రామకోటిని పూర్తి చేశాను..ఉద్యాపన ఎలా చేయాలి?

పూర్తి చేసిన రామకోటిని రామ నామ కోటి జపయజ్ఞం అని పిలవాలి. వ్రాసిన ఆ గ్రంథాలను ఒక పసుపు పచ్చని వస్త్రంలో మూటకట్టి శిరస్సుపైన పెట్టుకొని ఇంటిలో రామచంద్రమూర్తిని అర్చించి రామ ధ్యానం చేస్తూ కాలి నడకన భద్రాచలానికి చేరి అక్కడ రామకోటి గ్రంథాలన్నీ భద్రపరిచే విశాలమైన గదిని ఏర్పాటు చేసి ఉంచారు. అక్కడ ఈ గ్రంథాలను రామార్పణం అంటూ సమర్పించాలి. కాలినడకన వీలు కాని పక్షంలో ఇతర యాంత్రిక ఉపాయాలను, సాధనాలను వినియోగించి వాటిని భద్రాద్రి చేర్చవలసి ఉంటుంది. ఇది మొదటి విధానం. ఒకవేళ ధనం ఉండీ అవకాశం ఉన్న పక్షంలో మీ గ్రామంలో కూడా రామాలయం ఏర్పాటు చేసి ఆ రామాలయంలో రామకోటి స్తంభం అన్న పేరుతొ ఒక స్తంభాన్ని నిర్మించి ఆ స్తంభములో ఈ గ్రంధములన్నీ నిక్షిప్తం చేసి రామ నామాంకితం గా ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసి పూర్ణాహుతి చేసి ఆ రామకోటి జపనామ సంకల్పం నుండి పరిపూర్ణంగా విడుదల కావచ్చును. ఉద్యాపన ఈవిధంగా కూడా చేసుకోవచ్చు. శక్తి ఉంటే యజ్ఞం చేసి స్తంభాన్ని నిర్మించి ఆ స్తంభంలో ఈ గ్రంథాలను నిక్షిప్తం చేయండి. శక్తి లేని పక్షంలో భద్రాద్రికి చేర్చండి. అక్కడ కోటానుకోట్లమంది వ్రాసిన అసంఖ్యాక రామకోటి గ్రంథాలు రామార్పణం చేయబడి ఉన్నాయి.

Photo: రామకోటిని పూర్తి చేశాను..ఉద్యాపన ఎలా చేయాలి?

No comments:

Post a Comment