ఓకారం రూపపు ఆభరణంలో వినాయకుడు

హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. (ముఖ్యంగా దేవనాగరి, తమిళ లిపులలో) గణపతి అధర్వశీర్షంలో ఈ విషయం ఇలా ఉంది:
గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము.

మూలాధార చక్రము

కుండలినీ యోగము ప్రకారంము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై (చుట్టు చుట్టుకొని, నిద్రాణమై) ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు. గణపతి అధర్వశీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అని కూడా వివరిస్తుంటారు.
వినాయక స్వరూపానికి తాత్విక వివరణ.
మంగళూరులోని "కుద్రోళి భగవతి" మందిరంలో అలంకృత గణేశవిగ్రహం.
వినాయకుని ఆకారం పై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్ధ వివరణలు, కథలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం - ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు.
వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం)ను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
వినయకుని తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు.
ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.
మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము
చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము
చేతిలో పాశము - విఘ్నాలు కట్టిడవసే సాధనము
విరిగిన దంతము - త్యాగానికి చిహ్నము
మాల - జ్ఙాన సముపార్జన
పెద్ద చెవులు - మ్రొక్కులు వినే కరుణామయుడు
పొట్టపై నాగ బంధము - శక్తికి, కుండలినికి సంకేతము
ఎలుక వాహనము - జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.

Photo: ఓకారం రూపపు ఆభరణంలో వినాయకుడు

No comments:

Post a Comment