మందపల్లి మందుడు

హిందూ సంస్కృతీ, సంప్రదాయాలలో శనిగ్రహానికి విశిష్టమైన ప్రాధాన్యత వుంది. కాలమానప్రకారం చంద్రడు పక్షంలోని పదమూడవ రోజును త్రయోదశి అని అంటారు. ఇది సంవత్సరంలో పన్నెండుసార్లు వస్తుంది. ఇందులో కొన్నింటికి హిందూ ధర్మంలో ప్రత్యేక విశిష్టత వుంది.

శనికి త్రయోదశి అంటే చాలా ఇష్టం. అందుకే శనివారంనాడే శనిగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. ఏ త్రయోదశి అయితే శనివారంరోజు సంభవిస్తుందో.. ఆరోజున శని విగ్రహాన్ని ‘‘శనీశ్వరుడి’’గా పిలుచుకుంటారు. ఇటువంటి సమయంలో శని మానవులు కోరుకున్న యోగాలను అందించి, మూడు దోషాలను దూరం చేస్తాడని ప్రజలు విశ్వసిస్తారు.

మొత్తం నవగ్రహాలకు ఈ శనీశ్వరుడు అధిపతి. పురాణాలప్రకారం త్రయోదశినాడు శనైశ్చరుని భక్తితో ఆరాధించిన వారికి ఎటువంటి అవాంతరాలు కలగకుండా.. వారికి శుభం జరుగుతుందని తెలిపి వుంది.

భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 24 గంటలు పడుతుంది. అదే శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఏకంగా 30 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకే శనిగ్రమాన్ని ‘‘మందుడు’’ అని మహర్షులు పేరు పెట్టారు. అంతేకాదు... శనిగ్రహుడు జీవరాసులను సత్యమార్గంలో నడిపించడానికి అవతరించాడని కూడా వారు పేర్కొంటున్నారు.
సాధారణంగా చాలామంది శని పేరు వినగానే అందరూ భయపడిపోతారు. ఆందోళనలకు గురి అవుతుంటారు. అయితే ఆయన్ని భక్తితో శ్రద్ధగా కొలిస్తే.. సకలఐశ్వర్యాలతోపాటు శుభాలను ప్రసాదిస్తాడని నమ్ముతారు.
శనివారం - త్రియోదశినాడు నల్లటి దుస్తులు ధరించి, శనిస్వామికి నువ్వులనూనెతో అభిషేకం చేయిస్తే సంతోషిస్తాడని భక్తులు నమ్ముతుంటారు.

మందపల్లి మందుడు :
తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట మండలంలో మందపల్లి అనే గ్రామం వుంది. ఈ గ్రామంలోనే ప్రాచీనమైన శనీశ్వరాలయం వుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే ధండిచి మహర్షి ఆలయం కూడా వుంది. పురాణాల ప్రకారం.. ధండిచి మహర్షి అసురులను చంపడానికి ఇంద్రుడికి తన వెన్నుముకను దానంగా ఇచ్చాడు.
మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు.
పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారట. వారి ఆవేదనలను విన్న శనీశ్వరుడు ఆ రాక్షసులను హతమార్చాడు.

అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది. అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.

Photo: హిందూ సంస్కృతీ, సంప్రదాయాలలో శనిగ్రహానికి విశిష్టమైన ప్రాధాన్యత వుంది. కాలమానప్రకారం చంద్రడు పక్షంలోని పదమూడవ రోజును త్రయోదశి అని అంటారు. ఇది సంవత్సరంలో పన్నెండుసార్లు వస్తుంది. ఇందులో కొన్నింటికి హిందూ ధర్మంలో ప్రత్యేక విశిష్టత వుంది. 

శనికి త్రయోదశి అంటే చాలా ఇష్టం. అందుకే శనివారంనాడే శనిగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. ఏ త్రయోదశి అయితే శనివారంరోజు సంభవిస్తుందో.. ఆరోజున శని విగ్రహాన్ని ‘‘శనీశ్వరుడి’’గా పిలుచుకుంటారు. ఇటువంటి సమయంలో శని మానవులు కోరుకున్న యోగాలను అందించి, మూడు దోషాలను దూరం చేస్తాడని ప్రజలు విశ్వసిస్తారు. 

మొత్తం నవగ్రహాలకు ఈ శనీశ్వరుడు అధిపతి. పురాణాలప్రకారం త్రయోదశినాడు శనైశ్చరుని భక్తితో ఆరాధించిన వారికి ఎటువంటి అవాంతరాలు కలగకుండా.. వారికి శుభం జరుగుతుందని తెలిపి వుంది. 

భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 24 గంటలు పడుతుంది. అదే శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఏకంగా 30 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకే శనిగ్రమాన్ని ‘‘మందుడు’’ అని మహర్షులు పేరు పెట్టారు. అంతేకాదు... శనిగ్రహుడు జీవరాసులను సత్యమార్గంలో నడిపించడానికి అవతరించాడని కూడా వారు పేర్కొంటున్నారు. 
సాధారణంగా చాలామంది శని పేరు వినగానే అందరూ భయపడిపోతారు. ఆందోళనలకు గురి అవుతుంటారు. అయితే ఆయన్ని భక్తితో శ్రద్ధగా కొలిస్తే.. సకలఐశ్వర్యాలతోపాటు శుభాలను ప్రసాదిస్తాడని నమ్ముతారు. 
శనివారం - త్రియోదశినాడు నల్లటి దుస్తులు ధరించి, శనిస్వామికి నువ్వులనూనెతో అభిషేకం చేయిస్తే సంతోషిస్తాడని భక్తులు నమ్ముతుంటారు. 
 
మందపల్లి మందుడు :
తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట మండలంలో మందపల్లి అనే గ్రామం వుంది. ఈ గ్రామంలోనే ప్రాచీనమైన శనీశ్వరాలయం వుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే ధండిచి మహర్షి ఆలయం కూడా వుంది. పురాణాల ప్రకారం.. ధండిచి మహర్షి అసురులను చంపడానికి ఇంద్రుడికి తన వెన్నుముకను దానంగా ఇచ్చాడు.  
మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు.
పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారట. వారి ఆవేదనలను విన్న శనీశ్వరుడు ఆ రాక్షసులను హతమార్చాడు.

 అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది. అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.

No comments:

Post a comment