పాదరస శివలింగం

హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం శివుని లింగాలు చాలా రకాలు వున్నాయి. వాటన్నింటినీ ఆధ్యాత్మికంగా ఆదరిస్తూ.. పూజించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి వుంటుంది. అటువంటి శివలింగాలలో పాదరస శివలింగం కూడా ఎంతో ముఖ్యమైంది. శివలింగాలలోనే ఈ పాదరస శివలింగం ఎంతో శక్తివంతమైంది. ఈ పాదరస శివలింగాన్ని శాస్త్రయుక్తంగా, మంత్రాలతో, విధి విధినాలతో పూజిస్తే.. గృహాల్లో వున్న కష్టాలన్నీ తొలగిపోయి.. ఎటువంటి లోటు లేకుండా అన్ని కోర్కెలను ఆ పరమేశ్వరుడు తీరుస్తాడని ప్రాచీనకాలం నుంచి పురోహితులు, జ్యోతిష్య నిపుణులు, పండితులు విశ్వసిస్తూ వస్తున్నారు.

ముఖ్యంగా పాదరస శివలింగాన్ని పండుగరోజులలో పూజిస్తే.. విశేష ఫలితాలు లభిస్తాయి. అందులో ఉగాది రోజున పూజిస్తే.. సకల పాపాలు తొలగిపోయి, పుణ్యం లభిస్తుందని పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అన్ని విధాలుగా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతినెలా ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి రోజుల్లో పారదస శివలింగాన్ని పూజించినవారికి మనోభీష్టాలు నెరవేరుతాయి. అదేవిధంగా అక్షయ తృతీయనాడు ఈ పాదరస లింగాన్ని పూజిస్తే.. పేదరికాన్ని దూరం చేసి అష్టైశ్వరాలను ఈశ్వరుడు ప్రసాదిస్తాడు.

సంవత్సరం పొడవునా వున్న మాసాలలో కార్తీకమాసం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైనది. అటువంటి మాసంలో పాదరస లింగాన్ని ఆరాధ్యంగా, ఆధ్యాత్మికంగా అర్చిస్తే.. మహాద్భాగ్యం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఈ లింగాన్ని పూజిస్తే.. ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలా ఈ విధంగా పాదరస లింగాన్ని విశిష్ట రోజులలో పూజించడం వల్ల.. సుఖసంతోషాలతోపాటు అష్ట ఐశ్వర్యాలను కూడా ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు

No comments:

Post a Comment