మానవులు పాటించవలసిన ధర్మాలు, చేయవలసిన పనులు

ి. వాటిని జనారణ్యానికి తెలిపినది శౌనక మహాముని మరియు ఆ ఋషిపుంగవులు. వ్యాసభగవానుడు రచించిన పద్దెనిమిది పురాణాల పేర్లు ఈ క్రింద శ్లోకంగా కూర్చబడినది.
మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వ చతుష్టయం
అనాప లింగ కూస్కాని
పురాణాని ప్రచక్షత
మద్వయం : " మ" కారంతో రెండు. అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం.
భద్వయం: " భ" కారంతో రెండు. అవి భాగవత పురాణం, భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: " బ్ర" కారంతో మూడు. అవి బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్తన పురాణం, బ్రహ్మాండ పురాణం.
వచతుష్టయం : " వ" కారంతో నాలుగు. అవి వాయుపురాణం, వరాహపురాణం, వామనపురాణం, విష్ణు పురాణం.
అనాపలింగ కూస్కా : "అ" కారంతో అగ్ని పురాణం, " నా" కారంతో నారద పురాణం, " ప" కారంతో పద్మ పురాణం", "లిం" కారంతో లింగపురాణం, " గ" కారంతో గరుడపురాణం, " కూ" కారంతో కూర్మపురాణం. మరియు " స్క" కారంతో స్కాందపురాణం అనేవి మొత్తం పురాణాల పేర్లు.

No comments:

Post a Comment