చతుర్వేదములు

పూర్వము ఋషులు యజ్ఞ యాగాదులు నిర్వహించినప్పుడు ఈ వేదములందలి మంత్రములను వినియోగించినారు . వేదములు దైవ వాక్కులు, పరమేశ్వర విశ్వాసముల్. వేదములు నాలుగు. అవి 1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3, సామవేదము , 4. అధర్వ వేదము.

ఋగ్వేదము :
పాదబద్ధములగు మంత్రమును " ఋక్కు " అని అంటారు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుట వలన దీనికి ' ఋగ్వేదము ' అని పేరు. ఈ వేదమునాకు 21 శాఖలు కలవు. ఆ 21 శాఖలలో శాకలశాఖ, భాష్కల శాఖ అనే రెండు శాఖలు మాత్రం ప్రస్తుతం లభించుచున్నాయి. ఇందు వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు తయారు చేసే విధానం, టెలిగ్రాం, వైర్లెస్ వంటి అనేక ఆధునిక శాస్త్రములు ఈ ఋగ్వేదము నందు గలవు. యజ్ఞ సమయమునందు హవిర్భాగములు గ్రహించు నిమిత్తము హోతయను ఋత్విక్కు ఈ వేదమంత్రములతో దేవతలను ఆహ్వానించును. అందుచే ఈ వేదమునకు " హౌత్రవేద " మని పేరు. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించిరి. ఒక శాఖ వారు 8 అష్టములుగా విభజించినారు.

యజుర్వేదము
ఇందు కృష్ణయజుర్వేదము,శుక్లయజుర్వేదము అనియు రెండు విధములు కలవు. 'తైత్తిరి' అను పేరు గల ఆచార్యుడు శిష్యుప్రశిష్యులకు బోధించెను. అందుచే 'తైత్తిరీయము' అని పేరు వచ్చింది.ఈ తైత్తిరీయవేదమునకు సంహిత, బ్రాహ్మణము,ఆరణ్యకము అను మూడు భాగములు ఉన్నవి. ఈ సంహితమందు 7 అష్టకములు(కాండములు),44 ప్రశ్నలు(ప్రపాథకములు) ,651 అనువాకములు,2196 పంచాశాత్తులు(పనసలు) ఉన్నవి.ఇందులో కర్మలను తెలుపు శాస్త్రము, బ్రహ్మవిద్య, సృష్టివిద్య , గణితవిద్య ,అంతరిక్షవిద్య మొదలగునవి కలవు.

పనస: 
ప్రతి పనసయందు యాభై పదములు ఉన్నవి. అనువాకాన్తమందున్న పనసలకును,అనువాకము అందున్న పనసలకును పదములు కొంచము హెచ్చుతగ్గుల ఉండును.సంస్కృత భాషలో దీనిని 'పంచాశాత్తులు' అని అందురు .

శుక్లయజుర్వేదము:
వాజసనేయ సంహిత అని దీనికి మరొక పేరు. ప్రస్తుతము ఈ వేదమునందు మాధ్యందిన శాఖ,కాణ్వశాఖ అని రెండు శాఖలు కలవు.ఈ రెండు శాఖల వారిని తెలుగునాట 'ప్రథమశాఖ' అంటారు. శుక్లయజుర్వేదములో 40 అధ్యాయములు కలవు.ఈ వేదమునకు 'శతపథబ్రాహ్మణము' అని పేరు. ఈ వేదమంత్రములతో 'అధ్వర్యుడు' అను ఋత్విక్కు యజ్ఞమునందు హొమాది ప్రధాన క్రుత్యములను ఆచరించును.సకలకర్మలు ఆపస్థంభ మహర్షి చేసిన కల్ప సూత్రమును అనుసరించి జరిపించుకుంటారు

సామవేదం :
ఇది ఈశ్వర భక్తి ప్రబోధించు శాస్త్రము. సామము అనగా గానము. గానము చేయదగిన మంత్రములు గల వేదము కావున 'సామవేదము' అని పేరు వచ్చింది.ఈ వేదమునకు 1000 శాఖలు కలవని సంప్రదాయం. అయితే ఇప్పుడు ఒకే ఒక్క శాఖ మాత్రమే లభించుచున్నది. యజ్న కాలమందు 'ఉద్గాత' అను ఋత్విక్కు ఈ వేదమంత్రములతో గానము చేయుచూ దేవతలను స్తుతించును. అందుచేతనే ఈ వేదమునకు 'ఉద్గాత్రువేదము' అని మరొక పేరు ఉంది. ఈ వేదమునకు 'తాండ్యబ్రాహ్మణము' మున్నగు బ్రాహ్మణ గ్రంధములు ఎనిమిది కలవు

No comments:

Post a Comment