నైవేద్యము

నివేదనము అన్నమాట పర్యాయపదమే నైవేద్యము. సాధారణంగా నైవేద్యం అనేది చేయకుండా ఉండము. పంచోపచారములు ఇంట్లో తప్పకుండా జరగాలి. గంధపుష్పధూపదీప నైవేద్యములు. ఈ అయిదు జరగకపోతే అది కృతఘ్నతతో కూడిన గృహంగా గుర్తిస్తారు. గంధం ఈశ్వరుడికి అలంకరించాలి. పువ్వు వేయాలి లేకపోతే అక్షతలైనా వేయాలి. ధూపం (అగరుబత్తి)వేయాలి. దీపం పెట్టాలి. నైవేద్యం పెట్టాలి. ఆయనే మనల్ని నిలబెడుతున్నాడన్న సాత్వికమైన బుద్ధితో పూజ చేయాలి. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. మన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు. సత్త్వగుణంతో చేస్తున్నారు కాబట్టి సాత్త్విక పదార్థాలు నైవేద్యం చేస్తారు. మధురపదార్థములు, పండ్లు వంటివి నైవేద్యం పెడతారు. నివేదన అను మాట కేవలం పూజలో ఒక భాగముగా మాత్రమే కాదు. అది జీవితమే నివేదనగా మారిపోవాలి. ఎలా? ఒక విగ్రహం దగ్గర కూర్చున్నామన్న భావనకాదు. భగవంతుడు విగ్రహంగా ఉన్నాడని గుర్తించాలి. వాడు పిల్లవాడు కాదు. నా మనవడు పిల్లవాడిగా ఉన్నాడు. ఈ పిల్లవాడు నా మనవడు. అప్పుడు కదూ ప్రేమ. విగ్రహం కాదు పరమేశ్వరుడు ఆ రూపంలో అక్కడ కూర్చున్నాడు. నివేదన అంటే నా కష్టం, నా సుఖం, నాభావాలు అన్నీ కూడా ఆయనతో చెప్పుకోవాలి. అందుకే నివేదన రెండు క్రింద వెళ్ళిపోతుంది జీవితంలో ౧. నాకు తోడ్పడమని అడుగుతూంటాడు. ఈశ్వరా! నేను సాత్వికంగా ప్రవర్తించాలనుకుంటున్నాను. భక్తితో ఉండాలని ఉంది. ఎప్పుడూ ఎవరి జోలికీ వెళ్ళకూడదు. గురువుగారు చెప్పిన మాటలు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని కోరిక ఉంది. కానీ మనసు అటూ ఇటూ లాగేస్తోంది. స్వార్థంవైపుకి లాగేస్తోంది. కాబట్టి నా మనస్సు నిలకడగా నిలబడేటట్లు ధార్మికంగా బ్రతికేటట్లు నన్ను అనుగ్రహించండి. తన కష్టసుఖాలు ఇలా ఈశ్వరుడితో చెప్పుకోవడం నివేదన. అలా చెప్పుకోవడం వచ్చిందనుకోండి అనుబంధం ఒకటి యేర్పడుతుంది మీకు."భావనామాత్ర సంతుష్టాయై నమోనమః". లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి మా ఇంట్లో ఉన్నారు. పరీక్షల ముందు ఈశ్వరుడు, ర్యాంకు వచ్చినప్పుడు బావమరిది..ఏమి భక్తి? నివేదన అనగా ఆయన ముందు గుర్తు వచ్చుట. కష్టమునందు, సుఖమునందూ కూడా. అన్నీ ఆయనతో పంచుకోవడం అలవాటైపోయింది. అప్పుడు భక్తి పూజగదికి పరిమితం కాదు. విశ్వవ్యాప్తం అయింది. అంతటా భగవంతుడు ఉన్నాడు. ఒకవేళ అనుకున్న పని జరుగకపోయినా బెంగపెట్టుకోడు. ఈశ్వరా ఎందుకలా చేశావో? అది జరిగితే ఏదో ప్రమాదం ఉండేదన్నమాట. జరగకుండా చేశావు ధన్యుడిని. ఒక ఉదాహరణ చెప్తాను. తెలిసిన వారందరూ ఒక పెళ్ళికి వెళ్ళారు. ఒకాయనమాత్రం ఏమండీ నాకు చాలా తెలుసున్నాయన. కానీ పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను. పొద్దున్నే వెళ్ళి యేదో అభినందించేసి వచ్చాను. ఏం చేస్తాను? అకస్మాత్ ప్రయాణం వచ్చింది. అని బెంగపెట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరూ భోజనం చేశారు. ఎలా జరిగిందో ఆహారంలో విషం కలిసింది. అందరినీ హాస్పిటలైజ్ చేసేశారు కన్యాదాతలు, మగ పెళ్ళివారితో కలిపి. ఈయన రైలెక్కిపోయాడు కాబట్టి బ్రతికిపోయాడు. ఆ అన్నం తినకముందు బాధపడ్డాడు పెళ్ళికి ఉండడం లేదు అని. ఈ విషయం ఫోన్లో విని ఈశ్వరుడు ఎంతటి అదృష్టమిచ్చాడండీ నాకు. ఇది అప్పుడే జరిగి ఉంటే అక్కడే పడిపోయి ఉంటే ఎంత ముఖ్యమైన పనిమీద వెళ్ళాలి? ఏమైపోను నా జీవితం అన్నాడు. అది జరగనప్పుడు తెలియలేదు ఎందుకు జరగలేదో. కానీ జరగకుండా ఉన్నది ఎందుకు జరగలేదో తెలిసినప్పుడు మాత్రం నమస్కారం చేస్తావు. అన్ని వేళలా తెలియాలని యేమీ నియమం లేదు. అందుకే "ప్రధమో వైద్యో భిషక్’- ఈశ్వరుడు వైద్యుడు లాంటి వాడు. మనం జబ్బు ఒక్కటే చెప్తాం. డాక్టర్ గారు మందిస్తారు. మాట్లాడకుండా వేసుకోవాలి. కాదని ఎదురు ప్రశ్నిస్తే ఇక్కడినుంచిఫో అంటాడు. భగవంతుడు కూడా అంతే. ఆయనని నమ్ము నువ్వు ఉపద్రవాలలో పడిపోకుండా ఆయన చూసుకుంటాడు. ఒకవేళ ఏదో కష్టం వచ్చింది. వెనక ఏదో ఉంది ఈశ్వరుడి ఆలోచన. యేదో కారణం లేకుండా ఆయన యేదీ చేయడు. కాబట్టి అందులో కూడా నీపట్ల అనుగ్రహం ఉందని ఎప్పుడో బయటికి వస్తుంది. అప్పుడు సంతోషిస్తావు. ొందరపడి ఈశ్వరుని నిందచేయకు. పట్టుకెళ్ళి యాపిల్ పండో, అరటిపండో పెట్టడంతో సరిపోదు. ఎప్పుడూ వాడు నా ప్రక్కనున్నాడు అనుకోవాలి. అందుకే సఖ్యభక్తి అని నవవిధ భక్తులలో ఒక భక్తి. నివేదన కేవలం ఒక పదార్థం పెట్టడం కాదు. జీవితంలో అన్ని విషయములయందు విస్తరించాలి. చిట్టచివరికి జీవితమే నివేదన. జీవితమంతా ఈశ్వరుడితో సమన్వయం. ఈశ్వర ప్రోక్తము, విహితము; ఈశ్వరుడు చెప్పనిది నిషిద్ధము. అదే నివేదన. కాబట్టి నివేదన కేవలం ఒక పదార్థం పెట్టడం కాదు. జీవితమునందు విస్తరించవలసినటువంటి విషయం.
Photo: నివేదనము అన్నమాట పర్యాయపదమే నైవేద్యము. సాధారణంగా నైవేద్యం అనేది చేయకుండా ఉండము. పంచోపచారములు ఇంట్లో తప్పకుండా జరగాలి. గంధపుష్పధూపదీప నైవేద్యములు. ఈ అయిదు జరగకపోతే అది కృతఘ్నతతో కూడిన గృహంగా గుర్తిస్తారు. గంధం ఈశ్వరుడికి అలంకరించాలి. పువ్వు వేయాలి లేకపోతే అక్షతలైనా వేయాలి. ధూపం (అగరుబత్తి)వేయాలి. దీపం పెట్టాలి. నైవేద్యం పెట్టాలి. ఆయనే మనల్ని నిలబెడుతున్నాడన్న సాత్వికమైన బుద్ధితో పూజ చేయాలి. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. మన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు. సత్త్వగుణంతో చేస్తున్నారు కాబట్టి సాత్త్విక పదార్థాలు నైవేద్యం చేస్తారు. మధురపదార్థములు, పండ్లు వంటివి నైవేద్యం పెడతారు. నివేదన అను మాట కేవలం పూజలో ఒక భాగముగా మాత్రమే కాదు. అది జీవితమే నివేదనగా మారిపోవాలి. ఎలా? ఒక విగ్రహం దగ్గర కూర్చున్నామన్న భావనకాదు. భగవంతుడు విగ్రహంగా ఉన్నాడని గుర్తించాలి. వాడు పిల్లవాడు కాదు. నా మనవడు పిల్లవాడిగా ఉన్నాడు. ఈ పిల్లవాడు నా మనవడు. అప్పుడు కదూ ప్రేమ. విగ్రహం కాదు పరమేశ్వరుడు ఆ రూపంలో అక్కడ కూర్చున్నాడు. నివేదన అంటే నా కష్టం, నా సుఖం, నాభావాలు అన్నీ కూడా ఆయనతో చెప్పుకోవాలి. అందుకే నివేదన రెండు క్రింద వెళ్ళిపోతుంది జీవితంలో ౧. నాకు తోడ్పడమని అడుగుతూంటాడు. ఈశ్వరా! నేను సాత్వికంగా ప్రవర్తించాలనుకుంటున్నాను. భక్తితో ఉండాలని ఉంది. ఎప్పుడూ ఎవరి జోలికీ వెళ్ళకూడదు. గురువుగారు చెప్పిన మాటలు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని కోరిక ఉంది. కానీ మనసు అటూ ఇటూ లాగేస్తోంది. స్వార్థంవైపుకి లాగేస్తోంది. కాబట్టి నా మనస్సు నిలకడగా నిలబడేటట్లు ధార్మికంగా బ్రతికేటట్లు నన్ను అనుగ్రహించండి. తన కష్టసుఖాలు ఇలా ఈశ్వరుడితో చెప్పుకోవడం నివేదన. అలా చెప్పుకోవడం వచ్చిందనుకోండి అనుబంధం ఒకటి యేర్పడుతుంది మీకు."భావనామాత్ర సంతుష్టాయై నమోనమః".  లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి మా ఇంట్లో ఉన్నారు. పరీక్షల ముందు ఈశ్వరుడు, ర్యాంకు వచ్చినప్పుడు బావమరిది..ఏమి భక్తి? నివేదన అనగా ఆయన ముందు గుర్తు వచ్చుట. కష్టమునందు, సుఖమునందూ కూడా. అన్నీ ఆయనతో పంచుకోవడం అలవాటైపోయింది. అప్పుడు భక్తి పూజగదికి పరిమితం కాదు. విశ్వవ్యాప్తం అయింది. అంతటా భగవంతుడు ఉన్నాడు. ఒకవేళ అనుకున్న పని జరుగకపోయినా బెంగపెట్టుకోడు. ఈశ్వరా ఎందుకలా చేశావో? అది జరిగితే ఏదో ప్రమాదం ఉండేదన్నమాట. జరగకుండా చేశావు ధన్యుడిని. ఒక ఉదాహరణ చెప్తాను. తెలిసిన వారందరూ ఒక పెళ్ళికి వెళ్ళారు. ఒకాయనమాత్రం ఏమండీ నాకు చాలా తెలుసున్నాయన. కానీ పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను. పొద్దున్నే వెళ్ళి యేదో అభినందించేసి వచ్చాను. ఏం చేస్తాను? అకస్మాత్ ప్రయాణం వచ్చింది. అని బెంగపెట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరూ భోజనం చేశారు. ఎలా జరిగిందో ఆహారంలో విషం కలిసింది. అందరినీ హాస్పిటలైజ్ చేసేశారు కన్యాదాతలు, మగ పెళ్ళివారితో కలిపి. ఈయన రైలెక్కిపోయాడు కాబట్టి బ్రతికిపోయాడు. ఆ అన్నం తినకముందు బాధపడ్డాడు పెళ్ళికి ఉండడం లేదు అని. ఈ విషయం ఫోన్లో విని ఈశ్వరుడు ఎంతటి అదృష్టమిచ్చాడండీ నాకు. ఇది అప్పుడే జరిగి ఉంటే అక్కడే పడిపోయి ఉంటే ఎంత ముఖ్యమైన పనిమీద వెళ్ళాలి? ఏమైపోను నా జీవితం అన్నాడు. అది జరగనప్పుడు తెలియలేదు ఎందుకు జరగలేదో. కానీ జరగకుండా ఉన్నది ఎందుకు జరగలేదో తెలిసినప్పుడు మాత్రం నమస్కారం చేస్తావు. అన్ని వేళలా తెలియాలని యేమీ నియమం లేదు. అందుకే "ప్రధమో వైద్యో భిషక్’- ఈశ్వరుడు వైద్యుడు లాంటి వాడు. మనం జబ్బు ఒక్కటే చెప్తాం. డాక్టర్ గారు మందిస్తారు. మాట్లాడకుండా వేసుకోవాలి. కాదని ఎదురు ప్రశ్నిస్తే ఇక్కడినుంచిఫో అంటాడు. భగవంతుడు కూడా అంతే. ఆయనని నమ్ము నువ్వు ఉపద్రవాలలో పడిపోకుండా ఆయన చూసుకుంటాడు. ఒకవేళ ఏదో కష్టం వచ్చింది. వెనక ఏదో ఉంది ఈశ్వరుడి ఆలోచన. యేదో కారణం లేకుండా ఆయన యేదీ చేయడు. కాబట్టి అందులో కూడా నీపట్ల అనుగ్రహం ఉందని ఎప్పుడో బయటికి వస్తుంది. అప్పుడు సంతోషిస్తావు. ొందరపడి ఈశ్వరుని నిందచేయకు. పట్టుకెళ్ళి యాపిల్ పండో, అరటిపండో పెట్టడంతో సరిపోదు. ఎప్పుడూ వాడు నా ప్రక్కనున్నాడు అనుకోవాలి. అందుకే సఖ్యభక్తి అని నవవిధ భక్తులలో ఒక భక్తి. నివేదన కేవలం ఒక పదార్థం పెట్టడం కాదు. జీవితంలో అన్ని విషయములయందు విస్తరించాలి. చిట్టచివరికి జీవితమే నివేదన. జీవితమంతా ఈశ్వరుడితో సమన్వయం. ఈశ్వర ప్రోక్తము, విహితము; ఈశ్వరుడు చెప్పనిది నిషిద్ధము. అదే నివేదన. కాబట్టి నివేదన కేవలం ఒక పదార్థం పెట్టడం కాదు. జీవితమునందు విస్తరించవలసినటువంటి విషయం.

No comments:

Post a Comment