చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభము

కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత....అంత ప్రాధాన్యత!
ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.
దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం "
అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.
పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.
స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.
ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.
ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి. అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.
ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.
అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా , సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి.
కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.
ఈ మాసంలోని శుక్లపక్ష తదియనాడు బెల్లము,పప్పులను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చాలా మంచిది.
అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

No comments:

Post a comment