కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యార్జునుడు. బ్రహ్మాండ పురాణంలో చాలా విస్తృతంగా ఉందీ కథ. సంక్షేపంగా భాగవతంలో కూడా ఉంది. కృతవీరుడు మరణించగానే పట్టాభిషేకం చేస్తాం అన్నారు. ఇంతమంది ప్రజలను నేనెలా పరిపాలించ గలను? అంత శక్తి నాకు ఉందా? అన్నాడు. అప్పుడు గర్గుడు అనే మహానుభావుడు గురువు నీకు శక్తి కావాలంటే దత్తాత్రేయ అనుగ్రహం పొందమన్నారు. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఆయన పిచ్చివాడులా ఉంటాడు అవధూత, ఆయన వెంట పడితే మనకేం దొరుకుతుంది? జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు అనుకుంటారు. చాలా పొరపాటు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఇచ్చే అనుగ్రహం ఎవ్వరూ ఇవ్వరు. దత్తాత్రేయ గురుమూర్తి ఇచ్చే అనుగ్రహం అప్రతిహతమైన అనుగ్రహం. అంత అనుగ్రహం ఇస్తారు. కానీ పరీక్షిస్తారు. కార్తవీర్యార్జునుడు బయలుదేరి వెళ్తే స్వామి వారు మాంసం కోస్తున్నారు, ఇంకొకసారి వెళ్తే మద్యపానం చేస్తున్నట్లుగా కనపడ్డారు. ఇంకొక సారి వెళ్తే ఒక ఆడపిల్లని దగ్గర కూర్చోబెట్టుకొని ముద్దులాడుతున్నాడు. ఇంత భ్రష్టుడు ఈయన దగ్గరికి మనమేం వెళ్తాం అని శ్రోత్రీయులు అనుకున్న వాళ్ళు వీళ్ళకి ఆటోపం ఎక్కువ పైన – సూక్ష్మ దృష్టి తక్కువ – అందుకని వాళ్ళంతా తొలగిపోతారు. ఘనాపాటీలు, పండితులు అక్కడిదాకా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతారు. అదే విష్ణుదత్తుడి చరిత్రలో బాగా చూపించారు. అయినా వదలలేదు, వెంటబడ్డాడు, కాలు పట్టుకున్నాడు. దత్త భక్తి గలవాడు దృఢమైన భావంలో ఉండాలి. ఉంటే వాడిని సర్వదా రక్షిస్తాడు స్వామీ. దత్తాత్రేయ మహారాజ్ అనుగ్రహంతో ఐశ్వర్యం తగ్గదు, ఆత్మతృప్తి తగ్గదు, అప్రతిహత శక్తి వస్తుంది. సమస్తమైనవీ వస్తాయి. అయితే అంత పట్టుబట్టాలి. బాగా పట్టుబట్టాడు. కాలు పట్టుకున్నాడు. వదలలేదు. ఎముకలు తీసుకొని కొట్టారు. గాయాలైనా వదలలేదు. అప్పుడు అనుగ్రహించాడు. నువ్వు గట్టి పట్టు పట్టావురా సరే రా అని తీసుకెళ్ళి కూర్చోబెట్టి యోగశాస్త్రం నేర్పాడు కార్తవీర్యుడికి. వాళ్ళు వచ్చింది పట్టాభిషేకం చేసుకొని పరిపాలించడానికి వస్తే వాడికి మిలిటరీ కోర్సో, ఫినాన్సో అది చెప్పాలి గానీ యోగశాస్త్రాలెందుకు? ముందు ఇది చెప్పంది దానిని అనుగ్రహించడు. ముందు దత్త భక్తి నేర్చుకుంటే attachment తగ్గాలి మెల్లగా. నిజమైన స్వార్థం లోపించాలి. Broad mind రావాలి. ఎంతో అనుగ్రహం ఉంది అందులో. తర్వాత సర్వశక్తులూ వస్తాయి. పరీక్ష చేశారు స్వామి. మాంసం తెచ్చి కుండలో పెట్టి ఇది వండిపెట్టమన్నారు. శిష్ట కుటుంబంలో పుట్టినవాడు కదా ఎలా వండుతాడు? అయినా వండాడు. వండుతూ ఉంటే రెండు చేతులూ కాలినై. చూశావా నువ్వు మంచి సనాతన సంప్రదాయంలో పుట్టిన వాడివి, నేను భ్రష్టుడిని, నా దగ్గరికి వచ్చావు చేతులు కూడా కాలినై. నువ్వు పాడయిపోతావు. ఇంటికెళ్ళు నాయనా అన్నారు. అప్పుడు ఈ మాంసం అంటే ఏమిటో, స్వరూపం ఏమిటో ఆత్మస్తుతి చేశాడు పరమాత్మ దగ్గర కార్తవీర్యార్జునుడు. ఇది రహస్య స్తుతి. ఈ రహస్య స్తుతికి పరమానందం కలిగిందిట. ఇక నువ్వు నేర్వవలసింది లేదు, చేయవలసింది లేదు, సవికల్ప, నిర్వికల్ప సమాధినిష్టుడవు అవుతావు. సర్వజ్ఞుడవు అవుతావు.
న నూనం కార్తవీర్యస్య పదవీమధిగంతుమీశ్వరాః!
బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. కార్తవీర్యుడి స్థాయికి వచ్చిన ప్రభువంటూ లేడు ప్రపంచంలో. ఎందుకని? కార్తవీర్యార్జునుడి టైం లో పోలీస్ స్టేషన్ లేదు, మిలిటరీ లేదు, చతురంగ బలాలు లేవు. మరి ఎట్లా పరిపాలించాడు అన్నారు. ఈ మొత్తం దేశంలో ఎక్కడ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే మధ్యలో కార్తవీర్యార్జునుడు వచ్చి నిల్చునేవాడుట. యోగశక్తి, యోగామూర్తి. ఇంత మహానుభావుడు. ఒక సందేహం – ఇంతటి గొప్పవాడిని పరశురాముడు చంపాడే! వీడు దుర్మార్గుడు కాకపొతే ఎట్లా చంపుతాడు అన్నారు. పిచ్చివారా! వారాల లిస్టు అడిగాడు ఏం కావాలి? అని. నాకంటే ఉన్నతుడైన వాడిచేత నేను సంహరింపబడాలి అని కోరాడు. క్షత్రియుడికి మంచంలో మరణం న్యాయం కాదు. యుద్ధంలో సంహరింపబడాలి. ఆ చంపేవాడు నాకంటే చాలా గొప్ప స్టేటస్ కలవాడు కావాలి. స్వామి నవ్వి భక్తుడవైన నువ్వు, నిన్ను అనుగ్రహించిన నేను, - నాకంటే నీకంటే గొప్పవాడు ఎవడున్నాడు? పెద్ద చిక్కు తెచ్చిపెట్టావు. అయినా నువ్వు కోరింది ఇస్తాను అన్నాను గనుక నేనే ఒకచోటికి చేరి నిన్ను చంపుతాలే అన్నారు. పరశురాముడిగా ఆవేశావతారం పొంది శ్రీదత్తాత్రేయ గురుమూర్తి నారాయణుడే కార్తవీర్యార్జునుడిని సంహరించాడు. కనుక సర్వశక్తులూ సర్వ అనుగ్రహాలు, సర్వ రాజ్యపదవులూ, సమస్త భోగాలూ దత్తాత్రేయుల వారిని సేవించడం వల్ల పొందగలుగుతారు.

No comments:
Post a Comment