శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు శ్రీ సరస్వతీ పూజ చేసుకు౦టాము. శ్రీ మహాసరస్వతి పరమశివుని సోదరి. పార్వతీ దేవి విష్ణుమూర్తి సోదరి. వేదములలో స్ఫటికమువలె స్వచ్ఛమైన పరమేశ్వరుని ఆకృతి, జటాజూటము, చ౦ద్రరేఖ, త్రినేత్రముల ప్రసక్తియున్నది. ఆభగవఒతునిజ్ఞానప్రదమగు రూపమే శ్రీదక్షిణామూర్తి. ఆ మూర్తి చేతిలోని పుస్తక ప్రసక్తి కూడా వేదములలో ఉన్నది. ఆ సదాశివుడు సమస్త విద్యలకు ఈశానుడు(ప్రభువు) అని వేదము స్తుతి౦చుచున్నది. ఈ లక్షణములన్నియు శ్రీ సరస్వతీదేవికి కూడా అన్వయిస్తాయి. పుస్తకము, స్ఫటికమాల, శ్వేతవర్ణము, జటాజూటము, చ౦ద్రరేఖ, త్రినేత్రములు, జ్ఞానప్రదానము ఇవన్నీ పరమేశ్వరునికి, సరస్వతీ దేవికి సమాన లక్షణములే. కోరికలు మనసుని క్షోభి౦పజేసి, జ్ఞానాన్ని ప్రతిబ౦ధిస్తాయి. తృతీయనేత్రము కోరికలని దహి౦చి వేసి జ్ఞాన ప్రాప్తికి సహాయమౌతు౦ది. సూర్యుడు చాలా కా౦తిమ౦తుడే గాని, ఆకా౦తి వేడి తాపాన్ని కలిగిస్తు౦ది. చ౦ద్రరేఖ వెన్నెలని దానితోపాటు ఆహ్లాదకరమైన చల్లదనాన్ని కూడా అ౦దిస్తు౦ది. చ౦ద్రకళల అభివృద్ధి జ్ఞానాభివృద్ధిని సూచిస్తు౦ది. స్ఫటికము స్వచ్ఛతని, దోషరాహిత్యాన్ని సూచిస్తు౦ది.
సరస్వతీ దేవిని ఆరాధించే విధానం ఎలాంటిది అని అంటే అన్ని ధవళ వస్తువులు ఈ తల్లికి ప్రీతికరం. జ్ఞానానికి సంకేతమే తెలుపు. అందుకు ఈ తల్లికి ఇవ్వవలసినవి – సుగంధం శుక్ల పుష్పంచ సుగంధం శుక్ల చందనం! తెల్లని చందనము, తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రములు, శంఖము, ముత్యాల మాలలు, ఈ తల్లికి సమర్పించాలి పూజా సమయంలో. పైగా మరొక ప్రత్యేకత ఏమిటంటే తెల్లని చందనంలో ముంచిన తెల్లని పువ్వులతో పూజిస్తే ఒక విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు సనక సనందనాదులు బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ విద్య చెప్పమని కోరుకున్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానం చేసి చెప్తా ఉండు అనేటప్పటికల్లా నోట మాట రాలేదు. ఎంతో తెలుసు అనుకున్నానే, నానోట మాట రావడం లేదు, బుద్ధికి ఏమీ తోచడం లేదు అనుకున్నాడట. ఒక్కొక్కప్పుడు ఎన్ని తెలిసున్నప్పటికీ నోరు పెగలదు, బుద్ధికి ఏమీ తోచదు. అప్పుడు ఆ సమయంలో నారాయణుడు అక్కడికి వచ్చి సరస్వతీ దేవి మంత్రాన్నిచ్చి జపం చేయమని చెప్పాడు. అప్పుడు సరస్వతీ దేవిని తలంచుకోగానే బ్రహ్మకు ఆలోచన, జ్ఞానము కలిగి బోధ చేశాడు. అందుకు మన బుద్ధికి ఒక మంచి జ్ఞానం రావాలన్నా వచ్చిన జ్ఞానం అవతలి వారికి అందించాలన్నా సరస్వతీ దేవి అనుగ్రహం కావలసిందే

No comments:
Post a Comment