సర్వేంద్రియానాం నయనం ప్రధానం:



ఇది చదివి కంటి చూపు వేగముగా మెరుగు పరచుకొని , పూర్తి ఆరోగ్యము పొంద వచ్చు. ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ ..అంటారు .. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అంతే కాదు , మంచి కంటి చూపు కూడా ఇస్తాడు .
శ్రీ సూర్య నమస్కారం , అర్ఘ్యం చ...లఘునా
దీనికి కావలసినవి , 1 . ఒక రాగి గిన్నె కానీ చెంబు కానీ . 2 .ఎర్ర చందనము . ఇది చెక్కలుగా దొరుకుతుంది , కొన్ని చోట్ల పొడిగా కూడా దొరుకుతుంది . చెక్క తీసుకుంటే , రోజూ గంధము తీయాలి , పొడి అయితే దాన్ని రుద్ది గంధము చేయుట సులభము . ఓ నూరు రూపాయల చెక్క గానీ , పొడిగానీ కొనుక్కుంటే సంవత్సరము పైన వస్తుంది . ఇదికాక, రోజూ కొన్ని ఏవైనా ఎరుపు రంగు పూలు కావాలి . ఒక కుండీలో కనకాంబరాలు కానీ , ఇంకేవైనా ఎర్ర పూలిచ్చే గులాబీ , మందారము వంటి చెట్టుకానీ పెట్టుకోండి . విధానము స్నానము, సంధ్యావందనము ముగించి , మొదట ఎర్ర చందనము గంధము తీసి ( ఒక బటాణీ గింజంత అయినా చాలు ) రాగి చెంబులోని నీటిలో కలపండి . బాగా ఉద్ధరిణతో కలియబెట్టి , అందులోకి చిన్న చిన్న పూలు గానీ , పెద్ద పూలైతే వాటి రేకులు గానీ కలపండి . తర్వాత సూర్యునికెదురుగా నిలిచి ఈ కింది మంత్రము చెప్పి నమస్కరించండి
సూర్య మంత్రం ||
ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతి కరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ || తర్వాత కింది మంత్రము చెప్పుచూ ఇరవైనాలుగు సార్లు ఆత్మ ప్రదక్షిణము చేస్తూ , ప్రతి ప్రదక్షిణము తర్వాత , పూర్తి సూర్య నమస్కారము గానీ ( యోగా పద్దతిలో ) , లేదా , ఊరికే సాష్టాంగ నమస్కారముగానీ , అదీ వీలు కాకున్న , వంగి నేలను ముట్టి నమస్కారము గానీ చేయండి . ఇరవై నాలుగు సార్లు వీలుకాకున్న , పన్నెండు సార్లో , అదీ వీలుకాకున్న ఆరు సార్లో చేయండి . అయితే శ్రద్ధ ముఖ్యము. వీలైనన్ని ఎక్కువ సార్లు చేయుటకే ప్రయత్నించండి .మొదట ఒక వారము రోజులు అలవాటు అయ్యేవరకూ కాస్త కష్టమనిపించవచ్చు . ఆ తర్వాత అలవాటుగా , గబగబా చేసేస్తారు . మంత్రము కూడా అప్పటికి నోటికి వచ్చేస్తుంది . సూర్య నమస్కారం ||
�వినతా తనయో దేవః కర్మ సాక్షీ సురేశ్వరః సప్తాశ్వ సప్త రజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు || ||
మిత్ర , రవి , సూర్య, భాను , ఖగ , పూష , హిరణ్య గర్భ, మరీచ , ఆదిత్య , సవిత్ర , అర్క , భాస్కరేభ్యో నమః ||
ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ( పై మంత్రము 24 పర్యాయములు చెప్పి ప్రతిసారి ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారములు చెయ్య వలెను ) ఆ తర్వాత ,. సూర్య అర్ఘ్యం ఈ కింది మంత్రము చెప్పి రాగి చెంబులోని గంధము , పూలు కలిపిన నీటితో మూడు సార్లు కానీ , పన్నెండు సార్లు కానీ అర్ఘ్యము వదలండి. అర్ఘ్యము వదలునపుడు లేచి నిలుచొని, దోసిటి నిండా చెంబులోని నీళ్ళు తీసుకుని , మంత్రము చెప్పి , అంజలితో కిందికి వదలండి , లేదా , ఏ చెట్టు మొదట్లోకో , కుండీ లోకో వదలండి .
|| నమస్సవిత్రే జగదేక చక్షసే | జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే | త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే | విరించి నారాయణ శంకరాత్మనే || శ్రీ ఉషా సంజ్ఞా ఛాయా సమేత సూర్య నారాయణ పర బ్రహ్మణే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి (ఎర్ర చందనము , ఎర్ర పూలు కలిపిన నీళ్ళతో మూడు పర్యాయములు )
౩. తర్వాత సూర్య ధ్యానం ఈ శ్లోకము చెప్పి మనసులో సూర్యునికి నమస్కరించండి . || ధ్యేయస్సదా సవితృ మండల మధ్య వర్తి | నారాయణ సరసిజాసన సన్నివిష్టః | కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ | హరీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః | ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నం తు మహేశ్వరః | అస్తమానే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరః || సమాప్తం రోజూ సంధ్య వేళలలో ఈ స్తోత్రము చదువుకోండి సర్వ శుభములూ పొందండి . ఏక వింశతి సూర్య నామాని ( హోమాదులలో ఉపయోగించవచ్చును. సంధ్యా కాలం లో పఠించిన , సర్వ పాప ముక్తులు అగుదురు ) || వికర్తనో వివస్వాం చ మార్తాండో భాస్కరో రవిః | లోక ప్రకాశకః శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వరః | లోక సాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తిమిస్రహా | తపనస్తాపనశ్చైవ శుచిస్సప్తాశ్వ వాహనః | గభస్తి హస్తో బ్రహ్మా చ సర్వ దేవ నమస్కృతః | ఏక వింశతిరిత్యేష స్తవ ఇష్టస్సదా మమ | శరీరారోగ్యదశ్చైవ ధన వృద్ధి యశస్కరః | స్తవ రాజ ఇతి ఖ్యాతస్త్రిషు లోకేషు విశ్రుతః || సూర్యస్తవము ( బ్రహ్మ ఉపదేశించినది-- భవిష్య పురాణము ) * నమస్సూర్యాయ నిత్యాయ రవయే కార్య భానవే | భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే | ఆదిత్యాయాది దేవాయ నమస్తే రశ్మి మాలినే | దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ | * ప్రభాకరాయ మిత్రాయ నమస్తేఽదితి సంభవ | నమో గోపతయే నిత్యం దిశాం చ పతయే నమః | నమో ధాత్రే విధాత్రే చ అర్యమ్ణే వరుణాయ చ | పూష్ణే ఖగాయ మిత్రాయ పర్జన్యాయాంశవే నమః | * నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ | హరయే హరితాశ్వాయ విశ్వస్య పతయే నమః | విష్ణవే బ్రహ్మణే నిత్యం త్ర్యంబకాయ తథాత్మనే | నమస్తే సప్త లోకేశ నమస్తే సప్త సప్తయే | *ఏకస్మైహి నమస్తుభ్యమేక చక్ర రథాయ చ | జ్యోతిషాం పతయే నిత్యం సర్వ ప్రాణ భృతే నమః | హితాయ సర్వ భూతానాం శివాయార్తి హరాయ చ | నమః పద్మ ప్రబోధాయ నమో వేదాది మూర్తయే | * కాదిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయ చ | భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః | ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్య దా | నమోఽస్త్వధితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశః| ( సర్వాభీష్ట సిధ్ధి కి ప్రాతః సాయంకాలాలు పఠించ వలెను ) ---------- తరువాత కానీ , అర్ఘ్యమునకు ముందేకానీ తల్లిదండ్రులకు నమస్కరించండి . మాతా పితర వందనము మాతృ నమస్కారం || యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః | నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం | కృఛ్చ్రేణ మహతా దేవ్యా ధారితోహం యథోధరే | త్వత్ప్రసాదాజ్జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే | పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః | వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే || పితృ నమస్కారం || స్వర్గాపవర్గ ప్రదమేక మాంద్యం బ్రహ్మ స్వరూపం పితరం నమామి యతో జగత్పశ్యతి చారు రూపం తం తర్పయామస్సలిలైస్తిలైర్యుతైః || సమస్త సన్మంగళాని భవంతు!!

No comments:

Post a Comment