శంకర భగవత్పాదులు

సుమారు పన్నెండొందల సంవత్సరాల కిందట దక్షణ భారతీయుల పుణ్యఫలంగా కేరళలోని కాలడి సమీపాన పూర్ణానదీ తీరంలో శంకరులుగా అవతరించారు శంకర భగవత్పాదులు. అందుకే ఆయన ఆదిశంకరులు అయ్యారు. ఆయన తన ఎనిమిదో ఏటనే చతుర్వేదాలను ఔపోసన పట్టారు. తాను భౌతికంగా ఉన్న 32 ఏళ్ళలో 12 ఏళ్ళపాటు సమస్త వైదిక విద్యలు అధ్యయనం చేశారు. పదహారేళ్ళకే శంకర భాష్యాలు (ప్రస్తాన త్రయం) వ్రాశారు. మిగిలిన పదహారేళ్ళకే దేశమంగా విజయ యాత్ర చేశారు. 'అద్వైతం' అనే వేదం ధర్మాన్ని స్థాపించారు. నలుగురు శిష్యులను తయారుచేశారు. ఆ నలుగురు శిష్యులతో ప్రపంచ యాత్ర చేస్తూ శంకరుల వారు శృంగేరిలోని తుంగానదీ తీరంలోకి వచ్చారు. అక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన చూశారు. ఒక కప్పు ప్రసవిస్తోంటే దానికి పాము తన పాడగా నీడ పడుతోంది. సహజవైరం కలిగిన జంతువులే అలా మిత్రబంధంతో ఉండే స్థల మహాత్మ్యాన్ని గుర్తించారు. అందుకే మొదటి పీఠాన్ని ఇక్కడే స్థాపించాలని సంకల్పించారు. తన శిష్యపరంపరలో మొదటి పీఠాధిపతిగా సురేశ్వరాచార్యులవారిని నియమించారు. సాక్షాత్తూ సరస్వతీ దేవిని శారదాదేవిగా ప్రతిష్టింపజేశారు.
ఆ పరంపరలో ప్రస్తుతం శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు 36వ పీఠాధిపతి. ఆయనే ఇప్పుడు ఉత్తర పీఠాధిపతిగా వెంకటేశ్వర ప్రసాద శర్మను ప్రకటించారు. శర్మ తండ్రి శివసుబ్రహ్మణ్య అవధాని.
వేదాధ్యయనం కోసం స్కూలు మాన్పించారు.
కుప్పా వెంకటేశ్వర ప్రసాద శర్మ తమ తల్లిదండ్రులకు మూడో సంతానం. ఎల్ కేజీ నుంచి రెండో తరగతి వరకు సికింద్రాబాద్ సైనిక్ పురిలోని భవాన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయలో చదివారు. తర్వాత తండ్రి అతడిని స్కూల్ మాన్పించి తాతగారు కుప్పా రామగోపాల వాజపేయయాజి దగ్గర కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేయించారు. అలా శర్మకు తాతగారే తొలిగురువు. తొమ్మిదేళ్ళలో శర్మ కృష్ణ యజుర్వేదం పూర్తి చేశారు. అనంతరం శృంగేరిలో చేరారు. అక్కడ ఐదేళ్ళపాటు సంస్కృత సాహిత్యం, తర్కశాస్త్రం అభ్యసించారు. శర్మ ప్రస్తుతం వేదాంత శాస్త్రం చదువుతున్నారు.
పండిత వంశం:
శర్మ తండ్రి ప్రస్తుతం శ్రీవెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అంతకుముందు తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ గా ఉన్నారు. దానికి ముందు కీసరగుట్ట వేద పాఠశాల ప్రిన్సిపాల్ గా పద్దెనిమిదేళ్ళ పాటు సేవలందించారు. కీసరగుట్టకు బదిలీ కావడానికి కొద్ది రోజుల ముందే తిరుపతిలో శర్మ పుట్టారు. (అప్పటికి ఆయన తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వేదం పారాయణదారుగా ఉన్నారు).శ్రీగోవిండా రాజస్వామి జన్మనక్షత్రమైన ఉత్తరా నక్షత్రంలో పుట్టడం, అదీ శనివారం కావడంతో తనయుడికి ఆ స్వామివారి పేరే పెట్టుకున్నారు. శివ సుబ్రహ్మణ్య అవధాని. శర్మ పుట్టకముందు ఆయా తిరుమల ఆలయంలో వేదపారాయణదారుగా ఉండేవారు.
పీఠంలో ప్రాంతీయ భేదం ఉండదు:
శృంగేరీ పీఠం వైదిక విద్యాపీఠం. వైదిక విద్యలన్నీ సంస్కృత మాధ్యమంగానే ఉంటాయి. అక్కడ తెలుగువాళ్ళు, తమిళులు, కన్నడిగులు అన్న తేడా ఉండడు. అది పూర్తిగా పండితపీఠం.
36వ పీఠాధిపతి అయిన శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి పట్టాభిషిక్తులై 25సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా పట్టాభిషేక రజతోత్సవాలు ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించారు. దేశం నలుమూల నుంచి శిష్యగణం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఆ రజతోత్సవానికి శర్మ తల్లిదండ్రులు, తాతగారు, అవ్వ (నాయనమ్మ) అంతా కలిసి వెళ్ళారు. నాలుగో తేదీ సాయంత్రం శర్మ తండ్రికి మహాస్వామి వారినుంచి పిలుపు వచ్చింది. కుమారుడితో కలిసి ఆయన స్వామి వారి ఏకాంత మందిరానికి వెళ్ళారు. "అమ్మవారి ఆజ్ఞగా మీ అబ్బాయిని ఉత్తరాధికారిగా నియమిస్తున్నాము...మీకు సమ్మతమేనా" అని జగద్గురువులు అడిగారు. "తమరి ఆజ్ఞ శిరోధార్యం" అంటూ శర్మ తండ్రి తలూపారు. ఆరోజు రాత్రి అందరి సమక్షంలో శర్మ పేరును ఉత్తరాధికారిగా ప్రకటించారు మహాస్వామి. పీఠం ఉత్తరాధికారిగా శర్మను ఈ నెల 22, 23 తేదీలలో వైదిక కార్యక్రమాలతో ప్రకటిస్తారు. జగద్గురువు సమక్షంలో ఉత్తరాధికారిగా వైదిక సంస్కారాలు చేస్తారు.

No comments:

Post a Comment