చాలా సంవత్సరములకు పూర్వం మన దక్షిణ భారత దేశాన్ని మ్లేచ్చ రాజైన మాలికాపూర్ దండెత్తి ధ్వంసం చేసింది అందరికీ విశదమే. అలా వస్తుండడం మధుర నగర వాసులకు తెలిసింది. ఆతను వచ్చే దారిలో అంతా హత్యలు, దోపిడీలు, స్త్రీలను బలాత్కారం చేయడం, స్త్రీలను నిర్భందించి అదుపులోకి తీసుకొని అందరికి పంచడం, చేయడం కాకుండా మన దేవాలయములు అన్ని ధ్వంసం చేసి నగలు ధనం కొల్లగొట్టుకొని పోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
అప్పుడు మన ప్రజలు ఎలాగైనా దేవతా మూర్తులను కాపాడాలని శత విధములుగా ప్రయత్నం చేసి కాపాడుతున్నారు. అలాంటి వాటిలో ఒక పద్దతి గర్భ గుడికి ముందు ఒక గోడను లేపి అక్కడ ఒక శిలా విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పూజాదులు నిర్వర్తించు చుండిరి. దీనినే శిలాతోరణం అని చెప్పడం. మ్లేచ్చ రాజు కోవెలకు వచ్చి ఇదియే అసలు విగ్రహం అని అపోహతో దానిని విధ్వంసము చేసి నగలు ధనము కొల్లగొట్టుకు పోతున్నాడు.
అప్పుడు మధుర మీనాక్షి కోవెలలోని అర్చకులు ఈ విధానమును గ్రహించి ఎలాగైనా సుందరేశ్వరుని, మీనాక్షిని కాపాడుకోవాలని ప్రతిజ్ఞ తీసుకొని గర్భగృహం ముందు గోడను లేపి అక్కడ ఒక లింగమును, మీనాక్షి ఉత్సవ విగ్రమును ప్రతిష్టించి పూజాదులు నిర్వర్తించు చుండిరి. అప్పుడు అక్కడికి రానేవచ్చాడు మన మ్లేచ్చుడు మాలికాపూర్. లింగమును విగ్రహమును ధ్వంసం చేసి నగలు, దస్కం తీసుకెళ్ళి పోయాడు. తర్వాత అక్కడ కోవెలలో సుమారు నలుబై ఎనిమిది సంవత్సరములు పూజాదులు లేకుండా కోవెల పాడు పడి వుండినది. ఆ అర్చకులు మట్టుకు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు ఈ అసలు విషయం ప్రాణం పోయిన బయటకు చెప్పారాదు అని.
సుమారు యాబై సంవత్సరముల అనంతరం విజయనగరరాజులు దండెత్తి మ్లేచ్చులను పారదోలి ఎన్నో కోవెలలను పునరుద్ధరించారు. అలా చేస్తూ వచ్చి మీనాక్షి ఆలయంలోని పరిస్థితి చూసి చాలా దుఃఖ పడి కోవెల పునరుద్ధరణకు ప్రయత్నములు ఆరంభించినారు. అప్పుడు ఒక వృద్ద పూజారి కోవెలకు వచ్చి నూతన ఆలయ నిర్మాణం అవస్యం లేదు స్వామి విగ్రహం క్షేమంగా వుంది అని చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు కాని అప్పుడు అతను సుమారు యాభై సంవత్సరములకు ముందు తాము చేసిన ఏర్పాటును చెప్పి గోడను తొలగించితే అసలు విగ్రహం వుందని చెప్పారు. రాజు గోడ తొలగించి చూస్తే యాబై సంవత్సరములకు పూర్వం స్వామి ఎలా వుందో అలానే చెక్కు చెదరకుండా వుండటం చూశారు. దేవుని పైన వేసివుండిన మాలలు కాని దీపం కాని ఏమి మారకుండా వుండటం చూసి ఆశ్చర్య చకితులై స్వామికి మోకరిల్లి దేవాలయం పునరుద్ధరణకు పాల్పడ్డారు. అప్పుడు విరిగిపోయిన శివ లింగమును గుడిలోని తామర కొలను వద్ద వుంచి ఒక శిలా ఫలకమును ఏర్పాటు చేసి విషయము సువిస్తారముగా వెనుక సంతతికి తెలియాలని ఏర్పాటు చేసినారు.
చాలా రోజుల తర్వాత చెన్నై ముఖ్య మంత్రి ఎం.జి. రామచంద్రన్ గారు మదురై గుడికి వేంచేసినప్పుడు ఆ లింగమును శిలా ఫలకమును చూసి ఆశ్చర్యపోయి ఈ విగ్రహం అంటే లింగము పురావస్తుశాలలో వుండకూడదు దేవాలయంలోనే వుంచి పూజాదులకు ఏర్పాటు చేసి అక్కడే ఈ విషయం అందరికి తెలియాలని శిలా ఫలకం కూడా ఏర్పాటుచేసినారు. నేటికి మనం మధురై కోవెలకు వెళితే ఆ లింగమును, శిలాఫలకమును చూడవచ్చు.

No comments:
Post a Comment