ధ్యానం ఎలా చేయాలండీ?

ఈనాడు ధ్యానం చాలా ప్రాచుర్యం పొందిన అశం. ధ్యానం ఎలా చేయాలండీ? ధ్యానం నేరుపుతారా? ఇవి చాలామంది గురువులు ఎదుర్కొంటున్న ప్రశ్నలు. దీనికి కారణం "ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ఒక వారం రోజుల్లో ధ్యానం నేర్పుతాం, అంత సమయం ఇవ్వలేని వారికి మూడే మూడు రోజుల్లో ధ్యానం నేర్పుతాం" అని చెప్పడమే!
ధ్యానం ఎలా చేయాలో తెలుసుకునే ముందు, ధ్యానం ఎందుకు చేయాలి? అన్న ప్రశ్న మనలో ఉదయించాలి. మాటలు రాని పసిపిల్లవాడు ఏడ్చినప్పుడు తల్లి బుజ్జగిస్తూ మొట్టమొదట పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాతే ఏంచేయాలి? ఎలా చేయాలి అన్న ఆలోచన.
ఒక అధ్యాపకుడు తన విద్యార్థులకు సైన్ులో ఒక ప్రయోగం నేర్పించారు. పరీక్షలో దాని గురించి "అది ఏమిటి? ఎలా జరుగుతుంది?" అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఒక విద్యార్థి "ఏమిటంటే ఎలా చెప్పను? ఎలా అంటే ఏమి చెప్పను?" అని వ్రాశాడు. ఎందుకా ప్రయోగం చేయాలి అన్న జ్ఞానం లేకపోవడం వల్లనే ఆ విద్యార్థి ఏమిటి? ఎలా? అన్న అంశాలను మరచిపోయాడు.
ఒక పెద్ద మనిషిని ధ్యానం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారని అడిగినప్పుడు ధ్యానం చేస్తే రక్తపోటు తగ్గుతుందని డాక్టరుగారు చెప్పారని బదులిచ్చాడు. కాబట్టి ఎందుకు అన్న ప్రశ్న మన అంతరంగంలో ఉదయించాలి. అది మన సొంత ఆలోచనవ్వాలి.
పతంజలి మహర్షి యోగానికి అంగాలు ఎనిమిది అని పేర్కొన్నారు. అవి ’యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహార, ధారన, ధ్యాన, సమాధి’.
యమ: అహింస, సత్యవాక్పాలన, దొంగతనం చెయ్యకపోవడం, బ్రహ్మచర్యం, ఎవరినీ యాచించకపోవడం
నియమ: బాహ్యాంభ్యంతర శుద్ధి, దొరికన దానితో తృప్తి, తపస్సు, వేదాధ్యయనం, భగవద్ధ్యానం.
ఆసన: కాసేపు ఒకచోట నిలకడగా కూర్చోగలగడం
ప్రాణాయామ: శ్వాసను లయబద్ధం చేయడం. లయబద్ధంగా ఉండే శ్వాస మనస్సును ప్రశాంత పరుస్తుంది.
ప్రత్యాహార: బాహ్య ప్రపంచంలోని వస్తువులు - పదార్థాలనుండి ఇంద్రియ అవయవాలను మరల్చి అంతర్ముఖం కావించడం.
ధారణ: ఒక వస్తువుపై మనస్సును స్థిరంగా వుంచడం.
ధ్యానం: ఏకాగ్రం చేసిన వస్తువుపై అవిచ్ఛిన్న ధారగా చేసే భావనా ప్రవాహమే ధ్యానం.
యమ నియమాలు మొదటి సోపానాలు. వీటిని మనం ఆచరిస్తున్నామా అని గమనించాలి. సత్యవాక్పాలన పాటిస్తున్నామా, దొరికిన దానితో సంతృప్తికరజీవనం గడుపుతున్నామా అని ఆలోచించుకోవాలి.
మందిరంలో భజన జరుగుతున్నప్పుడు కొంతమంది భక్తులు బయట ’ఇష్టాగోష్టి’ జరుపుతారు. కాసేపు కూడా కుదురుగా కూర్చోలేనప్పుడు ఆసనసిద్ధి ఎలా లభిస్తుంది" ఈ విధంగా ఆరుమెట్లు ఎక్కకుండా ఒక్కసారి ధ్యానం చేయబోవడం ఎంతవరకు సమంజసం? అది సాధ్యమవుతుందా? ఆలోచించండి.

Photo: ఈనాడు ధ్యానం చాలా ప్రాచుర్యం పొందిన అశం. ధ్యానం ఎలా చేయాలండీ? ధ్యానం నేరుపుతారా? ఇవి చాలామంది గురువులు ఎదుర్కొంటున్న ప్రశ్నలు. దీనికి కారణం "ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ఒక వారం రోజుల్లో ధ్యానం నేర్పుతాం, అంత సమయం ఇవ్వలేని వారికి మూడే మూడు రోజుల్లో ధ్యానం నేర్పుతాం" అని చెప్పడమే!
ధ్యానం ఎలా చేయాలో తెలుసుకునే ముందు, ధ్యానం ఎందుకు చేయాలి? అన్న ప్రశ్న మనలో ఉదయించాలి. మాటలు రాని పసిపిల్లవాడు ఏడ్చినప్పుడు తల్లి బుజ్జగిస్తూ మొట్టమొదట పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాతే ఏంచేయాలి? ఎలా చేయాలి అన్న ఆలోచన.
ఒక అధ్యాపకుడు తన విద్యార్థులకు సైన్ులో ఒక ప్రయోగం నేర్పించారు. పరీక్షలో దాని గురించి "అది ఏమిటి? ఎలా జరుగుతుంది?" అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఒక విద్యార్థి "ఏమిటంటే ఎలా చెప్పను? ఎలా అంటే ఏమి చెప్పను?" అని వ్రాశాడు. ఎందుకా ప్రయోగం చేయాలి అన్న జ్ఞానం లేకపోవడం వల్లనే ఆ విద్యార్థి ఏమిటి? ఎలా? అన్న అంశాలను మరచిపోయాడు.
ఒక పెద్ద మనిషిని ధ్యానం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారని అడిగినప్పుడు ధ్యానం చేస్తే రక్తపోటు తగ్గుతుందని డాక్టరుగారు చెప్పారని బదులిచ్చాడు. కాబట్టి ఎందుకు అన్న ప్రశ్న మన అంతరంగంలో ఉదయించాలి. అది మన సొంత ఆలోచనవ్వాలి.
పతంజలి మహర్షి యోగానికి అంగాలు ఎనిమిది అని పేర్కొన్నారు. అవి ’యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహార, ధారన, ధ్యాన, సమాధి’.
యమ: అహింస, సత్యవాక్పాలన, దొంగతనం చెయ్యకపోవడం, బ్రహ్మచర్యం, ఎవరినీ యాచించకపోవడం
నియమ: బాహ్యాంభ్యంతర శుద్ధి, దొరికన దానితో తృప్తి, తపస్సు, వేదాధ్యయనం, భగవద్ధ్యానం.
ఆసన: కాసేపు ఒకచోట నిలకడగా కూర్చోగలగడం
ప్రాణాయామ: శ్వాసను లయబద్ధం చేయడం. లయబద్ధంగా ఉండే శ్వాస మనస్సును ప్రశాంత పరుస్తుంది.
ప్రత్యాహార: బాహ్య ప్రపంచంలోని వస్తువులు - పదార్థాలనుండి ఇంద్రియ అవయవాలను మరల్చి అంతర్ముఖం కావించడం.
ధారణ: ఒక వస్తువుపై మనస్సును స్థిరంగా వుంచడం.
ధ్యానం: ఏకాగ్రం చేసిన వస్తువుపై అవిచ్ఛిన్న ధారగా చేసే భావనా ప్రవాహమే ధ్యానం.
యమ నియమాలు మొదటి సోపానాలు. వీటిని మనం ఆచరిస్తున్నామా అని గమనించాలి. సత్యవాక్పాలన పాటిస్తున్నామా, దొరికిన దానితో సంతృప్తికరజీవనం గడుపుతున్నామా అని ఆలోచించుకోవాలి.
మందిరంలో భజన జరుగుతున్నప్పుడు కొంతమంది భక్తులు బయట ’ఇష్టాగోష్టి’ జరుపుతారు. కాసేపు కూడా కుదురుగా కూర్చోలేనప్పుడు ఆసనసిద్ధి ఎలా లభిస్తుంది" ఈ విధంగా ఆరుమెట్లు ఎక్కకుండా ఒక్కసారి ధ్యానం చేయబోవడం ఎంతవరకు సమంజసం? అది సాధ్యమవుతుందా? ఆలోచించండి.

No comments:

Post a Comment