కార్తీక పౌర్ణమినాడు రెండు విశేషమైన లక్షణాలు ఉంటాయి. ౧. దీపము. ౨. జ్వాలా తోరణము. జ్వాలా తోరణం అని ప్రతి శివాలయం ముందు పెడతారు. ప్రతి శివాలయం ముందు గడ్డితో తోరణం కట్టి ఆ తోరణాన్ని వెలిగిస్తారు. పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళ్లి మూడు మార్లు దాని క్రింది నుంచి తిరుగుతారు. దాంతో పాటు మిగిలిన వాళ్ళు అందరూ తిరుగుతారు. ఆ తర్వాత కొంచెం కాలి వచ్చినా ఆ గడ్డి తీసుకు వచ్చి గడ్డి వాములలో పెడతారు. అలా చేయడం వల్ల పంట పొలాలలో గడ్డికి కానీ, ఇంట్లో ధాన్యానికి గానీ లోటు లేకుండా సస్యశ్యామలంగా ఉంటాయి అన్నీ అని ప్రతీతి. చక్కగా ఇల్లు అభివృద్ధిలో ఉండాలి, పొలాలు అభివృద్ధిలో ఉండాలి అని.
జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారు అంటే ఇహమునందు మనము చేసిన పాపముల చేత భైరవునియొక్క దర్శనం అవుతుంది అంటారు శరీరం విడిచి పెట్టగానే. భైరవ - భై అని; రవ - అరిచేది. అది నోరు తెరుచుకొని కుక్క తరుముతుంది అని. చేసిన పాపాలకి శరీరం విడిచిపెట్టినప్పుడు. అప్పుడు మంటలతో కూడిన తోరణం క్రింది నుంచి యమ పురిలోకి ప్రవేశిస్తాడు అని. ఆ మంటలతో ఉన్న తోరణం లో నుంచి లోపలకి వెళ్ళడమే ఎంతో ఖేద పడతాడట. ఆ మంటలతో కూడిన యమ ద్వారంలోనుంచి వెళ్ళవలసిన అవసరం పోవాలంటే బుద్ధి తెచ్చుకొని పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వెళ్లి ఈశ్వరా! ఇంకెప్పుడూ నేను తప్పు చేయను, నేను జాగ్రత్తగా ఉండేటట్లుగా నన్ను నువ్వు అనుగ్రహించు అని కోరుకొని ఇక్కడ జ్వాలాతోరణం వెలిగించి పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఎవరు పరుగెడతారో వారు ఆ తోరణం క్రింద పరుగెత్త వలసిన అవసరం ఉండదు. అందుకని జ్వాలాతోరణం పెట్టిస్తారు. భక్తితో శివనామం చెప్తూ పరుగెత్తాలి.

No comments:
Post a Comment