నాయకుడు ఎలా ఉండకూడదు?:

అనగనగా ఒక పెద్ద దిగుడు బావిలో వందలాది కప్పలు బెకబెకమంటూ కాపురముంటున్నాయి. తమని నడిపించే యోగ్యుడైన నాయకుడు కావాలని వాటికి కోరికకలిగింది. అవి దేవుణ్ణి ప్రార్ధించసాగాయి. ఇలా ప్రార్థనలు సాగిస్తుండగా, పక్కనే ఉన్న చెట్టు మాను విరిగి ఆ బావిలో పడింది. పెద్ద శబ్దం రావడమే కాక, నీళ్ళు నేలంత ఎత్తుకి చిమ్మాయి. కప్పలు కాసేపు భయపడినా, తాము ప్రార్థించినందుకు ప్రతిఫలంగా దేవుడు తమకు గొప్ప నాయకుడిని పంపించాడని నమ్మాయి. నెమ్మదిగా దాని దగ్గరకు రావడం మొదలుపెట్టాయి. పలకరించడానికి ప్రయత్నించాయి. ఉలుకు పలుకు లేదు. మాను మీద ఎక్కాయి, తొక్కాయి, బెకబెక లాడాయి, ఆటలాడాయి. అయినా స్పందనే లేదు. నెమ్మదిగా వాస్తవాన్ని అర్థం చేసుకున్నాయి. ఇతడా నాయకుడని వాపోయాయి. “మేం కోరుకున్నది మంచి చలాకీ అయిన నాయకుడిని తప్ప ఈ మొద్దుని కాదు” అంటూ తిరిగి దైవాన్ని ప్రార్ధించాయి.
ఈ పర్యాయం పైనుంచి ఓ పాము బావిలో పడింది. చురుకుగా మెలికలు తిరుగుతోంది. బావంతా కలయదిరుగుతోంది. కప్పలన్నీ ఆ పామును చూసి, భలే చలాకీ అయిన నాయకుడిని తమకు దేవుడు పంపించాడని భావించాయి. సన్నగా తాడులా ఉన్నందువల్ల అతడి వాళ్ళ ప్రమాదమేమీ లేడని తలపోశాయి. ఆ పాము మొదట తన నోటికందిన ఓ కప్పని కరాచీ, కొరికి తినివేసింది. తరువాత మరో కప్పని, తరువాత ఇంకో కప్పని, ఆలకి పెరిగిన పాము అనేక కప్పలను తినేయసాగింది. లబోదిబోమన్న కప్పలు “నాయకుడు మొద్దుగా ఉంటే లోటు. పాములా ఉంటే చేటు” అని వాపోయాయి.

Photo: నాయకుడు ఎలా ఉండకూడదు?:

No comments:

Post a Comment