విగ్రహారధన ప్రాముఖ్యత

చాలామంది అసలు విగ్రహారధన ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతారు. దీన్ని మంచి ఉదాహరణతో చెప్పాలంటే...ఒక తెల్ల కాగితానికి అసలు విలువ ఏమీ ఉండదు. కాని అదే కాగితం మీద ప్రభుత్వ కరెన్సి ప్రెస్ లో ముద్రింపబడి బయటకు వస్తే దాని విలువ మారిపోతుంది. సాధారణంగా రాతికి మనం విలువ ఇవ్వం. కాని దాన్ని శిల్పంగా చెక్కినా లేదా ఆరాధనకి గుళ్ళో ఉంచినా తలలు వంచి చేతులు జోడించి దాన్ని భగవంతుడిగా తలచి నమస్కరిస్తాము. దేవుడు లక్షణాలన్నీ ఆ విగ్రహానికి ఆపాదించి ఆరాధిస్తాం. సేవలు చేస్తాం. చపల చిత్తమైన మనస్సుని నిగ్రహించి ఒకే వస్తువు మీద మనస్సుని కేంద్రీకరించడమే ఆధ్యాత్మికత అసలు లక్ష్యం. ఇందు వల్ల పరమాత్మకి సంబంధించిన ఙ్ఞానం అబ్బుతుంది. ఇందుకు వీలుగా మనస్సుని ఓ రూపం మీద కేంద్రీకరించడానికి గాను దైవ విగ్రహం అనేది సహాయం చేస్తుంది.ఇంక ఒక సారి మనస్సు ఏక వస్తువు మీద కేంద్రీకరించడం పట్టుబడితే ఇక ఆ విగ్రహాలతో పని ఉండదు. అందుకు సోపానంగా విగ్రహం ఆవశ్యకత ఎంతో ఉంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోని వారికి ఇలాంటి గుర్తులు అవసరం ఉండవు. వారు తమలోనే ఆత్మనే దేవుడిగా..అంతా ఒక్కటే అనే భావన తో ఉంటారు, ఆ స్థితికి చేరుకోవడానికి మొట్టమొదటి మెట్టు విగ్రాహారధన.
ఎవరి మానసిక పృవ్రత్తిని అనుసరించి వారికి ఉపయోగించే విగ్రహాలని ప్రాచీన ఋషులు ఏర్పరిచారు.
గుళ్ళల్లో ప్రతిష్టించిన తరువాత, ఆయా మూర్తులకు మంత్ర శక్తితో ,వేదములతో, ఆవాహన చేస్తారు. అప్పుడు ఆ విగ్రహంలో ఆ దేవతా శక్తి ఉంటుంది. ఆ తరువాత నిత్య పూజలు, అనుష్ఠానాలతో ఆ శక్తిని పూజిస్తాము.

Photo: చాలామంది అసలు విగ్రహారధన ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతారు. దీన్ని మంచి ఉదాహరణతో చెప్పాలంటే...ఒక తెల్ల కాగితానికి అసలు విలువ ఏమీ ఉండదు. కాని అదే కాగితం మీద ప్రభుత్వ కరెన్సి ప్రెస్ లో ముద్రింపబడి బయటకు వస్తే దాని విలువ మారిపోతుంది. సాధారణంగా రాతికి మనం విలువ ఇవ్వం. కాని దాన్ని శిల్పంగా చెక్కినా లేదా ఆరాధనకి గుళ్ళో ఉంచినా తలలు వంచి చేతులు జోడించి దాన్ని భగవంతుడిగా తలచి నమస్కరిస్తాము. దేవుడు లక్షణాలన్నీ ఆ విగ్రహానికి ఆపాదించి ఆరాధిస్తాం. సేవలు చేస్తాం. చపల చిత్తమైన మనస్సుని నిగ్రహించి ఒకే వస్తువు మీద మనస్సుని కేంద్రీకరించడమే ఆధ్యాత్మికత అసలు లక్ష్యం. ఇందు వల్ల పరమాత్మకి సంబంధించిన ఙ్ఞానం అబ్బుతుంది. ఇందుకు వీలుగా మనస్సుని ఓ రూపం మీద కేంద్రీకరించడానికి గాను దైవ విగ్రహం అనేది సహాయం చేస్తుంది.ఇంక ఒక సారి మనస్సు ఏక వస్తువు మీద కేంద్రీకరించడం పట్టుబడితే ఇక ఆ విగ్రహాలతో పని ఉండదు. అందుకు సోపానంగా విగ్రహం ఆవశ్యకత ఎంతో ఉంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోని వారికి ఇలాంటి గుర్తులు అవసరం ఉండవు. వారు తమలోనే ఆత్మనే దేవుడిగా..అంతా ఒక్కటే అనే భావన తో ఉంటారు, ఆ స్థితికి చేరుకోవడానికి మొట్టమొదటి మెట్టు విగ్రాహారధన.
ఎవరి మానసిక పృవ్రత్తిని అనుసరించి వారికి ఉపయోగించే విగ్రహాలని ప్రాచీన ఋషులు ఏర్పరిచారు.
గుళ్ళల్లో ప్రతిష్టించిన తరువాత, ఆయా మూర్తులకు మంత్ర శక్తితో ,వేదములతో, ఆవాహన చేస్తారు. అప్పుడు ఆ విగ్రహంలో ఆ దేవతా శక్తి ఉంటుంది. ఆ తరువాత నిత్య పూజలు, అనుష్ఠానాలతో ఆ శక్తిని పూజిస్తాము.

No comments:

Post a Comment