శ్రుతులు, స్మృతులు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు అన్నీ పరమ ప్రమాణాలే

మీరు చెప్పిన గ్రంథాలన్నీ పరమ ప్రమాణాలు. వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు సమస్తం కూడా ధర్మమును, న్యాయమును మనం ఆచరించదగిన విధానాన్ని చెప్పినయ్. అయితే శ్రుతిం పశ్యన్తి మునయః స్మరన్తి చ తథా స్మృతిం” అని. శ్రుతులను కన్నులతో చూచి ఆ అర్థములను చక్కగా అవలోకనం చేసి అది సమస్త జీవులకు కష్టం కనుక తెలుసుకోవడం వాటికి సరళంగా, వివరణగా, విచారణగా విశ్లేషించి స్మృతులను స్మరించారు మహర్షులు. మనన శీలురైన మహర్షులు వాటిని చూచి స్మరిస్తారు. అది చూచి స్మరించారు కనుక అదే ఇది. మనువు చెప్పిందే భేషజం, మందు అన్నారు. శ్రుతులు కూడా దీనిని చక్కగా బలపరిచినయ్. కనుక శ్రుతులు, స్మృతులు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు అన్నీ పరమ ప్రమాణాలే. ఇవి వేరు వేరు విషయాలు చెప్పవు. అన్నీ కలిపి ధర్మాన్ని చెప్తాయి. అందులో ప్రవృత్తి, నివృత్తి. స్థాన భేదం, అధికార భేదం, సమయ భేదం. దానిని బట్టి చెప్తున్నటువంటి మాటలు గానీ వాటికి, వాటికి ఏవిధమైనటువంటి విరోధమూ ఉండదు.

Photo: మీరు చెప్పిన గ్రంథాలన్నీ పరమ ప్రమాణాలు. వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు సమస్తం కూడా ధర్మమును, న్యాయమును మనం ఆచరించదగిన విధానాన్ని చెప్పినయ్. అయితే శ్రుతిం పశ్యన్తి మునయః స్మరన్తి చ తథా స్మృతిం” అని. శ్రుతులను కన్నులతో చూచి ఆ అర్థములను చక్కగా అవలోకనం చేసి అది సమస్త జీవులకు కష్టం కనుక తెలుసుకోవడం వాటికి సరళంగా, వివరణగా, విచారణగా విశ్లేషించి స్మృతులను స్మరించారు మహర్షులు. మనన శీలురైన మహర్షులు వాటిని చూచి స్మరిస్తారు. అది చూచి స్మరించారు కనుక అదే ఇది. మనువు చెప్పిందే భేషజం, మందు అన్నారు. శ్రుతులు కూడా దీనిని చక్కగా బలపరిచినయ్. కనుక శ్రుతులు, స్మృతులు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు అన్నీ పరమ ప్రమాణాలే. ఇవి వేరు వేరు విషయాలు చెప్పవు. అన్నీ కలిపి ధర్మాన్ని చెప్తాయి. అందులో ప్రవృత్తి, నివృత్తి. స్థాన భేదం, అధికార భేదం, సమయ భేదం. దానిని బట్టి చెప్తున్నటువంటి మాటలు గానీ వాటికి, వాటికి ఏవిధమైనటువంటి విరోధమూ ఉండదు.

No comments:

Post a comment