పుణ్య క్షేత్రాలకి వెళితే పుణ్యం వస్తుందా

పుణ్యం సంపాదించుకుందాం అనే లక్ష్యంతో పుణ్య క్షేత్రాలకి వెళితే పుణ్యం రావడం కొంచెం సందేహాస్పదమే అని చెప్పుకోవాలి. పుణ్యం సంపాదించుకోవడం కోసం పుణ్యవంతమైన పనులను మనం ఆచరించాలి. అవి ఇష్టాపూర్త కర్మలు, దాన కర్మలు, జప కర్మలు, ఇటువంటి వాటిని అన్నింటినీ సంప్రదాయం సూచించింది. ఇష్టి అంటే యజ్ఞయాగాది హోమములు, పూర్త కర్మలు అంటే చెరువులు త్రవ్వించడం, దేవాలయాలు కట్టించడం, బడి నిర్మించడం, ఆసుపత్రి ఇలాంటివన్నీ కూడా పూర్త కర్మలు అని చెప్పబడ్డాయి. పరిహార క్రియలు సూచించి దానధర్మాలు చేయడం ద్వారా ఎదుటివారికి ఏ వస్తువు అవసరం ఉందో ఆ వస్తువులను వారికి అందించే కర్మను ఆచరించడం ద్వారా పుణ్యం సముపార్జించుకొనవచ్చును. ఉపవాసాదులు చేయడం, జపాలు చేయడం, ఇంకా నిష్ఠలు, సాధనలు ఆచరించడం వీటన్నింటి ద్వారా పుణ్యం సముపార్జించుకొనవచ్చును. తీర్థ క్షేత్రాలకు వెళితే యోగులు, మహానుభావులు, ఋషులు అనేకులు తమ తపశ్శక్తిని ధారపోసి ఆప్రాంతమంతా శక్తివంతం చేసి ఉంటారు కాబట్టి అర్చామూర్తి కూడా విశేష జపతపాదులతో, అభిషేకాలతో శక్తివంతమై ఉంటాడు కాబట్టి దర్శించడం ద్వారా మరికొంత పుణ్యం సముపార్జించుకొనవచ్చును. అయితే పూర్తిగా నిష్కామంతో నేను స్వామి దర్శనం కోసం వెళుతున్నాను, దానధర్మాలు చేస్తున్నాను, స్నానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను - ఇటువంటి భావాలతో దర్శిస్తే తప్పకుండా పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రగా కాకుండా విహారయాత్రగా మలచుకుంటే మటుకు ఉన్నపుణ్యం కూడా కరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. పుణ్యం సముపార్జించుకోవాలి అంటే మటుకు సంప్రదాయం చూపించిన మార్గాలు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం, నియమబద్ధమైన జీవితం గడపడం, దాన క్రియలు ఆచరించడం, ఇలాంటివన్నీ చేస్తే తప్పకుండా మేలు కలుగుతుంది. పుణ్యం కలుగుతుంది, పుణ్యం అంటే ఆనందంగా జీవించడం. మంచి పనుల ద్వారా పుణ్యం సంపాదించుకుందాం. పుణ్య క్షేత్రానికి వెళితే పుణ్యం వస్తుంది కానీ అటువంటి నియమాలతో వెళ్ళాలి. విహారయాత్రగా భావించకూడదు.

Photo: పుణ్యం సంపాదించుకుందాం అనే లక్ష్యంతో పుణ్య క్షేత్రాలకి వెళితే పుణ్యం రావడం కొంచెం సందేహాస్పదమే అని చెప్పుకోవాలి. పుణ్యం సంపాదించుకోవడం కోసం పుణ్యవంతమైన పనులను మనం ఆచరించాలి. అవి ఇష్టాపూర్త కర్మలు, దాన కర్మలు, జప కర్మలు, ఇటువంటి వాటిని అన్నింటినీ సంప్రదాయం సూచించింది. ఇష్టి అంటే యజ్ఞయాగాది హోమములు, పూర్త కర్మలు అంటే చెరువులు త్రవ్వించడం, దేవాలయాలు కట్టించడం, బడి నిర్మించడం,  ఆసుపత్రి ఇలాంటివన్నీ కూడా పూర్త కర్మలు అని చెప్పబడ్డాయి. పరిహార క్రియలు సూచించి దానధర్మాలు చేయడం ద్వారా ఎదుటివారికి ఏ వస్తువు అవసరం ఉందో ఆ వస్తువులను వారికి అందించే కర్మను ఆచరించడం ద్వారా పుణ్యం సముపార్జించుకొనవచ్చును. ఉపవాసాదులు చేయడం, జపాలు చేయడం, ఇంకా నిష్ఠలు,  సాధనలు ఆచరించడం వీటన్నింటి ద్వారా పుణ్యం సముపార్జించుకొనవచ్చును. తీర్థ క్షేత్రాలకు వెళితే యోగులు, మహానుభావులు, ఋషులు అనేకులు తమ తపశ్శక్తిని ధారపోసి ఆప్రాంతమంతా శక్తివంతం చేసి ఉంటారు కాబట్టి అర్చామూర్తి కూడా విశేష జపతపాదులతో, అభిషేకాలతో శక్తివంతమై ఉంటాడు కాబట్టి దర్శించడం ద్వారా మరికొంత పుణ్యం సముపార్జించుకొనవచ్చును. అయితే పూర్తిగా నిష్కామంతో నేను స్వామి దర్శనం కోసం వెళుతున్నాను, దానధర్మాలు చేస్తున్నాను, స్నానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను - ఇటువంటి భావాలతో దర్శిస్తే తప్పకుండా పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రగా కాకుండా విహారయాత్రగా మలచుకుంటే మటుకు ఉన్నపుణ్యం కూడా కరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. పుణ్యం సముపార్జించుకోవాలి అంటే మటుకు సంప్రదాయం చూపించిన మార్గాలు యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం, నియమబద్ధమైన జీవితం గడపడం, దాన క్రియలు ఆచరించడం, ఇలాంటివన్నీ చేస్తే తప్పకుండా మేలు కలుగుతుంది. పుణ్యం కలుగుతుంది, పుణ్యం అంటే ఆనందంగా జీవించడం. మంచి పనుల ద్వారా పుణ్యం సంపాదించుకుందాం. పుణ్య క్షేత్రానికి వెళితే పుణ్యం వస్తుంది కానీ అటువంటి నియమాలతో వెళ్ళాలి. విహారయాత్రగా భావించకూడదు.

No comments:

Post a Comment