లక్ష్మీదేవి పూజకు సంబంధించినవి

కొబ్బరి, అరటి, మామిడి,బంతి,తులసి,బిల్వ వృక్షాలలో లక్ష్మిదేవి నివసిస్తుంది. ప్రకృతి ఔదార్యానికి కొబ్బరి చెట్టు ప్రతీక. దానిని ప్రత్యేక పోషణలు అవసరం లేదు. ఇట్టే పెరిగి పోతుంది. చెట్టులోని ప్రతి భాగం ఉపయుక్తమైనది. అరటి చెట్టుకు ఎంతో ఆర్ధిక విలువలు ఉన్నాయి. అరటి ఆకులో భోజనాలు చేస్తాం. ఏ శుభకార్యాలు అయినా, పూజలు జరిగినా అరటిపండ్లు ఉండాల్సిందే. మామిడితోరణాలు ఇంటిగుమ్మాలకు కడతాం. వసంతంలో వచ్చే మామిడిపూత మన్మధునికి ప్రీతి. లక్ష్మి పుత్రుడు మన్మధుడు. బంతి పువ్వులను గుమ్మాలకు కట్టి లక్ష్మి దేవికి స్వాగతం పలుకుతాము. అలాగే తులసి చెట్టుతోను దేవికి బాంధవ్యముంది. తులసీ దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు. మారేడు పండులోనూ లక్ష్మిదేవి ఉంటుంది అంటారు. ఒకసారి లక్ష్మిదేవి శివుడికి వెయ్యి కలువ పువ్వులతో పూజ చేసుకుంటాను అని సంకల్పం చేసుకుంటుంది. శివుడు ఆమె భక్తిని పరీక్షించేందుకు ఒక పూవును తీస్కుంటాడు. అలాగ ఒక పువ్వు తక్కువయిన విషయాన్ని గమనించిన లక్ష్మి దేవి భూమి అంతా గాలించిన ఒక్క పువ్వు కుడా దొరకదు. అప్పుడు ఆ తల్లి తన ఒక స్తనాన్ని కలువపువ్వుగా సమర్పించదలుస్తుంది. ఆమె సాహసానికి ,భక్తికి ముగ్ధుడైన శివుడు అమ్మవారి స్థనాన్ని మారేడుపండుగా మార్చి,తనకి మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని ప్రకటిస్తాడు. అలాగే తమలపాకు,వక్కల్ని కూడా లక్ష్మీదేవి పూజకు సంబంధించినవి !!

No comments:

Post a comment