మాఘపురాణం - 23వ అధ్యాయము

“నీవు పిశాచివి కమ్మని” శపించగా ఆ విద్యార్దియూ “మీరుకూడా పిశాచులగుదురు గాక”యని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి. కొంత కాలమునకు ఒక సిద్ధుడాకోనేటి దగ్గరకు రాగా నా పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచరూపం తొలగి పోవును” అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురకూ యధారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.

No comments:

Post a Comment