హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు

హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.
హనుమద్వ్రతము ఎక్కడ చేయాలి?
వాస్తవానికి పంపానదీ తీరమునందు కూర్చొని మాత్రమే హనుమద్వ్రతము చేయాలి. వేరొక చోట ఎక్కడ కూర్చొని కూడా హనుమద్వ్రతము చేయరాదు. శాస్త్రము దీనికి ఒక మినహాయింపు ఇచ్చింది. నువ్వు పంపా నదీ తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశం పెట్టి అందులో నీరు పోసి దానికి దారములు కడతారు. అది శాస్త్రము తెలిసిన వారు, ప్రక్రియను నిర్వహించగలిగిన వారు మాత్రమే కడతారు. కలశంమీద కొబ్బ్బరి బొండాం పెట్టి అందులోకి పంపా జలంయొక్క ఆవాహన మంత్రం చెప్తారు. అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్లే లెక్క. అప్పుడు హనుమద్వ్రతం చేస్తారు.
హనుమద్వ్రతం ఎందుకు చేస్తారు?
పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒకరాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి? అన్నారు. పంపానదీతీరంలో కూర్చొని మార్గశిర త్రయోదశినాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో ఆ వ్రతం చేయించారు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. చేయగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. రాజు హనుమద్వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమయొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు, సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితమును పొందిన మహోత్క్రుష్టమైన వ్రతము కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశీ తిథినాడు హనుమద్వ్రతమును చేస్తారు. వ్రతము చేయడం ఎంతో వ్రతముయొక్క ప్రసాదమును స్వీకరించడం కూడా అంతే. ఇవాల్టి రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు. ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారనుకోండి హనుమత్ వ్రతాన్ని పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము వచ్చేస్తుంది.

Photo: హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.
హనుమద్వ్రతము ఎక్కడ చేయాలి?
వాస్తవానికి పంపానదీ తీరమునందు కూర్చొని మాత్రమే హనుమద్వ్రతము చేయాలి. వేరొక చోట ఎక్కడ కూర్చొని కూడా హనుమద్వ్రతము చేయరాదు. శాస్త్రము దీనికి ఒక మినహాయింపు ఇచ్చింది. నువ్వు పంపా నదీ తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశం పెట్టి అందులో నీరు పోసి దానికి దారములు కడతారు. అది శాస్త్రము తెలిసిన వారు, ప్రక్రియను నిర్వహించగలిగిన వారు మాత్రమే కడతారు. కలశంమీద కొబ్బ్బరి బొండాం పెట్టి అందులోకి పంపా జలంయొక్క ఆవాహన మంత్రం చెప్తారు. అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్లే లెక్క. అప్పుడు హనుమద్వ్రతం చేస్తారు.
హనుమద్వ్రతం ఎందుకు చేస్తారు?
పరాశర సంహిత దీని గురించి చెప్పింది. పదమూడు క్షేత్రములున్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒకరాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది.  ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి?  అన్నారు. పంపానదీతీరంలో కూర్చొని మార్గశిర త్రయోదశినాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో ఆ వ్రతం చేయించారు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. చేయగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది.  రాజు హనుమద్వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమయొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు, సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ  ప్రభువైన సోమదత్తుడు  చేసి ఫలితమును పొందిన మహోత్క్రుష్టమైన వ్రతము కనుక ఇప్పటికీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశీ తిథినాడు హనుమద్వ్రతమును చేస్తారు. వ్రతము చేయడం ఎంతో వ్రతముయొక్క ప్రసాదమును స్వీకరించడం కూడా అంతే. ఇవాల్టి రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు. ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారనుకోండి హనుమత్ వ్రతాన్ని పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము వచ్చేస్తుంది.

No comments:

Post a comment