అందరికీ ధ్యానయోగ్యమైన మూర్తులు

అత్యంత శ్రేయదాయకమైనది దక్షిణామూర్తి స్వరూపం . కృష్ణ బగవానుడు గొప్పగా ధ్యానానికి యోగ్యమైన మూర్తి, కానీ గృహస్తు దానిని ధ్యానం చేస్తే కాళ్ళ దగ్గర ఆవు దూడ ఉన్నటువంటి మూర్తినే ధ్యానం చెయ్యాలి అనే ఒక నియమాన్ని పెద్దలు చెప్తారు . దక్షిణామూర్తి అనుకోండి విధ్యార్ది ధ్యానం చేస్తే అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ,తేజస్సు ,ఆరోగ్యం కలుగుతాయి . గృహస్తు ధ్యానం చేస్తే సమస్తమైన ఐశ్వర్యం కలుగుతుంది ,ధర్మము నందు అనురక్తి కలుగుతుంది వానప్రస్తుకి వైరాగ్యం బాగా పెరుగుతుంది . సన్యాసి కి ధ్యానం నిలబడుతుంది . ఎవరికి ఏది కావాలో దానిని అది అనుగ్రహిస్తుంది . అందరికి ఒకలా కాదు . ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వగలదు పైగా పరమ మంగళ మూర్తి , దక్షిణామూర్తి ని చూడడమే ఎంతో ఆనందముగా ఉంటుంది అసలు ఆ వీరాసనములో కూర్చుని ఒక కాలు క్రింద పెట్టి ఆ కాలు కింద ఉన్నటువంటి మాయ రాక్షసులు కూడా తలెత్తి నవ్వుతుంటాడు ఆ రెండవ కాలు తీసుకువచ్చి కింద పెట్టినటువంటి కాలు యొక్క తొడ మీద వేసుకుని నాలుగు చేతులతో ఉంటాడు చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ పెద్దా వట వృక్షం కింద కూర్చుని ఉంటాడు ఆ ధ్యానం చేసేటప్పుడు చాలా తేలికగా మీరు ఆయన దగ్గరికి వెళ్లినట్టు మీరు మోకాళ్ళ మీద వంగినట్టు మీ తల తీసుకునివెళ్ళి కింద పెట్టినటువంటి పాదం మీద మోపినట్టు ఆయన బొటన వ్రేలు దాని ప్రక్కన పాదము యొక్క తలము మెత్తగా మీ తలకి తగిలినట్టు మీరు లేచి ఆయన పాదం పట్టుకున్నట్టు ,ఆయన పాదాన్ని నిమిరినట్టు ,ఆయన కాలు వొత్తుతున్నట్టు ,మీరు నీరాజనం ఇచ్చినపుడు ఆ చేతులు ,ఆ చేతులో ఉండేటటువంటి ఆయుధములు ,కిరీటము, ఆయన తొడ మీద వేసుకున్నటువంటి ఎర్రటి పాదం దాని యొక్క వేళ్ళు ,గోళ్ళు అన్ని కనపడుతుండగా మీరు ఆయనికి నీరాజనం ఇస్తూ ఒకసారి దర్శనం చేయొచ్చు ,మీరు ధ్యానములో ఆయన్ని చూస్తూ దగ్గరగా కూర్చుని చూస్తుంటే మనసు రంజిల్లిపోయి చాలా తేలికగా ఆయన అందు లయమై ఉంటుంది . ప్రత్యేకించి అది జ్ఞానకారకము ,మంగళ కరము శివ స్వరూపము . అన్నిటిని మించి దక్షిణామూర్తి దగ్గర ఉన్న గొప్పతనము ఏమిటి అంటే అసలు దక్షిణామూర్తి దగ్గర్నుంచి ఇది మాత్రమే వస్తుంది అని చెప్పడానికి అవది లేదు . ఏదైనా ఇవ్వగలరు . అన్ని ఇవ్వగలిగినటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకుని పిల్లలు దగ్గర నుంచి పెద్దలు వరకు అందరు కొంత సేపు ఆయన్ని ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అసలు గురుమండలములో ప్రదానమైనటువంటి గురువుకి కూడా నమస్కారం చేసినటువంటి అనుగ్రహం లబిస్తుంది ఎందుకంటే ఆయన గురుస్వరూపం .
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
ముదితవదనం చిరునవ్వుతో వుంటాడు , మనసుకు ఒక లక్షణము ఉంటుంది అది విసుగు చెందుతుంది . మీరు రోజు ఒక లాగే చూపించరనుకొడి , రోజు కింద పెట్టిన పాదం చూపిస్తే నిన్న ఇదే చేశా కదా మల్లి ఎటో వెళ్తుంది, కాదు మీరు ఈరోజు పాదం జ్ఞానం చేస్తే రేపు చిన్ముద్ర ధ్యానం చేయొచ్చు .

No comments:

Post a comment