"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఓంకారం ఏర్పడింది. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. పరమాత్మకు శబ్దరూప ప్రతీక.
మంత్రోచారణం అనేది జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఇందులో ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఓం కారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకారము నుంచే యావత్తు జగము ఉద్భవించింది. వేదముల యొక్క సారము ఓంకారము.
`ఓం' అంటే ప్రారంభాన్ని తెలుపునది. ఓకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన `ఓం'కు అనేక అర్థాలు కలవు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవ నాదమే ప్రాణము. ప్రధమ నాదము ఓంకారము. అకార, ఉకార, మకారములను మూడు అక్షరముల కలయిక వలన ఓంకారము ఉద్భవించినదని పండితులు చెబుతున్నారు.
No comments:
Post a Comment