హనుమంతుడు దూరాన సీతను చూచుట-శ్రీ రామాయణం

హనుమంతు డా చెట్టుమిదే వుండి సీతకోసం ఆ ప్రాంత భూభాగం అంతా చూశాడు. అదంతా కల్పవృక్షాలతో నిండి వుంది. అక్కడికి కొద్ది దూరాన హనుమంతున కొక చక్కని మేడ కనబడింది. ఆ మేడకి వెయ్యి స్తంభాలున్నాయి. అది కైలాసశిఖరం లాగా తెల్లగా వుంది. అది ఆకాశం అందేటంత యెత్తుగా వుంది. అక్కడ వొక రమణి దీనురాలై కూచుని వుంది. ఎప్పుడు స్నానం యెరగని మనిషిలాగ ఆమె వుంది. ఆమె కట్టుకున్న చీర మాసిపోయి వుంది. అన్నం లేక చిక్కిపోయిన్నీ వుంది, మాటిమాటికీ నిట్టూర్పులు విడుస్తూంది. శుద్ధపాఢ్యమి నాటి చంద్రరేఖ లాగా అసలే దీనంగా వున్న ఆమె చుట్టూ భయం కొలిపే రాక్షస స్త్రీలు కూచుని వున్నారు. ఆమె యెంత మలినంగా వున్నా చాలా అందకత్తెలాగే కనబడుతోంది. ఆమె కళ్ళు నీళ్ళు పెట్టుకొని , ఆమె వాపోతూ ఏదో ధ్యానిస్తూ వుంది. రాక్షసస్త్రీలేగాని బంధువులెవరూ దగ్గిర లేక దీనంగా వుంది. ఆమె జడ నల్ల తాచులా వుంది.

హనుమంతుడు సీతే అనుకున్నాడు. రాక్షసుడెత్తుకుపోతూ వున్న స్త్రీలాగే వుంది ఆమె. అంచేతనే ఆమె సీత అని అతను నిశ్చయించుకున్నాడు. పైగా రాముడు చెప్పిన నగలే ఆమె దేహం మీద వున్నాయి. కొన్ని నగలు లేవు. మూట గట్టి ఋశ్యమూకం మీద పడవేసినవి అవే అయివుంటాయి. ఆ మూట గట్టిన వస్త్రం యెలావుందో ఆమె కట్టుకున్న వస్త్రం ఆ రంగుతోనే - దాని శేషంగానే వుంది. కనుక, "రాముడు - శోకంతో బాధపడుతున్నది యీమెకోసమే" అని నిశ్చయించుకున్నాడు. "రాముడు సర్వలక్షణుడు. ఈమెకూడా అలాగ సర్వలక్షణ సంపన్నురాలే. కనుక, ఈమె రాముని భార్య అయిన సీతే" అని స్థిరపరచుకున్నాడ డతను. " అయ్యో, ఇలాంటి సీతను విడిచి రాముడెలా బతికివుండగలిగాడూ? ఇలా వుండడం సామాన్యులకు శక్యం కాదు" అని అతను రాముణ్ణి మెచ్చుకున్నాడు.

హనుమంతుడు ఆమె సీతే అని నిశ్చయించుకొనుట

హనుమంతు డింతలో సీతను గురించి మళ్ళి దుఃఖించసాగాడు. "అయ్యో! గురువినీతుడైన లక్ష్మణునకు పూజ్యురాలూ, రామునకూ ప్రియురాలూ అయిన సీతకున్నూ దుఃఖం తప్పింది కాదు. కాలగతి యెవరు దాటగలరు? ఈమె రాముని పరాక్రమమూ లక్ష్మణుని పరాక్రమమూ యెరిగి వున్నది కనుకనే వర్షాకాలంలో గంగానది లాగ ఈ సీత క్షిణించకుండా యిలా వుండగలిగింది. కులంలోనూ, వయస్సులోనూ, స్వభావంలోనూ, సదాచారంలోనూ సీతారాములొకరికొకకు తగివున్నారు. విశాలాక్షి అయిన యీ సీతమూలానే వాలి రాముని చేతిలో కూలి పోయాడు. రావణునితో సమానుడైన కబంధుడూ, భీమవిక్రముడైన విరాధుదున్నూ, యీ సీతమూలానే నాశనం అయిపోయారు. వాలి ఆధీనంలో వున్న దుర్లభ వానర రాజ్యలక్ష్మి ఈ సీతమూలానే సుగ్రీవునకు సంక్రమించింది. నేను సముద్రం దాటాను. ఈ లంకలోకి వచ్చాను. ఇదంతా ఈమెమూలానే. ఈమెకోసం రాముడు జగ్గత్తంతా తల్లక్రిందులు చేసెయ్యగలడు. మిథిలాధిపతి జనకమహారాజు కూతురూ పతివ్రతలలో అగ్రేసరురాలూ అయిన యీ సీత భూమిని భేదించుకుని పుట్టుకువచ్చింది. ఎలాంటి యుద్ధాలలోనూ గూడా వెనుకంజ యెరగని దశరథమహారాజుకి ఈమె పెద్ద కోడలు. ధర్మజ్ఞుడూ, కృతజ్ఞుడూ సర్వజ్ఞుడూ అయిన రామున కీమె ప్రియభార్య. ఇలాంటి సీత యిపుడు రాక్షసస్త్రీల స్వాధీనంలో పడిపోయింది.

ఈమె అయొధ్యలో వున్న సకలభోగాలూ విడిచి భర్తతో నిర్జనారణ్యానికి వచ్చింది. కందమూల ఫలాలతో తృప్తిపడుతూ భర్తకి శుశ్రూష చేసింది. అడవుల్లో కూడా రాజభవనంలో వున్నట్టే యీమె ఆనందంగా సంచరించింది. ఇలాంటి సీత యిప్పుడు రాక్షసాంగనల చేతిలో చిక్కి సకల యాతనలూ అనుభవిస్తుంది. ఈమె కోసం రాముడు తప్పకుండా రావాలి. సీత రాముడు వస్తాడనే నమ్మకంతోనే ప్రాణాలు నిలుపుకొని వుంది. ఈమె రాక్షసాంగలను చూడ్డంలేదు. ఈ పుష్పాలూ, యీ ఫలాలూ కూడా చూడ్డం లేదు. ఇలాంటి సీతను విడిచిన్నీ రాముడు నిశ్చింతగా వున్నాడు. అలాంటి ధైర్యం మరెవడు చూపగలడు? ఈ సీతమ్మను చూస్తుంటే నా గుండెలు కూడా బద్దలయిపోతున్నాయి. అయ్యో! ఈ సీతమ్మ భూదేవికంటే వోర్పు కలది. రామలక్షణుల రక్షణలో సుఖంగా వున్న యీమె యీ క్రూర రాక్షసాంగనల బారి పడిపోయిందిగదా! అనుకుంటూ ఆమె సీతే అనే స్థిరనిశ్చయంతో అతనా చెట్టుమీదే వుండిపోయాడు.

అప్పటికి చంద్రబింబం పడమటికి వాలింది. చంద్రుడు హనుమంతునకు సాయం చేస్తున్నాడన్నట్లు చల్లని కిరణాలతో అతనికి సేదతీర్చాడు. అప్పుడు హనుమంతుడు బాగా మిమర్శించి చూడగా సీత చుట్టూ కూచునివున్న రాక్షసాంగనలు చాలా ఘోరంగా కనబడ్డారు. వారిలో ఒకరికి ఓక్క కన్నే వుంది. ఒకరికి వొక్క చెవే వుంది. ఒకరికి చెవులు శిరస్సంతా కప్పేశాయి. ఒకరికి చెవులే లేవు. కొందరి గోళ్ళు పారల్లా వున్నాయి. కొందరి నాలుకలు కిందికి వేల్లాడుతున్నాయి. వారందరూ రోకల్లూ, శూలాలూ, ముద్గరాలూ మొదలైన ఆయుధాలు పట్టుకొని వున్నారు. వారందరూ మాటిమాటికి మాంసం తింటూ మద్యపానం చేస్తున్నారు. సీత వొక చెట్టు మొదట కూచొగా వారందరూ ఆమె చుట్టూ కూచుని వున్నారు. మూర్తీభవించిన శోకంలా వుండినా, ఆమెని చూసినందుకు హనుమంతుడు చాలా సంతోషించాడు. అతని కళ్ళల్లో ఆనందబాష్పాలు వెల్లివిరిసాయి. వెంటనే రాముణ్ణీ లక్ష్మణుణ్ణి తలచుకొని నమస్కరించి చెట్టుగుబురులో బాగా నక్కి కూచున్నాడు.

Photo: హనుమంతుడు దూరాన సీతను చూచుట-శ్రీ రామాయణం

No comments:

Post a comment