నాగేంద్రుడి గుడి-నాగర్ కోయిల్

ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ పట్టణము నందు కలదు. నాగర్ కోయిల్ అనే పేరు ఈ నాగరాజ గుడి మూలంగానే వచ్చిందని చెపుతారు. ఈ గుడి ముందు ఒక చిన్న కొలను లాంటిది కలదు. కొలనులో భక్తులు స్నానం చేసి నాగరాజ స్వామిని దర్శిస్తారు. కొలను పక్కగా ఒక దిమ్మె మీద చాలా నాగరాజ విగ్రహాలు కలవు. భక్తులు పసుపు మరియు పాలతో వీటిని అభిషేకిస్తారు. ఈ గుడిలో మనకు ఎక్కడ చూసినా నాగరాజ ప్రతిమలే కనిపిస్తాయి.

భక్తి's photo.
భక్తి's photo.
ఈ గుడిలో ఇద్దరు ప్రధాన దైవాలు. ఆనంద కృష్ణ మరియు నాగరాజ. నాగరాజ గర్భాలయంలో వూరు నీటి వూటలోని నీటిని తీర్ధముగా ఇస్తారు. ఈ నీటి వూటలోని ఇసుక సంవత్సరములో సగభాగం తెల్లగాను మరియు మిగిలిన సగభాగం నల్లగాను ఉంటుంది.

No comments:

Post a comment