సప్త
చిరంజీవులలో ఒకరైన ఈయన గౌతమ వంశీయుడగు శరద్వాను మహర్షి కుమారుడు.
ధనుర్విద్యయందు ఆరితేరిన వాడు. అనుభవజ్ఞుడు. ఇతని సోదరి పేరు 'కృపి'. శంతను
మహారాజు కృపతో వీరిని పెంచి పెద్దజేసెను. అందుచే ఇతడు 'కృపుడు' అనియు,
ఈతని సోదరి 'కృపి' యనియు పేరొందిరి. యితడు
వేద శాస్త్ర పారంగతుడు, ధర్మాత్ముడు, సద్గుణ సంపన్నుడు, సదాచారుడు.
ద్రోణాచార్యుని కంటెను ముందుగా కౌరవ పాండవులకును, యాదవులకును ధనుర్విద్యలను
నేర్పుచుండెడి వాడు. సమస్త కౌరవ వంశము నాశనము అయినను యితడు జీవించియే
యుండెను. అనంతరము పరీక్షిత్తునకు అస్త్రవిద్యను నేర్పెను. యితడు గొప్ప
వీరుడు. ఎదుటి పక్షమును జయించుటలో కడు నేర్పరి. అందుచేతనే ఇతని పేరుతో
పాటు 'సమితింజయః' అను విశేషణము చేర్చబడినది.
No comments:
Post a Comment