మరణించిన వ్యక్తి మళ్ళీ జీవిస్తాడు. "జంతూనాం నరజన్మ దుర్లభం" అంటాయి ప్రమాణ వాక్యాలు. ఎంతకాలానికి జన్మిస్తాడు? అనేది అతడు చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పిండ ప్రదానాదికాలు మరణించిన ఒకవ్యక్తికి సంబంధించినవి కావు. మరణించిన వ్యక్తి, అతని తండ్రి, తండ్రికి తండ్రి, వారి భార్యలు, ఇతర బంధువులు, ఎంతోమందిని అందులో చూపిస్తాం. "ఆదౌపితా తథా మాతా సపత్నీ మాతరస్తథా" ఈవిధంగా మహాలయంలో 20వర్గాల వారిని మనం చూపిస్తాం. ఈ పితరులంతా జన్మించారో లేదో? అనే ధర్మ సందేహం లేకుండా ఉండడానికి పిండప్రదానం. పితరులు ఒక్కడే, మళ్ళీ ఒక్కడుగానే జన్మిస్తాడు కదా అనే సూక్షమైన కుశంకలు సంప్రదాయంలో లేవు. "నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై- మంత్రాలలో ఏమి చెప్తారు అంటే పితృ శబ్దము బహు వ్యాపకము. విశ్వమంతా వ్యాపించిన చైతన్యానికే పితృత్వ శక్తి ఉంది. ఇక్కడ ఒక వ్యక్తీ, ఒక రూపము అని కాదు. ఆ తండ్రి మరణించిన తర్వాత అనేక రూపాలు పొందవచ్చును. ఆ జీవించే రూపాలు వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. అందుకే నానారూపాలలో పితృ శబ్దాన్ని ప్రయోగించి పిండ ప్రదానాదికాల్ని ఏర్పాటు చేయాలి అని చెప్తాయి ధర్మశాస్త్రాలు.
No comments:
Post a Comment