శ్రీ లక్ష్మీ దేవ్యై నమో నమః!

లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభుత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్దవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

రేపటి రోజున మనకి కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి పై శ్రీ మహాలక్ష్మీ దేవి గా దర్శ్నము ఇస్తుంది.
కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తు , గజరాజు సేవిస్తు ఉండగా, శ్రీమన్మహాలక్ష్మి దర్శనమిస్తుంది. ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల రూపమే మహాలక్ష్మి దేవి!

ఈమే క్షీరాబ్ది పుత్రిక. డోలారుడు అనే రాక్షసుడిని సమ్హరించి దేవత. శక్తి త్రయం లో ఈమే మధ్య శక్తి. ఈ దేవిని ఉపాశన చేస్తే ఫలితాలు సీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

సర్వజగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీ దేవి. ఈ జగత్తు అంతా ఏ శక్తి చేత రక్షింపబడుతున్నదో , ఆ శక్తే "లక్ష్మీ"!!!!!!! లక్ష్యతే మీయతే అనయా ఇతి లక్ష్మి అని అన్నారు ...లక్ష్మణాత్ లక్ష్మి"! ఈ జగత్తులో ప్రతిదానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని అనుసరించే సర్వవిధ ప్రవర్తనలు సంభవమవుతాయి. అలా జగత్తుకి హేతభూతమైన లక్ష్మణ శక్తి లక్ష్మీ.

భగవద్గీత లో కృష్ణ పరమాత్మ ' ఇవి నా విభుతులూ అని విభుతి యోగం లో చెప్పినవన్ని లక్ష్మీ స్వరూపలే.
ఎవరైనా సరే ముందుగా లక్ష్మీ కటాక్షాన్నే కోరుకుంటారు. అయితే తన బిడ్డల సంగతి తెల్సు కనుక , విద్యాగంధం లేని వాడు అఙ్ఞవశాన ధనాన్ని చెడుపనులకు ఉపయోగించి, పాపాలను మూటకట్టుకుంటాడు అనే ఉద్దేశంతో మొదట అతనికి సరస్వతి ప్రసన్నతను అనుగ్రహించి, ఆ తరువాత ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించగలిగే వివేకాన్ని ఇస్తుంది. అందుకే ఆ తల్లిని ఐశ్వర్య ప్రదాయిని అని అన్నారు!

సూర్య, చంద్ర , అగ్ని, వాయువు, భూమి మొదలు అయినవి అన్నీ ఐశ్వర్యాలే ...ఈ ఐశ్వర్యాలకు కారణమైన పర బ్రహ్మ శక్తి , ఐశ్వర్య రూపిణి లక్ష్మి దేవి!

త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా
త్వయైత ద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం

ఓ లక్ష్మి! ఆన్ని లోకాలకు తల్లివి నీవు. దేవదేవుడు అయిన విష్ణువే తండ్రి. నీ చేత, విష్ణువు చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడింది అని ఇండ్రుడు లక్ష్మీ దేవిని స్తుతించాడు.అందుకే జగదంబతత్వాన్ని గ్రహించి, హృదయం నిండుగా భావన చేస్తే, అమంగళాలకు చోటు ఉండదు. డబ్బుకు లోటు ఉండదు. చిత్తం సుద్ధమవుతుంది. సమస్త దరిద్రాలు ధ్వంసమవుతాయి...

'శ్' అంటే పరాశక్తి.....' ఈ' అంటే పరమేశ్వరుడు, 'ఋ అంటే అగ్ని బీజం. అగ్ని ఐశ్వర్యకారకుడు.పరమేశ్వర సహితమూయిన ఐశ్వర్య ప్రదాయిని లక్ష్మి అని "శ్రీ" కి నిర్వచనం.. అందుకే ఆ తల్లి తత్వాన్ని గ్రహించి అందుకు తగినట్లుగా మసులుకుంటే, ఏ సమస్యలు దరికి రావు.

శుభ్రమైన ఇంట్లో, పంటపొలాల్లో, గోపురాళ్లో, తామరపువ్వుల్లో, రత్నాలలో, అద్దం మొదలైనవాటిలల్లో లక్ష్మీ కొలవు అయ్యి ఉంటుంది.

ఆవనెయ్య తో గాని, సువర్ణ జలం తో కాని లక్ష్మీ దేవికి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది!
యా దేవి సర్వ భూతేషి లక్ష్మి రూపేణ సంస్తితా అంటే అన్నీ జీవులలోను ఉండే లక్ష్మి స్వరూపము దుర్గా దేవి అని చండిసప్త సతి చెప్తోంది!

కాబట్టి శరన్నవరాత్రులలో శ్రీ మహా లక్ష్మి జి పూజిస్తే సర్వమాంగళ్యాలు కలుగుతాయి.

ఈ రోజున అమ్మవారికి పూర్ణాలు నివేదన చెయ్యాలి.

తెల్లని, ఎరుపు రంగు పువ్వులతో పూజించి, లక్ష్మి అష్టొత్తరం పఠించాలి.

శ్రీ లక్ష్మీ దేవ్యై నమో నమః!

No comments:

Post a Comment