వామనుడు

వామనుడు మన పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం.
వామనుడు అదితి కి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తినిపాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు.దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడి పోయిన బలి, రాక్షస గురువైన శుక్రాచార్యుల దయ వలన బ్రతికి, గురూపదేశంతో విశ్వజిత్‌యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయతూణీరములు, కవచము, శంఖములు పొందుతాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమణిచేందుకు, రాక్షసులనందరినీ ఒకచోటచేర్చి, యుద్ధమునకు సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తుతాడు. ఆ దుర్భర దానవ శంఖా విర్భూత ధ్వనులు నిండి, విభుదేంద్ర వధూగర్భములు పగిలి, లోపలి శిశువులు ఆవురని ఆక్రోశించుచుండ, దేవతలు బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు.
ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన
పదనఖ నీరజ నతజన పావన
కేశవ ధృత వామన రూప జయ జగదీశహరే -- జయదేవుని దశావతార స్తోత్రము
ఈ వామనావతార గాథను విన్న వారు, చదివిన వారు సకల శుభాలను పొందుతారు. దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించుకుంటారో వారికి నిత్య సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి.

చిత్రం: వామనుడు మన పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం.
వామనుడు అదితి కి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు.దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడి పోయిన బలి, రాక్షస గురువైన శుక్రాచార్యుల దయ వలన బ్రతికి, గురూపదేశంతో విశ్వజిత్‌యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయతూణీరములు, కవచము, శంఖములు పొందుతాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమణిచేందుకు, రాక్షసులనందరినీ ఒకచోటచేర్చి, యుద్ధమునకు సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తుతాడు. ఆ దుర్భర దానవ శంఖా విర్భూత ధ్వనులు నిండి, విభుదేంద్ర వధూగర్భములు పగిలి, లోపలి శిశువులు ఆవురని ఆక్రోశించుచుండ, దేవతలు బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు.
ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన
పదనఖ నీరజ నతజన పావన
కేశవ ధృత వామన రూప జయ జగదీశహరే -- జయదేవుని దశావతార స్తోత్రము
ఈ వామనావతార గాథను విన్న వారు, చదివిన వారు సకల శుభాలను పొందుతారు. దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించుకుంటారో వారికి నిత్య సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి.

No comments:

Post a Comment