పుష్య అమావాస్య

 
మకర సంక్రమణ అనంతరం వచ్చే ప్రథమ అమావాస్య 20-01-2015 . దీని విశేషం భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సమగ్ర రేఖపైన రావడం. మిగతా అమావాస్యలందు సూర్య చంద్రులు ఒక రేఖలో వస్తారు
ఖగోళ శాస్త్ర ప్రకారం చంద్రుడు భూమిని చుడుతూ సూర్యుని భూమితో సహా సంచరించడం మనకు తెలిసినదే. సూర్యుడు బుద్ధి, ప్రజ్ఞ, ఆరోగ్యం మనకు ప్రసాదిస్తే, చంద్రుడు మనో కారకుడు. చంద్రుడు మనసుకు సంతోషం ఆహ్లాదం ప్రశాంతత స్వచ్చమైన జ్ఞానం ఇస్తాడు. సూర్యుడు పితృ కారకుడు కూడాను. చంద్రుడు మాత్రు కారకుడు. అందువల్లే సూర్యచంద్ర ఆరాధన ముఖ్యత్వంగా పరిగణింప బడుతున్నది.
ఈ అమావాస్య రోజున చేసే పితృ తర్పణాదులు అధికమైన ఫలము ఇచ్చును. ఉత్తరాయణ ఆరంభములో వచ్చే ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) యెంత విశిష్టమో ఈ అమావాస్యకు కూడా విశిష్టత ఎక్కువ.
మనకు ఆయనములు ఉత్తర దక్షిణగా వుండును. అందులో వచ్చే ప్రథమ అమావాస్య చాలా విశిష్టమైనది. తండ్రి లేని ప్రతి ఒక్కరు రేపు తప్పక పితృ దేవతలకు తర్పణాదులు ఇచ్చి వారి ఆశీస్సులు గైకొని సుఖ సంతోషములతో వర్ధిల్లాలని ఆశిస్తూ

No comments:

Post a comment