నట్టరామేశ్వర గుడి , భీమవరం


భక్తి's photo.


భక్తి's photo.


భక్తి's photo.

పాలకొల్లు నుంచి 20 కి.మీ దూరంలో ఉన్నది. నట్టా రామేశ్వర దేవాలయంలోని స్వామి ఒక చక్కటి ప్రత్యేకతను కలిగి ఉంటారు. స్వామి లింగాకారాన్ని పూర్తిగా సముద్ర తీరంలో లభ్యమయ్యే గవ్వలతో , శంకాలతో అత్యద్బుతంగా మలిచినారట. సందర్శకులతో ఈ ఆలయం ఎల్లప్పుడూ హడావుడిగా ఉంటుంది. శివరాత్రి కార్తీకమాస పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
భారతదేశంలో ప్రత్యేకతను సంతరించుకున్న పట్టణం. కారణం ఏమిటంటే ఇక్కడ వేంచేసి ఉన్న సోమేశ్వరస్వామి , గనుపూడి సోమేశ్వరస్వామి వారి దేవాలయం భీమవరంకు మకుతమాయం అనడంలో అతిశయోక్తి కాదు. ఈ ఆలయం 3వ శతాబ్దంలో నిర్మింపబడినదని చరిత్ర చెబుతుంది. ఆలయంలోని శివలింగం ఒక విశిష్టతను సంతరించుకొని ఉన్నది. అమావాస్య రోజున ఈ లింగం నలుపు లేక గోధుమ వర్ణంలో దర్శనమిస్తుంది. పౌర్ణమి రోజున ఒకరమైన శ్వేతవర్ణంలో దర్శనమిస్తుంది. ఎంతోమంది కారణాలను వెతికినా ప్రయోజనం లేదు. కేవలం శివుని మహిమ అని భక్తుల నమ్మకం . ఇంకా ఈ గుడి విశేషం శివాలయం పై ప్రతిష్టించిన అన్నపూర్ణాదేవి విగ్రహం. ఇటువంటి విచిత్రాలు ఎ ప్రాంతంలో కూడా కనిపించనివి అని చెబుతారు. మరి ఇంతటి చిత్ర విచిత్రలు కలిగిన భీమవరసోమేశ్వర దేవాలయాన్ని దర్శించి తరిద్దాం.

భక్తి's photo.

No comments:

Post a Comment