ఈ రెండింటిలో దేని ప్రశస్తి దానికున్నది. సంవత్సర కాలంలో మనం ఋతువుల ప్రకారం చూస్తే వసంత ఋతువు ప్రథమంగా వస్తున్నది. ఋతువుల ప్రకారం సంవత్సరారంభం చైత్రమాసంలో వచ్చే తొమ్మిదిరోజులు వసంత నవరాత్రులు చేస్తాం. మనకు శివపురాణం ప్రకారంగా, దేవీ పురాణం ప్రకారంగా ఉన్న విషయం ఏమిటంటే చైత్రశుద్ధ నవమి నాడు అమ్మవారు పార్వతీ దేవిగా అవతరించారు కనుక ఆ నవమికి పూర్వం వచ్చే తొమ్మిదిరోజులు కలుపుకొని వసంత నవరాత్రులు చేస్తూన్నాం. ఇది సంవత్సరారంభ విశేషం. ఆనాడు వసంత నవరాత్రులు చేయడం వల్ల సంవత్సరమంతా క్షేమంకరంగా ఉండడం ఒక ప్రశస్తి.
శరన్నవరాత్రులు – ఈ శరన్నవరాత్రులలో “శాంభవీ శారదారాధ్యా” అని ప్రసిద్ధి. శరత్కాలంలో అమ్మవారిని ఆరాధించడం అనేది. శరత్ అనేటటువంటిది ఒక లెక్కలో చూస్తే సంవత్సర గణనానికి ఇది ఆరంభం. “పశ్యేమ శరదశ్శతం, జీవేవ శరదశ్శతం, నందామ శరదశ్శతం,” – అని వేదం చెప్తోంది. అంటే సంవత్సర గణన చేసేటప్పుడు శరత్తులతో లెక్కించారక్కడ. మరొక విశేషం ఏమిటి అంటే నక్షత్ర రీత్యా మనం పరిశీలిస్తే ఆశ్వయుజ మాసం అశ్వినీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చేటటువంటి మాసం. నక్షత్రాలలో మొదటిది అశ్వినీ నక్షత్రం. నక్షత్ర గణనంతో మొదలుపెట్టి చూస్తే ఆశ్వయుజం ఒక విధంగా ప్రథమ మాసం అవుతున్నది. అలా ఒక సంవత్సరాన్ని లెక్కించవచ్చు. ఆ కారణం చేత ఈ శరన్నవరాత్రులు చేసినట్లైతే ఇక్కడినుంచి సంవత్సరకాలమంతా క్షేమంకరంగా ఉండడమొకటి, అదేవిధంగ ఇప్పుడు రానున్న ఋతువులని యమదంష్ట్రికలు అని అంటారు. అంటే ప్రాణాపాయం మొదలైనవి కలిగించే వాతావరణం ఏర్పడతాయి. నరకబాధలకు అవకాశం ఉంటుంది. అమ్మవారిని ఆరాధించినప్పుడు అటువంటి బాధలు దుఃఖాలు తొలగుతాయి కనుక ఈ సమయంలో శరన్నవరాత్రుల ఆరాధన. ఇలా రెండు నవరాత్రులకీ ప్రాధాన్యమున్నది. దేనిగురించి చెప్తే అదే ప్రసిద్ధిగా కనపడుతూ ఉన్నది.

No comments:
Post a Comment