"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?

"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఓంకారం ఏర్పడింది. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. పరమాత్మకు శబ్దరూప ప్రతీక.
మంత్రోచారణం అనేది జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఇందులో ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఓం కారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకారము నుంచే యావత్తు జగము ఉద్భవించింది. వేదముల యొక్క సారము ఓంకారము.
`ఓం' అంటే ప్రారంభాన్ని తెలుపునది. ఓకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన `ఓం'కు అనేక అర్థాలు కలవు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవ నాదమే ప్రాణము. ప్రధమ నాదము ఓంకారము. అకార, ఉకార, మకారములను మూడు అక్షరముల కలయిక వలన ఓంకారము ఉద్భవించినదని పండితులు చెబుతున్నారు.

శృంగార వల్లభ స్వామి అంటే వేంకటేశ్వరుడే

తొలితిరుపతి శృంగార వల్లభ స్వామి - ఇక్కడిస్వామి చిరునవ్వులు చిందిస్తూ శృంగార వల్లభ స్వామిగా పిలవ బడుతున్నాడని, ఎవరుఎంత పొడవు వుంటే అంత పొడవుగానే కనిపిస్తాడని చెపుతారు. శృంగార వల్లభ స్వామి అంటే వేంకటేశ్వరుడే.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి కిర్లంపూడి వెళ్ళేదారిలో దివిలికి ఒక కిలోమీటరు దూరంలో తొలి తిరుపతి అనే ఊరు ఉంది. సామర్లకోటనుంచి ఇక్కడికి 12 కిలోమీటర్లు. గుడికి బయట ఒక ఫ్లెక్సీ బోర్డ్‌మీద తొమ్మిదివేల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది అని రాసి ఉంటుంది. దేవాలయం పురాతనంగానే కనిపిస్తుంది కానీ మరీ అంత పాతది కాదేమో అనే సందేహంకూడా కలుగుతుంది. కొతమంది అభిప్రాయం ప్రకారం కలియు
గం మొదలై సుమారు 5000 సంవత్సరాలు అయ్యిందని. అంటే ఈ దేవాలయం ద్వాపరయుగం నాటిదన్నమాట!
దృవుడు ఇక్కడ విష్ణుమూర్తికోసం తపస్సుచేశాడని చెపుతారు.
Watch this for more details:
https://www.youtube.com/watch?v=nNpfh4F3ddw

తిరుమల గురించి 11 నిజాలు...

1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.
5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే

భజగోవిందం స్తోత్రాల్లో శంకరాచార్యులు అమ్మలా లాలనగా బుజ్జగించి చెప్పడం లేదు; అపరాధి అయిన కొడుకును దండించి దారిలో పెట్టే తండ్రిలా హెచ్చరిస్తున్నారు, తీవ్ర స్వరంతో తట్టి లేపుతున్నారు. ఆ స్తోత్రమంజీరంలోని తొలి శ్లోకమిది.
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుక్రుఞ్ కరణే!!
"ఓ మూర్ఖుడా! గోవిందుని భజింపుము; గోవిందుని భజింపుము. నీ మరణ సమయమాసన్నమైనప్పుడు నీవు వల్లె వేస్తున్న ఈ వ్యాకరణ సూత్రాలేవీ నిన్ను రక్షించవు" అంటూ హితవు పలుకుతున్నారు శంకరులు. కాశీలో ఆ వృద్ధుడు వల్లె వేస్తున్న ఈ ' డుక్రుఞ్ కరణి' అనేది పాణిని వ్యాకరణ సిద్ధాంత కౌముదిలోని పాఠం. అంతటి వయస్సులో ఆ వ్యాకరణ సూత్రాలను నేర్చుకొని అతను సాధించేదేమిటన్నది శంకరులకు ఆశ్చర్యం కలిగింది.
అప్పుడే కాదు ఇప్పుడు కూడా అడుగడుగునా ఇలాంటి వయోవృద్ధులే మనకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రాణం పోసుకుంది మొదలు తుచ్ఛమైన ఈ ప్రాపంచిక సుఖాల వలలో పడి కొట్టుకోవడంతోనే సరిపోతుంది. శ్మశానికి సన్నిహితమయ్యే రోజొకటి వస్తుందనీ, అలా సంప్రాప్తించే కాలంలో మనల్ని ఈ లోకపు పోకడలేవీ కాపాడలేవనీ గుర్తించలేకపోతున్నాం. తలలు బోడులు అవుతున్నా తాపత్రయాల్ని వీడలేకపోతున్నాం. శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండి పోతామన్న భ్రాంతిలో పడి, పరమాత్ముడు ఒకడున్నాడు; అతడే మనకు పరమ ఆప్తుడన్న సంగతే మరచిపోతున్నాం. పైగా భక్తిభావాన్ని పెంచని శాస్త్ర అధ్యయనాలతో, వాదోపవాదాలతో కాలం గడుపుతున్నాం. ఆ దేవదేవుడి నామస్మరణనే విస్మరిస్తూన్నాం. అందుకే శంకరాచార్యులు ఇక్కడ గోవిందుని నామాన్ని భజన చేయమంటున్నారు.

Photo: భజగోవిందం స్తోత్రాల్లో శంకరాచార్యులు అమ్మలా లాలనగా బుజ్జగించి చెప్పడం లేదు; అపరాధి అయిన కొడుకును దండించి దారిలో పెట్టే తండ్రిలా హెచ్చరిస్తున్నారు, తీవ్ర స్వరంతో తట్టి లేపుతున్నారు. ఆ స్తోత్రమంజీరంలోని తొలి శ్లోకమిది.
భజగోవిందం భజగోవిందం 
గోవిందం భజ మూఢమతే 
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి డుక్రుఞ్ కరణే!!
"ఓ మూర్ఖుడా! గోవిందుని భజింపుము; గోవిందుని భజింపుము. నీ మరణ సమయమాసన్నమైనప్పుడు నీవు వల్లె వేస్తున్న ఈ వ్యాకరణ సూత్రాలేవీ నిన్ను రక్షించవు" అంటూ హితవు పలుకుతున్నారు శంకరులు. కాశీలో ఆ వృద్ధుడు వల్లె వేస్తున్న ఈ ' డుక్రుఞ్  కరణి' అనేది పాణిని వ్యాకరణ సిద్ధాంత కౌముదిలోని పాఠం. అంతటి వయస్సులో ఆ వ్యాకరణ సూత్రాలను నేర్చుకొని అతను సాధించేదేమిటన్నది శంకరులకు ఆశ్చర్యం కలిగింది. 
అప్పుడే కాదు ఇప్పుడు కూడా అడుగడుగునా ఇలాంటి వయోవృద్ధులే మనకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రాణం పోసుకుంది మొదలు తుచ్ఛమైన ఈ ప్రాపంచిక సుఖాల వలలో పడి కొట్టుకోవడంతోనే సరిపోతుంది. శ్మశానికి సన్నిహితమయ్యే రోజొకటి వస్తుందనీ, అలా సంప్రాప్తించే కాలంలో మనల్ని ఈ లోకపు పోకడలేవీ కాపాడలేవనీ గుర్తించలేకపోతున్నాం. తలలు బోడులు అవుతున్నా తాపత్రయాల్ని వీడలేకపోతున్నాం. శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండి పోతామన్న భ్రాంతిలో పడి, పరమాత్ముడు ఒకడున్నాడు; అతడే మనకు పరమ ఆప్తుడన్న సంగతే మరచిపోతున్నాం. పైగా భక్తిభావాన్ని పెంచని శాస్త్ర అధ్యయనాలతో, వాదోపవాదాలతో కాలం గడుపుతున్నాం. ఆ దేవదేవుడి నామస్మరణనే విస్మరిస్తూన్నాం. అందుకే శంకరాచార్యులు ఇక్కడ గోవిందుని నామాన్ని భజన చేయమంటున్నారు.

బొడ్డురాయి-గ్రామదేవతలు

కలరా, మసూచి మొదలగు సాంక్రామిక వ్యాధులు, పశువ్యాధులు సోకకుండునట్లు గ్రామవాసులు పూజించు నిలువున నాటిన పెద్దరాయి. ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా గ్రామ మధ్యమున నెలకొల్పిన శిల. గ్రామమున అరిష్టము లేర్పడినప్పుడు, కొన్నిచోట్ల బ్రాహ్మణులు, మరికొన్ని చోట్ల కుమ్మరులు గ్రామప్రజల పక్షమున యీ రాతిని పూజించి, వడపప్పు పానకములను పంచిపెట్టుదురు.

గ్రామదేవతలు

మనదేశంలో మాతృదేవతా స్వరూపాలైన గ్రామదేవతలు గ్రామాలలో స్థిరపడి, వారు నిర్వహించే విధులననుసరించి విభిన్న పేర్లతో చలామణి అవుతున్నారు. గ్రామదేవతల్లో స్త్రీ దేవతలే గాక పురుష దేవతలు కూడా వున్నారు. వీరితో పాటు వృక్ష , జంతు సంబంధమైన దేవతలు కూడ పూజింపబడుచున్నారు. అయితే జానపదులు స్ర్తీ దేవతకు ఇచ్చినంత ప్రాముఖ్యత పురుష గ్రామదేవతలకు యివ్వలేదు. గ్రామీణుల దృష్టిలో మాతృదేవత అందరికంటే అధికురాలు, గ్రామీణులచే శక్తి దేవతగా పూజింపబడుతున్న మతృ దేవత అంబిక, భద్రకాళి, చాముండి, కాళి, కామాక్షి, కన్యాకుమారి, మహేశ్వరి అనబడు పేర్లతో భారతదేశమంతటా పూజింపబడుతోంది.

నాదృష్టిలో గ్రామదేవతలు ముక్కోటి దేవతలలోవారే. ముక్కోటి అంటే ఒక పరిమిత సంఖ్య అని కాదు. అనంతమని అర్థం. గ్రామదేవతలు - శిష్ట దేవతలు అనికొందరు దేవతలను విభజిస్తారు. సామాన్యంగా గ్రామదేవతలు జన సామాన్యంపూజించేవి. ఇక్కడ వైదిక, ఆగమ, పౌరాణిక సంబంధమైన పూజలు, సంస్కృతమంత్రాలు ఉండవు.ఒకప్పుడు విరివిగా జంతుబలులు ఉండేవి. ఒకొకఊరిలో ఒకొక కులం వారు పూజారులుగా ఉంటారు. కాని గ్రామంలో అందరూ ఆదరిస్తారు. పూర్వం మశూచి, ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు "అమ్మవారు పోసింది" అనేవారు.వేపమండలు రోగి గదివద్ద కట్టేవారు. ఆ సమయాల్లో అమ్మవారికి ముడుపులు కట్టేవారు.

Photo: బొడ్డురాయి

నాయకుడు ఎలా ఉండకూడదు?:

అనగనగా ఒక పెద్ద దిగుడు బావిలో వందలాది కప్పలు బెకబెకమంటూ కాపురముంటున్నాయి. తమని నడిపించే యోగ్యుడైన నాయకుడు కావాలని వాటికి కోరికకలిగింది. అవి దేవుణ్ణి ప్రార్ధించసాగాయి. ఇలా ప్రార్థనలు సాగిస్తుండగా, పక్కనే ఉన్న చెట్టు మాను విరిగి ఆ బావిలో పడింది. పెద్ద శబ్దం రావడమే కాక, నీళ్ళు నేలంత ఎత్తుకి చిమ్మాయి. కప్పలు కాసేపు భయపడినా, తాము ప్రార్థించినందుకు ప్రతిఫలంగా దేవుడు తమకు గొప్ప నాయకుడిని పంపించాడని నమ్మాయి. నెమ్మదిగా దాని దగ్గరకు రావడం మొదలుపెట్టాయి. పలకరించడానికి ప్రయత్నించాయి. ఉలుకు పలుకు లేదు. మాను మీద ఎక్కాయి, తొక్కాయి, బెకబెక లాడాయి, ఆటలాడాయి. అయినా స్పందనే లేదు. నెమ్మదిగా వాస్తవాన్ని అర్థం చేసుకున్నాయి. ఇతడా నాయకుడని వాపోయాయి. “మేం కోరుకున్నది మంచి చలాకీ అయిన నాయకుడిని తప్ప ఈ మొద్దుని కాదు” అంటూ తిరిగి దైవాన్ని ప్రార్ధించాయి.
ఈ పర్యాయం పైనుంచి ఓ పాము బావిలో పడింది. చురుకుగా మెలికలు తిరుగుతోంది. బావంతా కలయదిరుగుతోంది. కప్పలన్నీ ఆ పామును చూసి, భలే చలాకీ అయిన నాయకుడిని తమకు దేవుడు పంపించాడని భావించాయి. సన్నగా తాడులా ఉన్నందువల్ల అతడి వాళ్ళ ప్రమాదమేమీ లేడని తలపోశాయి. ఆ పాము మొదట తన నోటికందిన ఓ కప్పని కరాచీ, కొరికి తినివేసింది. తరువాత మరో కప్పని, తరువాత ఇంకో కప్పని, ఆలకి పెరిగిన పాము అనేక కప్పలను తినేయసాగింది. లబోదిబోమన్న కప్పలు “నాయకుడు మొద్దుగా ఉంటే లోటు. పాములా ఉంటే చేటు” అని వాపోయాయి.

Photo: నాయకుడు ఎలా ఉండకూడదు?:

శ్రీసూర్య నారాయణ దండకము

శ్రీసూర్య నారాయణా వేదపారయణ లోకరక్షామణి
దైవచూడమణి ఆత్మరక్షా నమ: పాపశిక్షా నమో
విశ్వకర్తా నమోభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మ
మూర్తీ త్రిలోకైక నాథాధినాథ మహాభూతభేదంబులు
న్నీవయై బ్రోచు వెల్లపుడున్ భాస్కర హస్కర

పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూప విరూపాక్షనేత్ర
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్నీ రుద్రా తనుద్భూత మిస్సార
నిస్సార గంభీర సంభావి తానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి

జేగీయమానాయ కటాక్షంబులన్ నన్నుకృపా దృష్టి
వీక్షించి రక్షించు వేగన్ నీ కృద దృష్టిచేతన్ మునీంద్రాదివంద్యా
జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమందుంటి నశ్వంబులేడింటి నన్నొంటిచక్రంబును దాల్చి
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారంబు దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్
మించి నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకు
న్నాలయంబైన యీదేహభారంబుగానీక శూరోత్తమా యొప్పు
లందప్పు నేరముల్ మాని సహస్రాంశుండవైనట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మ దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింపనీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
నిన్శేశేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు
గానంగ నేనెంత నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్
మహా కష్టుడన్ నిష్టయున్లేదు నీపాద పద్మంబులే సాక్షి
దుశ్చిత్తముల్ బాపి నిశ్చింతగన్ జేయవే కామితార్ధ

శ్రీ మహా దైవ రాయ పరా వస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకం నిన్ మహిన్, రాయ కీర్తించి
(ప్రదా యీమహిన్ నిన్ను కీర్తించి) విన్నన్ మహజన్మ
జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్గదా భాస్కరా శ్రీ
సూర్యనారాయణ మహదేవ దేవ నమస్తే నమస్తే నమస్తే నమ:

Photo: శ్రీసూర్య నారాయణ దండకము

శ్రుతులు, స్మృతులు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు అన్నీ పరమ ప్రమాణాలే

మీరు చెప్పిన గ్రంథాలన్నీ పరమ ప్రమాణాలు. వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు సమస్తం కూడా ధర్మమును, న్యాయమును మనం ఆచరించదగిన విధానాన్ని చెప్పినయ్. అయితే శ్రుతిం పశ్యన్తి మునయః స్మరన్తి చ తథా స్మృతిం” అని. శ్రుతులను కన్నులతో చూచి ఆ అర్థములను చక్కగా అవలోకనం చేసి అది సమస్త జీవులకు కష్టం కనుక తెలుసుకోవడం వాటికి సరళంగా, వివరణగా, విచారణగా విశ్లేషించి స్మృతులను స్మరించారు మహర్షులు. మనన శీలురైన మహర్షులు వాటిని చూచి స్మరిస్తారు. అది చూచి స్మరించారు కనుక అదే ఇది. మనువు చెప్పిందే భేషజం, మందు అన్నారు. శ్రుతులు కూడా దీనిని చక్కగా బలపరిచినయ్. కనుక శ్రుతులు, స్మృతులు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు అన్నీ పరమ ప్రమాణాలే. ఇవి వేరు వేరు విషయాలు చెప్పవు. అన్నీ కలిపి ధర్మాన్ని చెప్తాయి. అందులో ప్రవృత్తి, నివృత్తి. స్థాన భేదం, అధికార భేదం, సమయ భేదం. దానిని బట్టి చెప్తున్నటువంటి మాటలు గానీ వాటికి, వాటికి ఏవిధమైనటువంటి విరోధమూ ఉండదు.

Photo: మీరు చెప్పిన గ్రంథాలన్నీ పరమ ప్రమాణాలు. వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు సమస్తం కూడా ధర్మమును, న్యాయమును మనం ఆచరించదగిన విధానాన్ని చెప్పినయ్. అయితే శ్రుతిం పశ్యన్తి మునయః స్మరన్తి చ తథా స్మృతిం” అని. శ్రుతులను కన్నులతో చూచి ఆ అర్థములను చక్కగా అవలోకనం చేసి అది సమస్త జీవులకు కష్టం కనుక తెలుసుకోవడం వాటికి సరళంగా, వివరణగా, విచారణగా విశ్లేషించి స్మృతులను స్మరించారు మహర్షులు. మనన శీలురైన మహర్షులు వాటిని చూచి స్మరిస్తారు. అది చూచి స్మరించారు కనుక అదే ఇది. మనువు చెప్పిందే భేషజం, మందు అన్నారు. శ్రుతులు కూడా దీనిని చక్కగా బలపరిచినయ్. కనుక శ్రుతులు, స్మృతులు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు అన్నీ పరమ ప్రమాణాలే. ఇవి వేరు వేరు విషయాలు చెప్పవు. అన్నీ కలిపి ధర్మాన్ని చెప్తాయి. అందులో ప్రవృత్తి, నివృత్తి. స్థాన భేదం, అధికార భేదం, సమయ భేదం. దానిని బట్టి చెప్తున్నటువంటి మాటలు గానీ వాటికి, వాటికి ఏవిధమైనటువంటి విరోధమూ ఉండదు.

మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది

మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది.
మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే.
ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు.
ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటిబయట ముంగిళ్ళలో గోమయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈమాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా ఉత్తరద్వార దర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిక కోరికలను తీర్చేది గోపూజ.
ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గశి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. తిరుప్పావై పారాయణ ఈరోజు నుండి మొదలు. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేక ప్రాధాన్యం.

Photo: మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. 
మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే.
ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు.
ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటిబయట ముంగిళ్ళలో గోమయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది.  లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈమాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా ఉత్తరద్వార దర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిక కోరికలను తీర్చేది గోపూజ.
ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గశి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. తిరుప్పావై పారాయణ ఈరోజు నుండి మొదలు. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేక ప్రాధాన్యం.

శ్రీ పంచముఖ హనుమత్కవచం శ్రీ సుదర్శన సంహితోక్తం

శ్రీ గణేశాయ నమః ఓం శ్రీపంచవద నాయాంజనేయాయ నమః!
ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య బ్రహ్మో ఋషిః, గాయత్రీ చందః, పంచముఖ విరాట్ హనుమాన్ దేవతా, హ్రీం బీజం, శ్రీం శక్తి: క్రౌం కీలకం క్రూం కవచం, క్రైం అస్త్రాయ ఫట్ ఇతి దిగ్బందః!! శ్రీ గరుడ ఉవాచ -
అథ ధ్యానం ప్రవక్ష్యామి - శృణు సర్వాంగసుందరి!
యత్కృతం దేవదేవేన - ధ్యానం హనుమతః ప్రియమ్!!
పంచవక్త్రం మహాభీమం - త్రిపంచనయనై ర్యుతం!
బాహుభి ర్దశభి ర్యుక్తం - సర్వకామార్థ సిద్ధిదమ్!!
పూర్వం తు వానరం వక్త్రం - కోటిసూర్య సమప్రభం!
దంష్ట్రాకరాళ వదనం - భృకుటీ కుటిలేక్షణమ్!!
అస్వైవ దక్షిణం వక్త్రం - నారసింహం మహాద్భుతం !
అత్యుగ తేజోవపుషం - భీషణం భయనాశనమ్!!
పశ్చిమం గారుడం వక్త్రం - వక్రతుండం మహాబలం !
సర్వనాగా ప్రశమనం - విషభూతాది కృంతనమ్!!
ఉత్తరం సౌకరం వక్త్రం - కృష్ణం దీప్తం సభోపమం!
పాతాళ సింహ బేతాళ - జ్వర రోగాడి కృన్తనమ్!!
ఊర్థ్యం హయాననం ఘోరం - దానవాంతకరం పరం !
యేన వక్త్రేణ విప్రేంద్ర - తారకాఖ్యం మహాసురమ్!!
జఘాన శరణం తత్స్యాత్సర్వ శత్రుహారం పరమ్!
ధ్యాత్వా పంచాముఖం రుద్రం - హనుమంతం దయానిధిమ్!!
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం - పాషా మంకుశ పర్వతం!
ముష్తిం కౌమోదకీం వృక్షం - ధారయన్తం కమండలుమ్!!
భిన్డి పాలం జ్ఞానముద్రాం - దశభి ర్మునిపుంగవం!
ఏతా న్యాయధజాలాని - ధారయన్తం భాజా మ్యహమ్!!
ప్రేతాస నోపవిష్టం తం - సర్వాభరణ భూషితం !
దివ్యమాల్యాంబరధరం - దివ్యగంధానులేపనమ్!!
సర్వాశ్చర్యమయం దేవం - హనుమ ద్విశ్వతోముఖం!
పంచాస్య మచ్యుత మనేక విచిత్రవర్ణం
వక్త్రం శశాంకశిఖరం కపిరాజవర్యం
పీతాంబరాది ముకుటై రుపశోభితాంగం
పింగాక్ష మాద్య మనిశం మనసా స్మరామి!!
మర్కటేశ! మహోత్సాహ! సర్వశత్రు హరంపరం
శత్రుం సంహార మం రక్షా శ్రీమ న్నాపద ముద్ధర!!
ఓం హరిమర్కట మరకత మంత్ర మిదం
పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే
యది నశ్యతి నశ్యతి శత్రుకులం
యది ముంచతి ముంచతి వామలతా!!
ఓం హరిమర్కట మర్కటాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకలశత్రు సంహారణాయ స్వాహా!
ఓం నమోభగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాళవదనాయ నరసింహాయ సకల భూత ప్రమథనాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకలవిశ హరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖ మాదివరహాయ సకలసంపత్కరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్థ్వముఖాయ హైగ్రీవాయ సకలజన వశంకరాయ స్వాహా! ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః; అనుష్టుప్చందః; పంచముఖ వీరహనుమాన్ దేవతా! హనుమా నీతి బీజం' వాయుపుత్ర ఇతి శక్తి:' అన్జనీసుట ఇతి కీలకమ్; శ్రీరామదూత హనుమత్ర్పసాద సిద్ధ్యర్దే జపే వినియోగః!!
ఓం అంజనీసుతాయ అంగుష్ఠాభ్యాం నమః!
ఓం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః!
ఓం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః!
ఓం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః!
ఓం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః!
ఓం పంచముఖ హనుమతే కరతల కరపృష్ఠాభ్యాం నమః!
ఏవం హృదయాదిన్యాసః!
పంచముఖహనుమతే స్వాహా ఇతి దిగ్భంధః!
ధ్యానం :-
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం హలం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి వీరాపాహమ్!!
అథ మంత్ర :-
శ్రీరామదూతా యాంజనేయాయ వాయుపుత్రాయ మహాబల పరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహన కారణాయ మహాబల ప్రచండాయ ఫల్గుణసఖాయ కోలాహల సకల బ్రహ్మాండ విశ్వరూపాయ సప్తసముద్ర నిర్లంఘనాయ పింగళ నాయనా యామితవిక్రమాయ సూర్యబింబ ఫలసేవనాయ దుష్టనివారణాయ దృష్టి నిరాలంకృతాయ సంజీవినీ సంజీవి తాంగద లక్ష్మణ మహాకపిసైన్య ప్రాణదాయ దశకంఠ విధ్వంసనాయ రామేష్టాయ మహాఫల్గుణసఖాయ సీతాసహిత రామ వరప్రదాయ, షట్ప్రయోగాగమ పంచముఖ వీర హనుమన్మంత్రజపే వినియోగః!!
ఓం హరిమర్కట మర్కటాయ బం బం బం బం బం వౌషట్ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ఫం ఫం ఫం ఫం ఫం ఫం ఫట్ స్వాహా!
హరిమర్కట మర్కటాయ ఖేం ఖేం ఖేం ఖేం ఖేం మారణాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ లుం లుం లుం లుం లుం ఆకర్షిత సకలసంపత్కరాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ధం ధం ధం ధం ధం శత్రుస్తంభనాయ స్వాహా!
ఓం టం టం టం టం టం కూర్మమూర్తయే పంచముఖ వీరహనుమతే పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా!
ఓం కం ఖం గం ఘం జం చం ఛం జం ఝం ఇం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం స్వాహా! ఇతి దిగ్బందః!
ఓం పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే టం టం టం టం టం సకలశత్రు సంహారణాయ స్వాహా! ఓం దక్షిణముఖాయ పంచముఖ హనుమతే కరాలవదనాయ నరసింహాయ ఓం హ్రీం హ్రీం హ్రుం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేత దమనాయ స్వాహా! ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం మం మం మం మం సకలవిష హరాయ స్వాహా! ఓం ఉత్తరాముఖాయదివరహాయ లం లం లం లం లం నృసింహాయ నీలకంఠమూర్తయే పంచముఖ హనుమతే స్వాహా! ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుం రుం రుం రుం రుం రుద్రమూర్తయే సకల ప్రయోజన నిర్వాహకాయ స్వాహా! ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోక నివారణాయ శ్రీరామచంద్ర కృపాపాదుకాయ మహావీర్య ప్రమథనాయ బ్రహ్మాండనాథాయ కామదాయ పంచముఖ వీరహనుమతే స్వాహా! భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకినీ డాకిన్యన్తరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా! సకల ప్రయోజన నిర్వాహకాయ పంచముఖ వీరహనుమతే శ్రీరామచంద్ర వరప్రసాదాయ జం జం జం జం జం స్వాహా!

ఇతి శ్రీ సుదర్శనసంహితాయాం శ్రీరామచంద్ర సీతాప్రోక్తం శ్రీ పంచముఖ హనుమత్కవచం సంపూర్ణమ్!!

అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు

అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.

శ‌ర‌న్నవ‌రాత్రుల్లో అమ్మవారు.. ఈరోజు.. అన్నపూర్ణ దేవిగా ద‌ర్శన‌మిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ త‌ల్లిగా కుటుంబంలో మ‌హిళ‌కు ఉండే పాత్రను చాటిచెప్పే అవ‌తారం.. అన్నపూర్ణ‌.. ఆక‌లితో ఉన్న వారెవ‌రికైనా అన్నం పెట్టి ఆద‌రించమ‌నే సందేశము…అమ్మవారు మన‌కు ఇస్తుంది. కుటుంబంలో త‌ల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతార‌ము మ‌న‌కు బోద‌ప‌డేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.

సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.

అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.

దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.
‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.
‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.

దీపావళినాడు కాశీక్షేత్రంలో అన్నపూరాణ దేవిని, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది.అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి
 .

Photo: అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.

శ‌ర‌న్నవ‌రాత్రుల్లో అమ్మవారు.. ఈరోజు.. అన్నపూర్ణ దేవిగా ద‌ర్శన‌మిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ త‌ల్లిగా కుటుంబంలో మ‌హిళ‌కు ఉండే పాత్రను చాటిచెప్పే అవ‌తారం.. అన్నపూర్ణ‌.. ఆక‌లితో ఉన్న వారెవ‌రికైనా అన్నం పెట్టి ఆద‌రించమ‌నే సందేశము…అమ్మవారు మన‌కు ఇస్తుంది. కుటుంబంలో త‌ల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతార‌ము మ‌న‌కు బోద‌ప‌డేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.

సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.

అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.

దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.
‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.
‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.

దీపావళినాడు కాశీక్షేత్రంలో అన్నపూరాణ దేవిని, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది.అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి

కర్మలంటే ఏమిటీ

'కర్మ అంటే మరేదో కాదు విద్యుక్త ధర్మకు కర్మ అది శుచియై, పవిత్రమై ఉంటుంది. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. ఈ ధర్మాలు ఆయా వర్ణాలకు విడిగా ఉంటాయి. కాబట్టి వారి విధులు, మరొక వర్ణానికి, తేడా వర్గానికి, తప్పని తోచవచ్చు. ఉదా. క్షత్రియుడు, పాలకుడిగా, ప్రజాసంరక్షణ ధ్యేయంతో శత్రువు లను చంపవచ్చు ఇది దోషం కాదు. విద్యుక్త ధర్మమే అవుతుంది. వీటినే ధర్మసూక్ష్మాలుగా భావించాలి. కర్మలు విధిని ధిక్కరించలేవు. వాటి స్వాధీనంలోనే ఉంటాయి. విధి భగవంతుని నిర్ణయం. అయితే తెలిసి, తెలిసి విషితత్త్వాలు ధిక్కరించేవారు మాత్రం దోషులే!

విహిత కర్మలంటే
ప్రాచీనులు వర్ణవ్యవస్థలో ఆయా వర్ణాలకు కొన్ని విహిత కర్మలు నిర్ణయించినారు. వారు సామాజిక సంఘటిత స్వరూపం కాపాడమనే ఈ వ్యవస్థ నేడు కులాలలో ఎబిసిడి అని ఏర్పాటు చేసి నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అనేది తదాచర కాలంలో మరింత స్వార్థబుద్ధితో కల్పించినవే. అందరికి సమాన అవకాశాలు కల్పించటం నేటి ప్రభుత్వాల విధి. ఒకవిధంగా ఇది ప్రభుత్వ విషిత కర్మనే అవు తుంది.

బ్రాహ్మణులతో యజ్ఞయాగాది క్రతువులు, విహిత కర్మలు, క్షత్రియులకు, యుద్ధాలు చేయుట, దుష్టశిక్షణ, శిష్టరక్షణ విహితకర్మలు. ఈవిధంగా మిగతా వర్ణాలకు విహిత కర్మలు న్నాయి. వీటన్నింటిని ధర్మం తప్పక అనుభవంలో పెట్టాలన్న భగవంతుడు, తాను మాత్రం అందరికి సమానుడు అని చాటాడు. భగవంతుడే సృష్టికర్త. అతన్నిసృజించి తరించటం విషయంలో అందరూ సమానమే. అందుకే మానవులందరిని సంభో దిస్తూ ఈ శ్లోకం చెప్పాడు.

శ్లోః యతః ప్రవృత్తి దూతానం మేన సర్వమిదం తతమ్‌, స్మకర్మణాః తమభ్యర్చ్యసిద్ధిం విదంతి మానవః -మోక్షసద్వినియోగం

అని సమస్త సృజనాధిపతి అయిన ఆ దేవదేవుని స్వాభావిక ధర్మ, కార్యాచరణ ద్వారా పూజించి, మానవులు తరించుచున్నారు. అని అన్ని వర్ణాల, వర్గాల ప్రజలు దేవుని పూజించి, తనలో ఏకం కావచ్చునన్నాడు.

అంటే, మానవజాతిలోగాని, వర్ణవర్గాల్లో గాని, ఏవిధమైన విచక్షణ, లేదా భిన్న త్వం కానీ లేదని సూచించినట్టే కదా. కర్మలలో భిన్నత్వం సామాజిక ధర్మాల విభజనకు మాత్రమేనని, ఆయా కర్మలు వారివారి స్వాభావిక క్రియలు మాత్రమే అని తనని చేరటానికి ప్రతిబంధకం కాదు అని స్పష్టం చేసాడు

శని త్రయోదశి

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదమూడవ తిథి త్రయోదశి. అధి దేవత - మన్మధుడు. నెలకు రెండు త్రయోదశి లుంటాయి . సంత్సరానికి 12 త్రయోదశి లు . అధిక మాసము ఉన్న సంవత్సరాన్నికి 14 త్రయోదశి లు ఉంటాయి. ఇందులో కొన్ని త్రయోదశి లకు హిందువులలో విశిస్టమైన ప్రాధాన్యత ఉంది .

ప్రతి మానవుడు, ప్రతి జీవి శని ప్రభావానికి లోనవ్వనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. శనికి ఇష్టమైన రోజు శనివారం, అలాగే తిథి త్రయోదశి కలిసినందున శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ఈ శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు.

శనిత్రయోదశి : ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ఈ శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు.

ధన త్రయోదశి-- ఆశ్వీయుజ బహుళ త్రయోదశి -ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు
ప్రదోషం.
నేడు (శుక్రవారం) ప్రదోషం. పరమేశ్వరునికి ప్రీతికరమైన ఈ రోజున ప్రదోష కాలంలో లక్ష్మీపూజ చేయడం ఐశ్వర్యప్రదమని పండితులు అంటున్నారు. శుక్రవారం పూట వచ్చే ప్రదోషానికి మహిమ ఎక్కువని, ఈ రోజున ముత్తైదువులు, కన్యలు దీపాలను వెలిగించి, లక్ష్మీనారాయణ స్మరణ చేయాలి.

అంతేగాకుండా ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం.

అందుచేత శుక్రవారం వచ్చే ప్రదోష కాలంలో శుచిగా స్నానమాచరించి, ఉపవాసముండి పరమేశ్వరుని దర్శించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.
 
అంశుమంతుడు(సూర్యుడు)

భగవాన్ నామము స్మరించు. దానివల్ల సమస్త పాపాలు , కామ క్రోధాలు నిర్మూలమవుతాయి . భాగవన్నామము , భగవంతుడు వేరుకావు . చేతులను చరుస్తూ ఉదయం , సాయంకాలమున హరి(హర)నామ సంకీర్తన చేయండి . మీ పాపాలు , బాధలన్నీ మిమ్మల్ని వదిలి పలాయనమౌతాయి . చెట్టుక్రింద నిలబడి చప్పట్లు కొడితే చెట్టుమీది పక్షలు ఎగిరిపోతాయికదా. చప్పట్లు కొడుతూ హరి (హర) నామము చేస్తే మీ శరీరం అనే చెట్టునుండి పాపాలనే పక్షులు ఎగిరి పోతాయి .
- శ్రీ రామకృష్ణ పరమహంస .

శాస్త్రపరిజ్ఞానము అంతగా అభివృద్ధి చిందని పూర్వకాలములో ద్వాపరయుగాంతములో వేదవ్యాసుడు సూర్యుని దేవుని గా బావించమని జనులను ఉద్భోదించాడు అని అనుకోవచ్చును . . నిత్యజీవతం లో మానవునికి ఉపయోగపడే ప్రతిదీ భవవాన్‌ స్వరూపమనే భోదించాడు . భగవంతునకు భక్తునకు ఉన్న సంభందం . అలా అన్ని ఆరోగ్య సూత్రాలు ఆద్యాత్మికం గా లింక్ పెట్టి భోదించాడని ఇక్కడ గ్రహించాలి .
మార్గశిర మాసం లో అంశుమంతుడనే సూర్యుడు తన రధం లో సంచరిస్తూ ఉంటాడు . కశ్యపమహర్షి , ఊర్వశి అనే అప్సరస , రుతసేనుడనే గంధర్వుడు , మహాశంఖమనే సర్పం , తారక్ష్యుడు అనే యక్షుడు , విద్యుచ్చత్రువు అనే రాక్షసుడు , ఆయన వెంట ఉంటారు . ఆయన చీకట్లను పారద్రోలడం లో , శత్రువులను సంహరించడం లో సమర్ధుడు , సకల జగత్తుకు శుభప్రదుడు . మునీశ్వరులు ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు . అటువంటి అంశుమంతుడు అనే ఈ ఆదిత్యుడు తొమ్మిదివేల కిరణాలతో శోభిల్లుతూ ఆకుపచ్చ వర్ణంతో ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి .

ఒక సారి వైశంపాయనుడు వ్యాసమహర్షి ని ఈ విధం గా అడిగాడు ... ఓ మహర్షి ! ప్రతి రోజు ఆకాశం లో ఉదయించే ఆ తేజశ్శాలి ఎవరు? దేవతలు , మహర్షులు సిద్ధులు , మానవులంతా ఆ మహాపురుషుని ఆరాధిస్తూ ఉన్నారు ఆయన గురించి చెప్పండి .. అని అడుగగా ఈ విధం గా వివరించారు .

" ఓ వైశంపాయనా ! యితడు బ్రహ్మ స్వరూపం నుండి ఉద్భవించాడు . ఉత్స్క్రుస్తమైన బ్రహం తేజోరూపుడు . సాక్షాత్ బ్రహ్మమయుడే . ఈ భగవానుడు ధర్మ , అర్ధ , కామ , మోక్షము అనే నాలుగు పురుశార్ధఫలాలనిస్తాడు . ఇదే సూర్యుని యొక్క సత్యమయ స్వరూపము . లోకములయోక్క ఉత్పత్తి , పాలన ఈయన వల్లే జరుగుతాయి . ఈయన లోకరక్షకుడు . ద్విజులు మొదలైనవారు ఈ మహాత్ముని ఆరాధించి మోక్షాన్ని పొందుతారు .

సంద్యోపాసన సమయం లో బ్రహ్మవేత్తలైన బ్రాహ్మినులు తమ భుజాలను పైకెత్తి ఈ దివ్యపురుశున్నే సేవిస్తారు . ఈయన్ని ఆరాదిస్తే సమస్త దేవతలను ఆరాదిన్చినట్లే .సూర్యమండలం లో ఉన్న సాధ్యదేవిని పపాసిన్చిద్విజులంతా స్వర్గాన్ని , మోక్షాన్ని పొందుతున్నారు . సుర్యోపాసన వలనే మనుష్యులు రోగాలనుంచి విముక్తులవుతున్నారు . ఈ స్వామిని పుజించేవారికి ఎన్నడు అంధత్వము దారిద్రియము , దు:ఖము , శోకాలు కలుగవు అని తెలియజేషారు వ్యాసమహర్షి .

సూర్యుడు ఆధునిక శాస్త్రము :
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడు హైడ్రోజన్ మరియు హీలియం లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరకుటుంబం లోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి

సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఎందుకు?

సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు . అసలు సూర్యుడు అంత ఎర్రగా ఎందుకుంటాడో ఇప్పుడు తెలుసుకుందాం.!
భూమి వాతావరణంలో సూర్యుడి కిరణాలు మన కంటికి చేరేంతదాకా అవి ప్రయాణించే దూరాలు మారుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాలు మన కంటికి చేరేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాలి. దూరంగా భూమి, ఆకాశం కలసినట్లు కనిపించే క్షితిజ రేఖకు దగ్గరగా సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయాల్లో దగ్గరగా ఉండటం వల్లనే సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.

అదే మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు మన నడినెత్తిపైన ఉన్నప్పుడు కిరణాలు తక్కువ దూరంపాటు ప్రయాణించి మన కంటిని చేరుతాయి. అలాంటి సమయాల్లో సూర్యుడి రంగు మామూలుగానే ఉంటుంది. అయితే... వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, తక్కువగా చెదిరిపోయే ఎరుపు రంగు మన కంటికి ఎక్కువగా చేరుకోవడం వల్ల... సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు.

ఆదర్శ ప్రత్యక్ష దైవం... సూర్యభగవానుడు
ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందుతుంటారని తెలిపే కథాంశం మత్స్యపురాణంలో కనిపిస్తుంది. ఈ కథాంశంలో సూర్యుడు తన శక్తినే చంద్రుడికిచ్చి అతని వల్ల లోకాలన్నింటికీ మేలు చేయిస్తుంటాడనే ఖగోళ సంబంధమైన శాస్త్ర విషయం ఇమిడి ఉంది. సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. ఆ అమృతమే చంద్రుడిలో కళాక్షయ రూపంలో కనిపిస్తుంటుంది. అమృతాన్ని తాగటం వల్ల దేవతలకు కలిగే తృప్తి పదిహేను రోజులపాటు మాత్రమే ఉంటుంది. మనిషి మిగిలిన కాలంలో స్వాహాకారాలతో దేవతలను, స్వధాకారాలతో పితృదేవతలను తృప్తి పరచాల్సి ఉంటుంది. దీనికోసం అన్నం అవసరం అవుతుంది. యజ్ఞం చేసేటప్పుడు స్వాహా అని మంత్రాలకు చివర పలకటం, పితృదేవతలకు సమర్పించేటప్పుడు స్వధా అని మంత్రాల చివర పలకటం వల్ల యజ్ఞ సమయంలో కుండంలో నుంచి హవ్యం దేవతలకు, కవ్యం పితృదేవతలకు చేరుతుంటుంది. సూర్యుడు భూమి మీద అన్నానికి సంబంధించిన పంటలు పండించటానికి తన కిరణాలను ప్రసరింపచేసి ధాన్యం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంటాడు. ఈ కారణం వల్లే సూర్యుడు దేవతలకు, పితృదేవతలకు, మనుషులకు ఆరాధ్యుడవుతున్నాడు. సూర్యుడు తన కిరణాల్లో నిలుపుకొన్న దేవ, పితృ, మనుష ఆహార జన్యతృప్తే సూర్య రథానికి ఉన్న చక్రం అని చెబుతారు. ఆ చక్ర శక్తి వల్లే సకల సృష్టి చైతన్యం ప్రాప్తిస్తోంది. సూర్యుడు పచ్చని గుర్రాలను పూన్చిన రథంలో ప్రయాణిస్తుంటాడు. ఈ పచ్చదనం లోకకల్యాణ సూచకం. దినస్పతి అని కీర్తిని అందుకుంటున్న సూర్యుడు అహోరాత్రులు తన ఏక చక్ర రథంపై సప్త ద్వీప సమస్త సముద్ర ఘటికమైన ఈ పృథ్వీ చక్రాన్ని అంతటిని చుట్టి వస్తుంటాడు. ఆయన అధిరోహించిన రథానికున్న గుర్రాలు సప్త ఛందోరూపాలుగా ఉంటాయి. సూర్యుడి సంకల్పాన్ని అనుసరించి కామరూపంతో, కామగమనంతో ఆ గుర్రాలు మనోవేగంతో ప్రయాణిస్తాయి. ఒకసారి రథానికి పూన్చితే మళ్లీ మళ్లీ ఆ గుర్రాలను విప్పటం, పూన్చటం చేయాల్సిన పని ఉండదు. నిరంతరం అవి అవిశ్రాంతంగా లోకకల్యాణం కోసం సూర్యభగవానుడితో పాటు సంచరిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ గుర్రాలు కొద్దిగా ఎర్రడాలు రంగుతో కనిపిస్తాయి. ఎన్ని యుగాలు గడిచినా ఈ గుర్రాల్లో మాత్రం మార్పు ఉండదు. వాటికి వేద విజ్ఞానం అంతా అవగతమై ఉంటుంది. సృష్టిలో కర్మఫలాలను అనుసరించి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వారికి ఎలాంటి మేలు చేసిపెట్టాలో వాటికి తెలిసి ఉంటుంది. ఈ గుర్రాల్ని కల్పం ప్రారంభంలో ఒకసారి పూన్చితే మళ్ళీ కల్పాంతంలో మహాప్రళయం సంభవించే వరకూ అవి అలా సూర్యరథాన్ని మోసుకుని పోతూనే ఉంటాయి. సూర్యుడు తన కిరణాల శక్తికి మారు రూపాలైన వాలఖిల్యులు అనే చేతి బొటనవేలు అంత పరిమాణంలో ఉండే రుషులు తన వెంట నడుస్తుండగా ఆ వెనుక మిగిలిన మహర్షులంతా వేద మంత్రాలను స్తుతిస్తుండగా గంధర్వ, అప్సరస గణాలు గీత, నృత్యాలతో సేవిస్తుండగా తన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు. ఆ ప్రయాణమంతా ఓ అద్భుత సుందర దృశ్యంగా ఉంటుంది. ఈ సూర్యుడి ప్రయాణ క్రమాన్ని వివరించి చెప్పటంలో ఒక అవిశ్రాంత సేవాతత్వం భగవానుడిలో ఇమిడి ఉందని తెలిపే ఈ కథాంశం ఆవిర్భావ లక్ష్యం. భగవంతుడిని ఆరాధించేవారు ఆయనలానే అలా నిరంతరం సేవాదృక్పథంతో ముందుకు నడవాలని చెప్పటం ఈ కథాంశంలో కనిపించే సందేశం.

సూర్యుని ఎందుకు ఆరాధించాలి?

భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియ మానికీ, ఆరోగ్యానికీ, వికాసా నికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.

-ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచ మంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సేర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సేర్యుడు దక్షినాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండి వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన.

పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందన డానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మును లకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.

-వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహా నికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యా త్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు.

సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.

ఋషూలు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమ స్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకో వడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.

-సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు.సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి . సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది.

మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం.

ధనుర్మాసము

(డిసెంబర్ 16, 2014, మంగళవారం)
విష్ణువుకి ప్రియం ధనుర్మాసం . సంక్రాంతి నెల ఆరంభం .

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము" . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు .

ధనుర్మాసం అంటే
ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట .
ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు .
ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం .
ధనుర్మాసం అరంబాన్నే పల్లెటూర్లలొ "సంక్రాంతి "నెల పట్టడము అంటారు .ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ,జంగమ దేవర లతో ,గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ ,సందడిగా వుంటుంది . ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గుల తో కనుల విందు గా వుంటాయి .ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు "సంక్రాంతి "పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి .

Photo: ధనుర్మాసము 

అర్జునుని పది పేర్లు - విరాట పర్వం

అర్జునునికి అర్జున, ఫల్గుణ, జిష్ణు, కిరీటి, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, చనంజయులు అని పది పేర్లు.
ధనంజయుడు - దేశాలన్నీ జయించి ధనం పన్నుగ స్వీకరించి తెచ్చి ఆ ధనం మధ్యలో వుంటాడు కనుక ధనంజయుడు.
విజయుడు - యుద్ధంలో యుద్ధోన్మత్తులైన వారిని ఎదుర్కొనటానికి వెళ్ళి విజయం పొందకుండా తిరిగి రాడు కనుక వీరులకు విజయుడిగా తెలుసు.
శ్వేతవాహనుడు - యుద్ధానికి సిద్ధమయ్యే అర్జునుని రథానికి తెల్లని గుర్రాలు కనపడతాయి. కాబట్టి శ్వేతవాహనుడు.
ఫల్గుణుడు - హిమాలయ శిఖరం మీద ఉత్తర ఫల్గుణీ నక్షత్రం రోజున పగటివేళ పుట్టాడు కాబట్టి ఫల్గుణుడు.
కిరీటి - రాక్షసవీరులతో తలపడ్డప్పుడ్ సూర్యకాంతిని విరజిమ్మే కిరీటాన్ని ఇంద్రుడు అర్జునుని తలపై వుంచాడు. అందువల్ల కిరీటి అని పిలువబడుతున్నాడు.
బీభత్సు - "న కుర్యాం కర్మ బీభత్సం యుధ్యమానః కథంచన!
తేన దేవ మనుష్యేషు బీభత్సురితి విశ్రుతః!!"
యుద్ధం చేసే వేళ ఎట్టి పరిస్థితులలోను, ఏవగింపు కలిగించే పని చేయడు కాబట్టి దేవమానులందరిలో బీభత్సుడిగా ప్రసిద్ధుడయ్యాడు.
సవ్యసాచి: "ఉభౌ మే దక్షిణౌ పాణీ గాండీవస్య వికర్షణే
తేన దేవమనుష్యేషు సవ్యసాచీతి మాం విదుః!!
గాండీవాన్ని ఎక్కుపెట్టడానికి కుడి ఎడమ చేతులు రెండూ సమర్థత కలిగి వున్నాయి కాబట్టి దేవమానవులలో సవ్యసాచి అని పిలుస్తారు.
అర్జునుడు - సముద్రం దాకా నేల నాలుగు చెరగులా అర్జునుని శరీరకాంతి వేరెవ్వరికీ లేదు. అందరిపట్ల సమభావంతో వుంటాడు. పరిశుద్ధమైన పనినే ఆచరిస్తాడు. ఈ కారణాల వల్ల విజ్ఞులు అర్జునుడుగా ఎరుగుదురు.
జిష్ణువు - అర్జునుని పట్టుకోవడం, ఓడించడం చాలా కష్టం. ఇంద్రుడి కొడుకైన అర్జునుడు శత్రువులను అణచి, విజయాన్ని పొందే వీరుడు కాబట్టి దేవమానవులలో జిష్ణువుగా ప్రసిద్ధుడయ్యాడు.

కృష్ణ - నల్లగా మెరుస్తున్న దేహకాంతి కలిగి పసితనంలో మనసునాకట్టుకొనే రీతిలో ఉండడం చేత తండ్రి కృష్ణ అని పేరు పెట్టాడు.
Photo: అర్జునుని పది పేర్లు - విరాట పర్వం అర్జునునికి అర్జున, ఫల్గుణ, జిష్ణు, కిరీటి, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, చనంజయులు అని పది పేర్లు. ధనంజయుడు - దేశాలన్నీ జయించి ధనం పన్నుగ స్వీకరించి తెచ్చి ఆ ధనం మధ్యలో వుంటాడు కనుక ధనంజయుడు. విజయుడు - యుద్ధంలో యుద్ధోన్మత్తులైన వారిని ఎదుర్కొనటానికి వెళ్ళి విజయం పొందకుండా తిరిగి రాడు కనుక వీరులకు విజయుడిగా తెలుసు. శ్వేతవాహనుడు - యుద్ధానికి సిద్ధమయ్యే అర్జునుని రథానికి తెల్లని గుర్రాలు కనపడతాయి. కాబట్టి శ్వేతవాహనుడు. ఫల్గుణుడు - హిమాలయ శిఖరం మీద ఉత్తర ఫల్గుణీ నక్షత్రం రోజున పగటివేళ పుట్టాడు కాబట్టి ఫల్గుణుడు. కిరీటి - రాక్షసవీరులతో తలపడ్డప్పుడ్ సూర్యకాంతిని విరజిమ్మే కిరీటాన్ని ఇంద్రుడు అర్జునుని తలపై వుంచాడు. అందువల్ల కిరీటి అని పిలువబడుతున్నాడు. బీభత్సు - "న కుర్యాం కర్మ బీభత్సం యుధ్యమానః కథంచన! తేన దేవ మనుష్యేషు బీభత్సురితి విశ్రుతః!!" యుద్ధం చేసే వేళ ఎట్టి పరిస్థితులలోను, ఏవగింపు కలిగించే పని చేయడు కాబట్టి దేవమానులందరిలో బీభత్సుడిగా ప్రసిద్ధుడయ్యాడు. సవ్యసాచి: "ఉభౌ మే దక్షిణౌ పాణీ గాండీవస్య వికర్షణే తేన దేవమనుష్యేషు సవ్యసాచీతి మాం విదుః!! గాండీవాన్ని ఎక్కుపెట్టడానికి కుడి ఎడమ చేతులు రెండూ సమర్థత కలిగి వున్నాయి కాబట్టి దేవమానవులలో సవ్యసాచి అని పిలుస్తారు. అర్జునుడు - సముద్రం దాకా నేల నాలుగు చెరగులా అర్జునుని శరీరకాంతి వేరెవ్వరికీ లేదు. అందరిపట్ల సమభావంతో వుంటాడు. పరిశుద్ధమైన పనినే ఆచరిస్తాడు. ఈ కారణాల వల్ల విజ్ఞులు అర్జునుడుగా ఎరుగుదురు. జిష్ణువు - అర్జునుని పట్టుకోవడం, ఓడించడం చాలా కష్టం. ఇంద్రుడి కొడుకైన అర్జునుడు శత్రువులను అణచి, విజయాన్ని పొందే వీరుడు కాబట్టి దేవమానవులలో జిష్ణువుగా ప్రసిద్ధుడయ్యాడు. కృష్ణ - నల్లగా మెరుస్తున్న దేహకాంతి కలిగి పసితనంలో మనసునాకట్టుకొనే రీతిలో ఉండడం చేత తండ్రి కృష్ణ అని పేరు పెట్టాడు.

తిరుప్పావై మొదటి పాశురము:

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్

కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్

ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం

కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱైతరువాన్

పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .

మాసములన్నింటిలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవంతుడు చెప్పియున్నాడు. మార్గశిర మాసమనగా మనం అవలంభించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము. శ్రీకృష్ణుడనే చెట్టు నీడ ఎక్కువ చల్లగానూ వేడిగానూ ఉండదు. అలాగే వాసుదేవ స్వరూపమైన మార్గశిరమాసం కూడా సమశీతోష్ణముగా ఉండే కాలం. మనం ఉదయం మేల్కొనే కాలం సత్వగుణసంపన్నమైన బ్రాహ్మి ముహూర్తము. అంతేగాక ఈ మార్గశిర మాసంలో పైరుపంటలన్ని విరగ కాసి పండి ఉంటాయి. అతి మనోహరమైన వెన్నెలలు వెదజల్లే శుక్లపక్షంలో పవిత్రమైన రోజున ఈ వ్రతం ప్రారంభించినామని కాలాన్ని ప్రశంసించుట ఇందులోని అర్ధము. భగవంతుని సమాగమమును కోరుకుని ఆతని సంతోషపరచడానికి అతనికిష్టమైన పనులు చేయడానికి ఇది ఉత్తమోత్తమైన సమయమని చెలికత్తెలను మేల్కొని స్నానము చేసి, రండని పిలుస్తూ “ప్రకృతి మండలమందు ఆనందము అనుభవించేవారలారా” అని ఆండాళ్ సంబోధించింది. ఈ పిలుపులో ఒక మహత్తరమైన భావముంది. పరమపదమున నివసించుటకంటే ప్రకృతిమండలమైన గోకులంలో నివసించుట అంటే ఆ భగవంతునితో కలిసి మెలిసి ఉంటూ మహదానందము అనుభవించే మహాద్భాగ్యం లభిస్తుంది అని ఆమె నమ్మిక..
 Photo: తిరుప్పావై మొదటి పాశురము:

తిరుప్పావై

తిరుప్పావై – ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గమిది. తిరు అంటే శ్రీ అని అర్థం. పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరుమోసిన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతము.

తిరుప్పావై లో 30 పాశురములు ఉంటాయి. పాశురము అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలని అర్ధం. ఆండాళ్ లోని ఈ భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా మనకు అందించారు, తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలున్నాయి. వేకువజామున నిద్రలేచి స్నానం చేయడం, స్వామి కీర్తనలను, ప్రతిరోజూ క్రమం తప్పకుండా తిరుప్పావై పాశురములను పాడడం, పేదలకు దానములు, పండితులకు సన్మానము చేయడం, స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యము చేయడం, ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించడం మొదలైనవి పాటించాలి.

ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరు పెట్టగా, అది క్రమంగా గోదాగా మారింది.. అటువంటి గోదాదేవి రచించిన 30 పాశురాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచిగా జీవించమని, తోటివారికి సాయపడమని, భగవదారాధన తప్పనిసరిగా చేయమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి.

తమకు మంచి భర్త లభించాలని కోరుకుంటూ కన్నెపిల్లలు చేసే వ్రతాలలో తిరుప్పావై వ్రతం ఒకటి....ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక.. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావై పాశురాలను గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి; దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయి. " అని గోదాదేవి విన్నవిస్తుంది. తరువాతి పది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి మరియు ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు. చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.
 Photo: తిరుప్పావై – ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గమిది. తిరు అంటే శ్రీ అని అర్థం. పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరుమోసిన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతము.

తిరుప్పావై లో 30 పాశురములు ఉంటాయి. పాశురము అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలని అర్ధం. ఆండాళ్ లోని ఈ భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా మనకు అందించారు, తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలున్నాయి. వేకువజామున నిద్రలేచి స్నానం చేయడం, స్వామి కీర్తనలను, ప్రతిరోజూ క్రమం తప్పకుండా తిరుప్పావై పాశురములను పాడడం, పేదలకు దానములు, పండితులకు సన్మానము చేయడం, స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యము చేయడం, ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించడం మొదలైనవి పాటించాలి.

ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరు పెట్టగా, అది క్రమంగా గోదాగా మారింది.. అటువంటి గోదాదేవి రచించిన 30 పాశురాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచిగా జీవించమని, తోటివారికి సాయపడమని, భగవదారాధన తప్పనిసరిగా చేయమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి.

తమకు మంచి భర్త లభించాలని కోరుకుంటూ కన్నెపిల్లలు చేసే వ్రతాలలో తిరుప్పావై వ్రతం ఒకటి....ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక.. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావై పాశురాలను గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి; దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయి. " అని గోదాదేవి విన్నవిస్తుంది. తరువాతి పది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి మరియు ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు. చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.

హిమాలయాల్లో దాగిన కొన్ని అద్భుతాలలో ఈ ఆలయం కూడా ఒకటి..

చరిత్ర పుటలలో ఎక్కడా ఈ ఆలయ ప్రస్థావన లేదు.. హిమాలయాలలోని ధర్మశాల దగ్గర కాంగ్రా లోయలో వజ్రేశ్వరీ దేవి ఆలయమిది..
క్రీ.శ.1009 లో ఘజనీ మహమ్మద్ దండ యాత్రలో కూడా ఈ ఆలయం చెక్కు చెదరలేదు.. కానీ 4 April 1905 న సంభవించిన భూకంపం ఈ ఆలయానికి తీరని నష్టం చేకూర్చింది.. వాస్తవంగా ఈ ఆలయం కటోచ్ రాజపుత్రుల కు సంబంధించిన త్రిగర్త/నాగర్ కోట్ అనే కోటలో ఉండేది.. కానీ భూకంప ప్రభావం వలన ఆరోజుల్లోనే దాదాపు ఇరవై వేల మంది చని పోయారట.. చివరికి మొత్తం సంస్థానం ధర్మశాలకు మారారని కథనం.
పూర్తిగా రాతి తో చెక్కబడిన ఈ ఆలయ సమూహం దూరం నుండి చూస్తే పిరమిడ్లు క్రుప్ప పోసినట్లుగా ఉంటాయట..
వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ప్రదేశానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది

పాపికొండలు

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉన్నది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.