దుర్లభం సర్వజన్తూనాం దేవీపూజా ఫలాధికా
దుర్గాలకీ మహాదేవ్య: పూజనీయా: ప్రయత్నత:
ఆశ్వయుజాస్మి సంప్రాపె్తై ప్రతిపచ్చుభవాసరే
తదారభ్య ప్రయత్నేన నవరాత్రి పూజయేత్
శరన్నవరాత్రులలో దేవికి చేసే పూజ ఎంతో పుణ్య ఫలాన్నిస్తుంది. ఈ రోజుల్లో అమ్మ వారికి పూజ చేసే అవకాశం ఎంతో పుణాత్ములకు మాత్రమే దక్కుతుంది.
ఆశ్వయుజ శుద్ధ విదియనాడు, అమ్మవారిని శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. విదియనాడు బాలాత్రిపుర సుందరిని క్రింది శ్లోకంతో ధ్యానించాలి
అరుణ రణజాలై రంజితాసావకాశా
విధృత జపపుటీకా పుస్తకా భీతిహస్తా
ఇతరవర కరాఢ్యా పుల్లకల్హర సంస్థా
నివసతుహృదిబాలా నిత్య కల్యాణశీలా
ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయైనమ:
హ్రీంకారాసన గర్భితానల శిఖాంసౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణా౦బర ధారిణీం వరసుధాదౌతాంత్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాంస్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"
మానవ శరీరమే ‘క్షేత్రం’. ఈ క్షేత్రానికి శక్తి అధిష్ఠాత్రి. క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుణ్ణి కరుణించి కాపాడే తల్లికి క్షయం లేదు, వృద్ధి లేదు. తరగటం, పెరగటం ఉండవు. తరిగిపోయేది శరీరం. క్షీణించేది ‘క్షేత్రం’. క్షేత్రపాలకులందరూ ఆమె విభూతులే. అందుకే అగ్నిజ్వాలలో ఆమె ఉంటుంది. కానీ, భక్తులకు చల్లని సుగంధ పరిమళ గంధాల్ని అందిస్తుంది. మహాప్రళయ జలధిలో వశిస్తుంది. కానీ, సకల వర్షాలనిచ్చి, భక్తులకు అన్నపానీయాలనిచ్చి ఆదుకుంటుంది. నరులను నారాయణులుగా రూపుదిద్దుతుంది. ఆమె తన ఉనికి, విలువను గుర్తించని వితండవాదులను చూచి మందహాసం చేస్తుంది. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపాలకు గురైన సంసారులకు శరత్కాల చంద్రునిలాగా చల్లని వెనె్నలనిచ్చి తాపోపశమనాల్నిచ్చి సుఖసంతోషాలకు, మోక్షానికి మార్గాన్ని చూపుతుంది. ఆమె ఎప్పటికీ పిన్నవయసులోనే దర్శనమిస్తుంది. దార్శనిక శక్తికి మారుపేరు జగన్మాత. ఆ జననే బాలాత్రిపురసుందరి.
దుర్గాలకీ మహాదేవ్య: పూజనీయా: ప్రయత్నత:
ఆశ్వయుజాస్మి సంప్రాపె్తై ప్రతిపచ్చుభవాసరే
తదారభ్య ప్రయత్నేన నవరాత్రి పూజయేత్
శరన్నవరాత్రులలో దేవికి చేసే పూజ ఎంతో పుణ్య ఫలాన్నిస్తుంది. ఈ రోజుల్లో అమ్మ వారికి పూజ చేసే అవకాశం ఎంతో పుణాత్ములకు మాత్రమే దక్కుతుంది.
ఆశ్వయుజ శుద్ధ విదియనాడు, అమ్మవారిని శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. విదియనాడు బాలాత్రిపుర సుందరిని క్రింది శ్లోకంతో ధ్యానించాలి
అరుణ రణజాలై రంజితాసావకాశా
విధృత జపపుటీకా పుస్తకా భీతిహస్తా
ఇతరవర కరాఢ్యా పుల్లకల్హర సంస్థా
నివసతుహృదిబాలా నిత్య కల్యాణశీలా
ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయైనమ:
హ్రీంకారాసన గర్భితానల శిఖాంసౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణా౦బర ధారిణీం వరసుధాదౌతాంత్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాంస్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"
మానవ శరీరమే ‘క్షేత్రం’. ఈ క్షేత్రానికి శక్తి అధిష్ఠాత్రి. క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుణ్ణి కరుణించి కాపాడే తల్లికి క్షయం లేదు, వృద్ధి లేదు. తరగటం, పెరగటం ఉండవు. తరిగిపోయేది శరీరం. క్షీణించేది ‘క్షేత్రం’. క్షేత్రపాలకులందరూ ఆమె విభూతులే. అందుకే అగ్నిజ్వాలలో ఆమె ఉంటుంది. కానీ, భక్తులకు చల్లని సుగంధ పరిమళ గంధాల్ని అందిస్తుంది. మహాప్రళయ జలధిలో వశిస్తుంది. కానీ, సకల వర్షాలనిచ్చి, భక్తులకు అన్నపానీయాలనిచ్చి ఆదుకుంటుంది. నరులను నారాయణులుగా రూపుదిద్దుతుంది. ఆమె తన ఉనికి, విలువను గుర్తించని వితండవాదులను చూచి మందహాసం చేస్తుంది. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపాలకు గురైన సంసారులకు శరత్కాల చంద్రునిలాగా చల్లని వెనె్నలనిచ్చి తాపోపశమనాల్నిచ్చి సుఖసంతోషాలకు, మోక్షానికి మార్గాన్ని చూపుతుంది. ఆమె ఎప్పటికీ పిన్నవయసులోనే దర్శనమిస్తుంది. దార్శనిక శక్తికి మారుపేరు జగన్మాత. ఆ జననే బాలాత్రిపురసుందరి.
అ- కారం నుంచి ఉద్భవించిన సమస్తవాఙ్మయం- జగన్మాత స్వరూపం. అది అక్షరం- క్షయం లేనిది. తల్లిని అంతర్ముఖంగా ఆరాధించాలి. అప్పుడే తల్లి లీలా విలాసాలు గోచరమవుతాయి. లీలలంటే సేవలు. అంటే తల్లి చూపించే వాత్సల్యం. దుష్టశిక్షణ చేసి, శిష్టరక్షణ చేసే లీలలు. బిడ్డలపట్ల మాతృమూర్తికి ఉండే ఆదరణ. సమస్త వాఙ్మయం మూడు మాత్రల్లో, మూడు వేదాల్లో, మూడు నాదములలో కూడుకొని ఉంటుంది. గుణత్రయం, భువనత్రయం, కాలత్రయం, మూర్తిత్రయం, వేదత్రయం, నాదత్రయం ఇలా అనేక త్రివర్గాలకు నిలయమైన, బృహత్‌త్రయి- త్రిపుర సుందరి. కూటత్రయంలో ప్రాణికోటికి ప్రాణశక్తి ప్రసాదిస్తూ అందరికీ కరావలంబం అనగా చేయూతనిస్తూ, పురత్రయాన్ని పాలించే శక్తి- బాలాత్రిపురసుందరి.
జగన్మాతకు అందరూ సమానమే. ఆమెకు బంధుప్రీతి లేదు. తప్పు చేసినవారిని, వారు ఎవరైనా సరే శిక్షిస్తుంది. అందుకే తండ్రి దక్షుడు చేసిన అధర్మయజ్ఞాన్ని ఆమె నిరసించి అందుకు తానే బలైంది. అదే జగన్మాత ‘త్యాగం’. ఇంత జరిగినా బాలాత్రిపురసుందరి ముఖంలో మందహాసం మాత్రం స్థిరంగానే ఉంది. తనను కొలిచే భక్తులకు కూడా స్థితప్రజ్ఞతను ప్రసాదించి, చిదానందాన్ని పంచి ఇచ్చే చిద్రూపిణి- బాలాత్రిపుర సుందరి. ఆమె ఎప్పుడూ చిన్న వయసులోనే ఉంటుంది. పరమాణు ప్రమాణంలో ఉన్నా, బ్రహ్మాండాన్ని అలుముకున్నా- చీకటిని, చిటికెలో తన చిత్కళతో పారద్రోలి జ్ఞానవెలుగును ప్రసాదించేది- బాలాత్రిపురసుందరి. మూడు పాయలు అనగా త్రికరణములు- మనోవాక్కాయములు, త్రిగుణములు- సత్వ రజస్తమో గుణములు, స్థూల సూక్ష్మ కారణ శరీరమలు, భక్తి జ్ఞాన వైరాగ్యములు- ఇవన్నీ వేరు వేరుగా ఉండక ముప్పేటగా, ప్రేమతో ఒక్కటిగా అల్లుకొన్న ‘త్రిపుటు’లందు ప్రేమయే నిండి ఉంటుంది. ఆ విధమైన ఏకరూపమున అల్లుకొన్న ప్రేమను కరుణించే జగన్మాత - బాలాత్రిపురసుందరి.
అటువంటి జగన్మాత స్వరూపాన్ని ఎవరైనా ‘బాల’గా స్మరించుకుంటే తల్లికి మరింత దగ్గరవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నవరాత్రి పూజలో పది పనె్నండు సంవత్సరముల లోపు వయసు కన్యలను పూజించి వారికి పసుపు కుంకుమలు, నూతన వస్తమ్రులు, ఆభరణములిచ్చి దేవిని ‘బాల’ రూపంగా ఆరాధించి, ఆమె లీలా వినోదాన్ని అనుభవించి, ఆనందించి తరిస్తారు.
భండాసురుని కుమారులు- చతుర్బాహుడు మొదలు ఉపమాయుడు వరకు ముప్పయిమంది రాక్షసులు. వారిని తొమ్మిది సంవత్సరముల వయసుగల బాలాత్రిపుర సుందరీదేవి వధించినది. దార్శనిక విమర్శ శక్తియే బాలాత్రిపుర సుందరి స్వరూపం. మోక్షమునకు ప్రతిబంధకము- ద్వైతవృత్తులు. బాల పూజతో మనలోని ద్వైతవృత్తుల్ని తొలగించుకుంటే ఆత్మానందం కలుగుతుంది. ఇది పంచదశాక్షరీ మంత్రాధిదేవత- త్రిపుర సుందరీ తత్త్వం. ఈ విషయానే్న లలితా సహస్రనామంలోని ‘్భండపుత్రవధోద్యుక్త బాలావిక్రమవందితా’ అన్న నామంలో విశదమవుతుంది.
కుమారస్వామి తారకాసుర సంహారం గావించాడు. తారకాసురుని కుమారులు- తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే త్రిపురాసురులు. వీరు తమ తండ్రి మరణానికి పరితపించి, మరణం లేకుండా వరం పొందాలనే కాంక్షతో బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. ప్రత్యక్షమైన బ్రహ్మను- ఎవరి చేతిలోనూ తమకు మరణం కలగకూడదని వరమిమ్మని కోరారు. పుట్టినవారు గిట్టక తప్పదని, ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకుంటే, ఆ మార్గంలో మరణం సంభవించేటట్లు వరమిస్తానన్నాడు బ్రహ్మ.
త్రిపురాసురులు మూడు పురములు కట్టుకొని, ఆకాశంలో తిరుగుతూ వేయి సంవత్సరములు జీవించిన పిమ్మట, ఆ మూడు పురములు వరుసగా ఒకే చోటికి చేరినప్పుడు ఒకే బాణంతో ఆ పురాల్ని ఛేదించగలిగినవాడి చేతిలో మాత్రమే వారికి మృత్యువు సంభవించేటట్లు వరం కోరుకున్నారు.
తారాక్షుడు బంగారంతోను, విద్యున్మాలి వెండితోను, కమలాక్షుడు ఇనుముతోను మూడు పురాల్ని నిర్మించుకొని, దేవ ఋషి సత్పురుషుల్ని బాధపెట్టసాగారు. వారు శంకరుణ్ణి ఆశ్రయిస్తే- త్రిపురాసుర సంహారానికి అపూర్వ రథము, అపూర్వబాణము కావాలని, వాటిని సంపాదించమని వారికి చెప్పాడు. జగత్తత్త్వంతో రథాన్ని, వేద తత్త్వంతో గుఱ్ఱాన్ని, నాగతత్త్వంతో పగ్గాలను, మేరుశిఖర తత్త్వంతో ధనుస్సును, వాసుకి తత్త్వంతో వింటినారిని, సోమ విష్ణు వాయు తత్త్వాలతో బాణాల్ని తయారుచేసి బ్రహ్మ స్వయంగా సారథి అయ్యాడు. అయినా యుద్ధ్భూమిలో వాటికి ప్రయోజనం సమకూరలేదు. పరమేశ్వరుడు అంతర్ముఖుడై పరతత్త్వాన్ని భావించాడు. త్రిపురములన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. పరమేశ్వరుడు ఒకే బాణంతో త్రిపురాలను ఛేదించాడు. చిరునవ్వుతో బాలాత్రిపుర సుందరి ధనుస్సు నుండి బయటకు వచ్చింది.
మహా సరస్వతీదేవి అంశయే మహాకాళి. ఆ దేవిని బాలాబీజ మంత్రంతో ఉపాసన చేసి, సర్వ విద్యాపారంగతుడై, వాక్సుద్ధిని పొంది, మహాకవి అయిన వాడు మహాకవి కాళిదాసు. ఇది త్రిపుర సుందరీ మహాత్మ్యం. ‘శ్యామకృష్ణ సోదరి, శుకశ్యామల త్రిపుర సుందరి ఈ మహిలో నీ సమాన దైవమెందు గాననే కామాక్షీ’ అంటూ శ్యామశాస్ర్తీ జగన్మాతను కీర్తిస్తే ‘‘గానలోలే బాలే పంచదశాక్షరి పాహిమాం’’ పంచదశాక్షరి రూపిణియైన బాలాత్రిపుర సుందరిని నాగ వరాళి రాగంలో నాదాత్మకంగా అర్చించాడు- ముత్తుస్వామి దీక్షితులు. దేవీకటాక్ష సిద్ధిని లోక కల్యాణానికి ఉపకరించి, సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని ఉద్బోధిస్తోంది శ్రీ బాలాత్రిపురసుందరీ పూజ.
త్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి ప్రథమస్థానంలో వుంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్తదేవీ మంత్రాలలోకెల్ల శ్రీబాలామంత్రం గొప్పది. శ్రీవిద్యోపానకులకు ముందుగా బాలామంత్రాన్నే ఉపదేశిస్తారు. బాలామంత్రోపదేశంలేనివారు శ్రీచక్రార్చన చేయడానికి అనర్హులే. ఎందుకంటే మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందు గా ఈ బాలాదేవి అనుగ్రహం పొందిన తరువాతే, మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహానికి పాత్రులమవుతాం. ఆ తల్లి అనుగ్రహం అర్చకులకే కాదు, అర్చన చేయించేవారికి. కూడా కావాలి కదా! అందుకే ఆ దేవి స్వరూపం ఎలా ఉంటుందో భక్తులందరికీ తెలియడం కోసం ఈ అలంకారం చేస్తారు. అంతే కాదు, సకలశక్తి పూజలకూ మూలమైన శ్రీబాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వరసత్ఫలితాలనిస్తాయి.బాలత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగిపోతుందని విశ్వాసం. బాలా శబ్దానికి అన్నెము, పున్నెము ఎరుగని బాలిక అని అర్థం. చిన్న పిల్లల మనస్సు నిర్మలంగా ఉంటుంది. అటువంటి హృదయాలలో పరమాత్మిక నివసిస్తుంది. కాబట్టి మనం చిన్న పిల్లలలాగా నిర్మలంగా అమ్మవారిని ఆరాధించాలి.
అలాగే బాలా శబ్ధానికి జ్ఞానం అని అర్థం కూడా ఉంది. బాలాస్వరూపమైన అమ్మవారిని ఎవరు అర్చిస్తారో వారా జ్ఞానానందంతో కామక్రోధాలను జయించి ఆత్మానందాన్ని పొందగలరు. అందుకే నవరాత్రుల్లో ప్రథమ దివసాన అమ్మవారిని బాలపరమేశ్వరిగా ఆరాధన చేసి అజ్ఞానాన్ని పారద్రోలడానికి ప్రయత్నించాలని పండితులు చెబుతున్నారు. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి. "
No comments:
Post a Comment