త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి,మహాలక్ష్మీ ,పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజo !
జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యుల లో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మద్వాచార్యులు జన్మించిన మాసం. దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !
ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు "దేవి నవరాత్రులు ". సంప్రదాయబద్ధంగా పూజలు చేయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి . దేవి పూజను ఆశ్వయుజ మాసం అష్టమి, నవమిలలో పూజించిన భక్తులను ఎటువంటి సోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు, అమ్మవారి పటానికి గాని, విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర ,నామ పారాయణలను చేయవచ్చు.
ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండ దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది.
అలాగే, ఈ మసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని, కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను.
పూర్ణిమ నాడు " నారదీయ పురాణము"ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.
పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మి దేవి సంతోషించి, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.
ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం ,మఠము ప్రాకారాల్లోను , వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వేలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది.
ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సోంతం చేసుకున్న మాసం -- ఆశ్వయుజ మాసం !
ఈ మాసం లో చేసె పూజలు, విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.
అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.
తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి ...కరుణామయి..ఆ తల్లి !!!!
శ్రీ దుర్గా దేవ్యై నమో నమః !!!

No comments:
Post a Comment