడు. అపరాధి విషయంలో చేతనా అచేతనా బేధం పాటించనన్నారు సరే అపరాధి అవక్ర విక్రముడైన ఏ మహరాజో అయితేనో? అని అడిగాడు యువకుడు. అతనొకమారు ఆ యువకుని ముఖంలోకి నిశితంగా జూచి బాలకా! నా శక్తిసామర్థ్యాలు నీకు తెలియవు. అవమానం చేసినోడు అవనీపతైనా ప్రతీకారం చేసి పగ తీర్చుకుంటాను. కేరళ నా జన్మభూమి. నా పదమూడవ యేటే ఆ పుణ్యభూమిని వదిలాను. ఆ రెండు కాశిలో వేదాధ్యయనం చేశాను. మరో ఆరేండ్లు తక్షశిలలో ఆయుర్వేదం రాజనీతి అర్ధశాస్త్రం అధ్యయనం చేశాను. నా ధర్మబలం ముందు ప్రభువుల చతురంగ బలాలు చప్పబడాల్సిందే అన్నాడు నిబ్బరంగా.
ఈ కలికాలంలో ధర్మానికింకా అంత బలముంటుందా స్వామి? వినయంగా ప్రశ్నించాడా యువకుడు. ధర్మకవచం తొడుక్కున్న స్వార్ధపరులకు ధర్మం సహకరించకపోవచ్చు. కానీ, ధర్మపరుడ్ని ధర్మమే రక్షిస్తుంది. ధర్మరక్షణ కొరే నేను తక్షాశిలను వదిలిరావలసి వచ్చింది అన్నాడు బ్రాహ్మణుడు. సంభ్రమాశ్చర్యాలతో తలమునకైనాడా యువకుడు. తక్ష శిలాధీశుడు ధర్మచ్యుతుడై యువకుడైన అలెగ్జాండరుతో చేతులు కలిపి ఈ పవిత్ర భారతావనికి తీరని ద్రోహం చేశాడు. యువకుల ప్రాబల్యం నుంచి ఈ దేశాన్ని కాపాడే ప్రభువును వెదుక్కొంటూ ఈ మగధదేశం ప్రవేశించాను అన్నాడు బ్రాహ్మణుడు. అతని ఆశయానికి పులకాంకితుడైన ఆ యువకుడు భక్తిపారవశ్యంతో అతని ముందు మోకరిల్లి తనను పరిచయం చేసుకొన్నాడు.
వారిరువురికి సఖ్యత కుదిరింది. తన నవమానించిన నవనందులను నాశనం చేసి నంద సామ్రాజ్యాన్ని క్రూకటివేళ్ళతో కూలద్రోచి ఆ యువకునికి సామ్రాజ్యాన్ని కట్టాడా బ్రహ్మ తేజస్వి. అతనే అర్ధశాస్త్రాన్ని మనకందించిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు. క్రీ.పూ. 322లో మౌర్యసామ్రాజ్య స్థాపన జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక సంఘటన. ఆ వంశస్థాపకుడైన మౌర్య చంద్రగుప్తుడు ఆ యువకుడే. చాణక్యుని రాజతంత్రమే మగధసామ్రాజ్యానికి రక్షణ వలయంలా పాలించాడు చంద్రగుప్తుడు. అలెగ్జాండర్‌దండయాత్ర అనంతరం అతని సేనాని సెల్యూకస్‌మరలా భారతదేశం మీదకు దండెత్తి రాగా అతడ్ని బంధించాడు. భారతీయుల ప్రజ్ఞాపాటవాన్ని దేశ దేశాలకు చాటాడు. కయ్యానికి వచ్చిన గ్రీకులతో వియ్యమంది భారత గ్రీకు సంబంధాలు మెరుగుపరిచాడు.
అప్పటినుండే మన భారతీయుల ఖ్యాతి దిగదిగంతాలకు వ్యాపించింది.. మన ఓడలు అన్ని ఖండాలకు చేరి మన వస్త్ర, ఆభరణాలను అందరికీ పరిచయం చేసేది... అలా పర్షియన్లు, అరబ్బులు మన దేశం మీదకు దండెత్తడానికి వారి ద్వారా ఆంగ్లేయులు మన దేశం మీదకు రావడానికి కారణం... మన ఆధ్యాత్మిక, విజ్ఞాన సంపదే..

No comments:

Post a comment