భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే

భజగోవిందం స్తోత్రాల్లో శంకరాచార్యులు అమ్మలా లాలనగా బుజ్జగించి చెప్పడం లేదు; అపరాధి అయిన కొడుకును దండించి దారిలో పెట్టే తండ్రిలా హెచ్చరిస్తున్నారు, తీవ్ర స్వరంతో తట్టి లేపుతున్నారు. ఆ స్తోత్రమంజీరంలోని తొలి శ్లోకమిది.
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుక్రుఞ్ కరణే!!
"ఓ మూర్ఖుడా! గోవిందుని భజింపుము; గోవిందుని భజింపుము. నీ మరణ సమయమాసన్నమైనప్పుడు నీవు వల్లె వేస్తున్న ఈ వ్యాకరణ సూత్రాలేవీ నిన్ను రక్షించవు" అంటూ హితవు పలుకుతున్నారు శంకరులు. కాశీలో ఆ వృద్ధుడు వల్లె వేస్తున్న ఈ ' డుక్రుఞ్ కరణి' అనేది పాణిని వ్యాకరణ సిద్ధాంత కౌముదిలోని పాఠం. అంతటి వయస్సులో ఆ వ్యాకరణ సూత్రాలను నేర్చుకొని అతను సాధించేదేమిటన్నది శంకరులకు ఆశ్చర్యం కలిగింది.
అప్పుడే కాదు ఇప్పుడు కూడా అడుగడుగునా ఇలాంటి వయోవృద్ధులే మనకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రాణం పోసుకుంది మొదలు తుచ్ఛమైన ఈ ప్రాపంచిక సుఖాల వలలో పడి కొట్టుకోవడంతోనే సరిపోతుంది. శ్మశానికి సన్నిహితమయ్యే రోజొకటి వస్తుందనీ, అలా సంప్రాప్తించే కాలంలో మనల్ని ఈ లోకపు పోకడలేవీ కాపాడలేవనీ గుర్తించలేకపోతున్నాం. తలలు బోడులు అవుతున్నా తాపత్రయాల్ని వీడలేకపోతున్నాం. శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండి పోతామన్న భ్రాంతిలో పడి, పరమాత్ముడు ఒకడున్నాడు; అతడే మనకు పరమ ఆప్తుడన్న సంగతే మరచిపోతున్నాం. పైగా భక్తిభావాన్ని పెంచని శాస్త్ర అధ్యయనాలతో, వాదోపవాదాలతో కాలం గడుపుతున్నాం. ఆ దేవదేవుడి నామస్మరణనే విస్మరిస్తూన్నాం. అందుకే శంకరాచార్యులు ఇక్కడ గోవిందుని నామాన్ని భజన చేయమంటున్నారు.

Photo: భజగోవిందం స్తోత్రాల్లో శంకరాచార్యులు అమ్మలా లాలనగా బుజ్జగించి చెప్పడం లేదు; అపరాధి అయిన కొడుకును దండించి దారిలో పెట్టే తండ్రిలా హెచ్చరిస్తున్నారు, తీవ్ర స్వరంతో తట్టి లేపుతున్నారు. ఆ స్తోత్రమంజీరంలోని తొలి శ్లోకమిది.
భజగోవిందం భజగోవిందం 
గోవిందం భజ మూఢమతే 
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి డుక్రుఞ్ కరణే!!
"ఓ మూర్ఖుడా! గోవిందుని భజింపుము; గోవిందుని భజింపుము. నీ మరణ సమయమాసన్నమైనప్పుడు నీవు వల్లె వేస్తున్న ఈ వ్యాకరణ సూత్రాలేవీ నిన్ను రక్షించవు" అంటూ హితవు పలుకుతున్నారు శంకరులు. కాశీలో ఆ వృద్ధుడు వల్లె వేస్తున్న ఈ ' డుక్రుఞ్  కరణి' అనేది పాణిని వ్యాకరణ సిద్ధాంత కౌముదిలోని పాఠం. అంతటి వయస్సులో ఆ వ్యాకరణ సూత్రాలను నేర్చుకొని అతను సాధించేదేమిటన్నది శంకరులకు ఆశ్చర్యం కలిగింది. 
అప్పుడే కాదు ఇప్పుడు కూడా అడుగడుగునా ఇలాంటి వయోవృద్ధులే మనకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రాణం పోసుకుంది మొదలు తుచ్ఛమైన ఈ ప్రాపంచిక సుఖాల వలలో పడి కొట్టుకోవడంతోనే సరిపోతుంది. శ్మశానికి సన్నిహితమయ్యే రోజొకటి వస్తుందనీ, అలా సంప్రాప్తించే కాలంలో మనల్ని ఈ లోకపు పోకడలేవీ కాపాడలేవనీ గుర్తించలేకపోతున్నాం. తలలు బోడులు అవుతున్నా తాపత్రయాల్ని వీడలేకపోతున్నాం. శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండి పోతామన్న భ్రాంతిలో పడి, పరమాత్ముడు ఒకడున్నాడు; అతడే మనకు పరమ ఆప్తుడన్న సంగతే మరచిపోతున్నాం. పైగా భక్తిభావాన్ని పెంచని శాస్త్ర అధ్యయనాలతో, వాదోపవాదాలతో కాలం గడుపుతున్నాం. ఆ దేవదేవుడి నామస్మరణనే విస్మరిస్తూన్నాం. అందుకే శంకరాచార్యులు ఇక్కడ గోవిందుని నామాన్ని భజన చేయమంటున్నారు.

No comments:

Post a Comment