'ద్వాదశ మంజరీక స్తోత్రం'

సంసార సాగరంలో ఈదులాడుతూ తీరం తెలియక తల్లడిల్లుతున్నా, ఆ సాగరంపై వ్యామోహం వీడదు మనకు. ఎండమావుల వెంట పరుగులు తీస్తూంటాం; ఎడారి మంటలకు చలి కాచుకుంటూ ఉంటాం. మోహపు తెరలు కమ్ముకుంటున్నా, ఆ మాయాజాలపు మైకంలోనే మునిగిపోతున్నాం. కానీ ఆ మాయను సృజించిన మాధవుడే మళ్ళీ మనల్ని మేల్కొలిపేందుకు అవతార పురుషుల రూపంలో ఆగమిస్తాడు. "జీవితంలోని క్లిష్ట సమస్యలను ఆ భగవంతుడే పరిష్కరిస్తాడు. నిగూఢ విషయాలను సైతం ఎంతో సామాన్య విషయాల మాదిరిగానే అవలీలగా పసిపిల్లలకు కూడా బోధపడేలా బోధించగలడు. అతడి దివ్య తేజం తరతరాలుగా పేరుకుపోయిన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది"అంటారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస. అలాంటి కోవకు చెందిన మహనీయులే ఆదిశంకరాచార్యులు. జ్ఞానాంజన ద్వారా మనిషి మనోనేత్రంలోని భేదభావ చట్వారాన్ని పరిహరించిన ప్రజ్ఞావంతులు వారు. ఆ పరంపరలో శంకరాచార్యులు మానవాళికి అందించిన అద్భుత 'భజగోవిందం'.
ఒకరోజు శిష్య సమేతులై శంకరాచార్యుల వారు కాశీనగర వీధుల్లో పయనిస్తూ ఉన్నారు. దూరంగా ఓ ఇంటిముందు వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేస్తున వృద్ధ బ్రాహ్మణున్ని చూశారాయన. జీవిత సంధ్యా సమయంలో కూడా భగవంతుడిపై దృష్టి మరల్చక, లౌకికమైన జ్ఞానం కోసం తపిస్తున్న ఆ వ్యర్థ జీవిపై సానుభూతి కలిగింది ఆదిశంకరులకు. వెంటనే అతనిని ఉద్దేశించి 'భజగోవిందం' శ్లోకాన్ని ఆశువుగా గానం చేశారు.
మానవుడి అస్తవ్యస్త జీవితాన్ని చూసి హృదయం ద్రవించిన శ్రీశంకరులు అంతటితో ఆగక, మానవజీవన వికాసానికి దోహదపడే పన్నెండు శ్లోకాలు చెప్పారు. వీటినే 'ద్వాదశ మంజరీక స్తోత్రం' అంటారు. శంకరాచార్యుల వారిని అనుసరించి నడుస్తున్న పధ్నాలుగు మంది శిష్యులు ఆచార్యుల వారి బోధతో ఉత్తేజితులై ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చొప్పున పద్నాలుగు శ్లోకాలు చెప్పారు. వీటిని 'చతుర్దశ మంజరీక స్తోత్రం' అంటారు. శిష్యులు రచించిన ఈ చతుర్దశ మంజరీక స్తోత్రాన్ని ఆలకించి సంతృప్తి చెందిన పూజ్యపాదులు ఆశీర్వచనంగా చివరి నాలుగు శ్లోకాలు చెప్పారు. మొత్తం కలిసి ముప్పది శ్లోకాలుగా ఏర్పడిన ఈ గ్రంథం 'భజగోవిందం' అనే పేరుతొ ప్రాచుర్యం పొందింది. మానవుని మనస్సులోని మొహాన్ని పారద్రోలే శక్తి గలది కనుక దీనిని 'మోహముద్గరం' అని కూడా పిలుస్తారు.

Photo: సంసార సాగరంలో ఈదులాడుతూ తీరం తెలియక తల్లడిల్లుతున్నా, ఆ సాగరంపై వ్యామోహం వీడదు మనకు. ఎండమావుల వెంట పరుగులు తీస్తూంటాం; ఎడారి మంటలకు చలి కాచుకుంటూ ఉంటాం. మోహపు తెరలు కమ్ముకుంటున్నా, ఆ మాయాజాలపు మైకంలోనే మునిగిపోతున్నాం. కానీ ఆ మాయను సృజించిన మాధవుడే మళ్ళీ మనల్ని మేల్కొలిపేందుకు అవతార పురుషుల రూపంలో ఆగమిస్తాడు. "జీవితంలోని క్లిష్ట సమస్యలను ఆ భగవంతుడే పరిష్కరిస్తాడు. నిగూఢ విషయాలను సైతం ఎంతో సామాన్య విషయాల మాదిరిగానే అవలీలగా పసిపిల్లలకు కూడా బోధపడేలా బోధించగలడు. అతడి దివ్య తేజం తరతరాలుగా పేరుకుపోయిన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది"అంటారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస. అలాంటి కోవకు చెందిన మహనీయులే ఆదిశంకరాచార్యులు. జ్ఞానాంజన ద్వారా మనిషి మనోనేత్రంలోని భేదభావ చట్వారాన్ని పరిహరించిన ప్రజ్ఞావంతులు వారు. ఆ పరంపరలో శంకరాచార్యులు మానవాళికి అందించిన అద్భుత 'భజగోవిందం'.
ఒకరోజు శిష్య సమేతులై శంకరాచార్యుల వారు కాశీనగర వీధుల్లో పయనిస్తూ ఉన్నారు. దూరంగా ఓ ఇంటిముందు వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేస్తున వృద్ధ బ్రాహ్మణున్ని చూశారాయన. జీవిత సంధ్యా సమయంలో కూడా భగవంతుడిపై దృష్టి మరల్చక, లౌకికమైన జ్ఞానం కోసం తపిస్తున్న ఆ వ్యర్థ జీవిపై సానుభూతి కలిగింది ఆదిశంకరులకు. వెంటనే అతనిని ఉద్దేశించి 'భజగోవిందం' శ్లోకాన్ని ఆశువుగా గానం చేశారు.
మానవుడి అస్తవ్యస్త జీవితాన్ని చూసి హృదయం ద్రవించిన శ్రీశంకరులు అంతటితో ఆగక, మానవజీవన వికాసానికి దోహదపడే పన్నెండు శ్లోకాలు చెప్పారు. వీటినే 'ద్వాదశ మంజరీక స్తోత్రం' అంటారు. శంకరాచార్యుల వారిని అనుసరించి నడుస్తున్న పధ్నాలుగు మంది శిష్యులు ఆచార్యుల వారి బోధతో ఉత్తేజితులై ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చొప్పున పద్నాలుగు శ్లోకాలు చెప్పారు. వీటిని 'చతుర్దశ మంజరీక స్తోత్రం' అంటారు. శిష్యులు రచించిన ఈ చతుర్దశ మంజరీక స్తోత్రాన్ని ఆలకించి సంతృప్తి చెందిన పూజ్యపాదులు ఆశీర్వచనంగా చివరి నాలుగు శ్లోకాలు చెప్పారు. మొత్తం కలిసి ముప్పది శ్లోకాలుగా ఏర్పడిన ఈ గ్రంథం 'భజగోవిందం' అనే పేరుతొ ప్రాచుర్యం పొందింది. మానవుని మనస్సులోని మొహాన్ని పారద్రోలే శక్తి గలది కనుక దీనిని 'మోహముద్గరం' అని కూడా పిలుస్తారు.

No comments:

Post a comment