తిరుమూర్తి దేవాలయం


భక్తి's photo.


భక్తి's photo.


భక్తి's photo.

భక్తి's photo.

ఇది తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 22 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ఒకే గుడిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల 
ప్రతిమలు కలవు. ఇది ఒకప్పుడు త్రిమూర్తిగా పిలువబడేది. త్రిమూర్తి అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు . తదనంతర కాలంలో అదే తిరుమూర్తిగా 
ప్రాచుర్యం పొందింది. ఈ గుడికి సంబంధించిన ఒక కథ మనకు వినిపిస్తుంది.

ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం అత్రి మహర్షి, తన భార్య అనసూయతో కలిసి ఇక్కడ నివసించేవారు. ఒకనాడు నారదుడు అనసూయ యొక్క 
పాతివ్రత్యం గురించి బ్రహ్మ, విష్ణు మరియు ఈశ్వరుడి ధర్మపత్నులైన సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి దగ్గర ప్రస్తావించాడు. దీనితో ఆ ముగ్గురు 
దేవతలు అసూయ చెందారు. ఎలాగైనా అనసూయ యొక్క పాతివ్రత్యం తగ్గించమని తమ భర్తలను వేడుకుంటారు . ఒకనాడు అత్రి మహర్షి లేని 
సమయంలో త్రిమూర్తులు వెళ్లి అనసూయను భిక్ష అడుగుతారు. కాని వారు ఒక షరతు విధిస్తారు. అనసూయ వివస్త్రగా భిక్ష వేస్తేనే స్వీకరిస్తామని. దీనితో 
అనసూయకు ఏమి చేయాలో మొదట పాలుపోదు. తరవాత బాగా అలోచించి అనసూయ , మనసులో తన భర్తను తలచుకొని భిక్ష వేయడానికి 
సిద్ధమవుతుంది. అనసూయ పాతివ్రత్య ప్రభావం చేత త్రిమూర్తులు ముగ్గురు చిన్న పసిపాపలుగా మారిపోతారు. అప్పుడు వాళ్లకు పాలు పట్టి 
పడుకోబెడుతుంది. తన భర్త వచ్చిన తరవాత జరిగినదంతా చెబుతుంది. జరిగిన దానికి అత్రి మహర్షి చాలా సంతోషిస్తాడు. కొద్దిసేపటి తరవాత త్రిమూర్తులు 
మేలుకొని, అనసూయ పాతివ్రత్య మహిమను అభినందిస్తారు. ఏదైనా వరం కోరుకొమ్మని అనసూయను అడుగుతారు త్రిమూర్తులు. అనసూయ 
త్రిమూర్తులను తన బిడ్డలుగా జన్మించాలనే వరాన్ని కోరుకుంటుంది. అది ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర.
చూడవలసినవి: తిరుమూర్తి గుడి, తిరుమూర్తి డ్యాం, తిరుమూర్తి జలపాతం

వసతి: పొల్లాచిలో చాలా హోటల్స్ కలవు.

అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు.

No comments:

Post a comment