ఈనాటి తపస్సు

తపస్సు అనగానే అడవులలోనూ, కొండ గుహలలోనూ, హిమాలయాలలోనూ సాధనాలు చేసే యోగిపుంగవులే గుర్తుకు రావడం పరిపాటి. తండ్రి ప్రేమనూ, రాజ్యాన్నీ పొందడానికి ధ్రువుడు తపస్సు చేశాడు. శివుణ్ణి పొందడానికి పార్వతీ, పాశుపతాస్త్రం కోసం అర్జునుడూ తపం ఆచరించారు. ఏదైనా ఒక వస్తువును పొందడానికి, లేదా లక్ష్యాన్ని సాధించడానికి చేసే తీవ్ర కృషినే తపస్సుగా చెప్పవచ్చు. "ఛాత్రాణాం అధ్యయనం తపః" - విద్యార్థికి చదువుకోవడమే తపస్సు. ఒక వ్యాపారి తన వ్యాపారాన్ని విస్తరించడానికి అకుంఠిత దీక్ష కలిగి ఉండడాన్నే తపస్సుగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మికతకు వచ్చేసరికి, "ణా తపస్వినో యోగః సిద్ధ్యంతి" - తపస్వి కాని వాడికి యోగం సిద్ధించదు. మనఃశరీరాలను వశం చేసుకొని, వాటిని యథేచ్ఛగా సంచరించనీయకుండా ఉచితరీతిని నిరోధించడమే తపస్సుగా స్వామి వివేకానంద నిర్వచించారు. తైత్తిరీయ ఉపనిషత్తు శంకర భాష్యంలో "మనసశ్చ ఇంద్రియాణామ్ చ హైకాగ్ర్యం పరమం తపః" - మనస్సునూ, ఇంద్రియాలనూ వశంలోకి తీసుకురావడమే తపస్సు అన్నారు. అసలు 'తపః' అంటే కొలిమిలో పెట్టి కాల్చడం; భూమిని త్రవ్వి తీసిన ముడి లోహాలను కాల్చి, పరిశుద్ధమైన లోహాలుగా మార్చడం. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధకుడు తపస్సు ద్వారా మనస్సులో ఉన్న మలినాలను తొలగించి పరిశుద్ధం చేయడానికి ఈ తపస్సు ఉపయోగపడుతుంది. 'ఎవరు విజ్ఞానవంతుడో - వశీకృతమైన మనస్సు కలవాడో, సదా పరిశుద్ధుడో అతడు పునర్జన్మ రహితమైన ఆ పరమపదాన్ని చేరుకుంటాడు' అని కఠోపనిషత్తు చెబుతోంది. భగవద్గీత 17వ అధ్యాయంలో శారీరక, వాచిక, మానసిక తపస్సుల గురించి శ్రీకృష్ణుడు తెలియజేశాడు. దేవతలనూ, గురువులనూ, తత్త్వవేత్తలనూ పూజించడం, శుచిత్వం, సత్ప్రవర్తన, బ్రహ్మచర్యం, అహింసలను శారీరక తపస్సుగా పేర్కొన్నాడు. ఇతరులకు భయాన్నీ, కష్టాన్నీ కలిగించకుండా, వినడానికి కష్టం కలిగించని సత్యవాక్యం, వేదాభ్యాసాలను వాచిక తపస్సుగా తెలిపాడు. చిత్తశుద్ధి, కనికరం, వాక్ నిరోధం, మనఃనిరోధాలను మానసిక తపస్సుగా శ్రీకృష్ణుడు వివరించాడు. విచక్షణతో, శాంత స్వభావంతో, దయ, ప్రేమలను కలిగి ఉండే మనిషి మంచి పనులు చెయ్యగలుగుతాడు. తద్వారా తనకు తానూ మంచి చేసుకోగలుగుతాడని స్వామీజీ చెప్పారు. హనుమంతుడు శ్రీరామునితో ఏర్పడిన మొదటి పరిచయంలోనే ఆయన మెప్పును పొందాడు. శ్రీరాముడికీ, సుగ్రీవుడికీ మైత్రి కలిపాడు. రామాయణంలో హనుమంతుడి పాత్రను గమనించినట్లయితే ఎవరితో ఏవిధంగా మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం చూస్తాం. స్వామి వివేకానంద చికాగో సర్వమత మహాసభలలో కేవలం "సోదర సోదరీమణులారా" అన్న ఒక్క మాటతో మొత్తం ప్రపంచాన్నే జయించారు. స్వామీజీ వాక్చాతుర్యం మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమనుంచి పుట్టుకొచ్చింది. ఆయన మాట్లాడిన దానికి ప్రతిస్పందన కూడా అనూహ్యంగా వచ్చింది. శ్రీశారదాదేవి అవధులు లేని ప్రేమ చెడ్డవారిని సహితం సంమార్గుల్ని చేసేది. మాట్లాడడం కూడా ఒక కళే. మాట్లాడడం ఒక్కటే సరిపోదు. ఎవరికీ హాని కలిగించకుండా మాట్లాడాలి. ప్రేమతోనూ, ఆప్యాయతతోనూ మనం చెప్పదలచుకున్న దాన్ని చెబితే, అది ఇతరులకు నచ్చేలా, సంతోషం కలిగించేలా ఉంటుంది. కలియుగంలో మనిషి అన్నగత జీవి. అడవులలోనూ, గుహలలోనూ సాధనాలు చేయలేరు కనుక కేవలం సత్యాన్ని ఆచరించడమే ఈ కలియుగంలో తపస్సు అని శ్రీరామకృష్ణులు చెప్పారు. అంతేకాకుండా ఆయన స్వయంగా సత్యపాలన చేసి చూపించారు కూడా!

Photo: ఈనాటి తపస్సు:

No comments:

Post a comment