ఆవుపేడలో లక్ష్మీదేవి ఉంటుందంటారు. దానికి కారణం ఏమిటి?

ఒకసారి లక్ష్మీదేవి గోవులమందలోనికి వెళ్ళి వాటి మధ్య ఉండటానికి అభిలషించింది. కానీ, లక్ష్మి చంచల స్వభావురాలు కాన అవి ఆమె కోర్కెను మన్నించలేదు. ఆవులు తిరస్కరిస్తే లోకం గౌరవించదని పలికి లక్ష్మి గోవులను ప్రార్థించింది. గోవులు తమ మలమూత్రాలు పరమ పవిత్రమైనవని వేదం పేర్కొన్నది కాబట్టి వాటిలో వసించుమని అనుమతించాయి. లక్ష్మి దానికి ఆమోదించి వాటియందు వసించింది. అందువలన వాటి మహిమ పెరిగింది. మరొకసారి బ్రహ్మ కామధేనువు చేసే తపస్సుకు మెచ్చి గోలోకాన్ని వరంగా ప్రసాదించాడు. ఆ విధంగా బ్రహ్మలోకంకంటే గోలోకం ఉన్నతంగా నిలిచింది. గోమహాత్మ్యం తెలిపే కథలు విన్నవారికి ఆయువు, సంపద, అధికారం, కీర్తి, సద్గతి కలుగుతాయి.
చిత్రం: ఆవుపేడలో లక్ష్మీదేవి ఉంటుందంటారు. దానికి కారణం ఏమిటి?
ఒకసారి లక్ష్మీదేవి గోవులమందలోనికి వెళ్ళి వాటి మధ్య ఉండటానికి అభిలషించింది. కానీ, లక్ష్మి చంచల స్వభావురాలు కాన అవి ఆమె కోర్కెను మన్నించలేదు. ఆవులు తిరస్కరిస్తే లోకం గౌరవించదని పలికి లక్ష్మి గోవులను ప్రార్థించింది. గోవులు తమ మలమూత్రాలు పరమ పవిత్రమైనవని వేదం పేర్కొన్నది కాబట్టి వాటిలో వసించుమని అనుమతించాయి. లక్ష్మి దానికి ఆమోదించి వాటియందు వసించింది. అందువలన వాటి మహిమ పెరిగింది. మరొకసారి బ్రహ్మ కామధేనువు చేసే తపస్సుకు మెచ్చి గోలోకాన్ని వరంగా ప్రసాదించాడు. ఆ విధంగా బ్రహ్మలోకంకంటే గోలోకం ఉన్నతంగా నిలిచింది. గోమహాత్మ్యం తెలిపే కథలు విన్నవారికి ఆయువు, సంపద, అధికారం, కీర్తి, సద్గతి కలుగుతాయి.

No comments:

Post a Comment